1
00:00:02,294 --> 00:00:03,754
ప్రాదేశికంగా వేరుచేయబడిన జ్ఞాపకాలు మాత్రమే

2
00:00:03,836 --> 00:00:08,132
ఇప్పట్నుంచీ నాకు గుర్తు ఉంటాయని
నేను అంగీకరిస్తున్నాను.

3
00:00:09,218 --> 00:00:11,720
లూమన్ సంస్థలోని ప్రత్యేకమైన బేస్మెంట్
అంతస్థులో ఉన్నప్పుడు, బయటి జ్ఞాపకాలు

4
00:00:11,803 --> 00:00:14,848
నాకు గుర్తు ఉండవు, అలాగే
ఇక్కడి నుండి బయటకు వెళ్లినప్పుడు

5
00:00:14,932 --> 00:00:17,351
ఇక్కడి జ్ఞాపజాలు నాకు గుర్తు ఉండవు.

6
00:00:19,728 --> 00:00:22,898
ఈ మార్పు అనేది సమగ్రమైనదని,

7
00:00:22,981 --> 00:00:25,526
అలాగే దీన్ని పూర్వ స్థితికి చేర్చడం
సాధ్యం కాదని నాకు తెలుసు.

8
00:00:27,569 --> 00:00:29,112
ఈ ప్రకటనలను నేను
నా ఇష్టానుసారమే చేస్తున్నాను.

9
00:00:30,656 --> 00:00:34,117
అంతే అయిపోయింది.

10
00:00:37,204 --> 00:00:38,205
దయచేసి నాతో రండి.

11
00:00:44,920 --> 00:00:48,257
మీ పని అవతారం ఇంకాసేపట్లో
ప్రత్యేకమైన అంతస్థులో మేల్కొంటుంది.

12
00:00:48,340 --> 00:00:51,593
కానీ మీరు ఈవిధంగా, వివేకంగా
ఈ సాయంత్రం, లిఫ్ట్ నుండి

13
00:00:51,677 --> 00:00:53,136
బయటకు వచ్చేటప్పుడు ఉంటారు.

14
00:00:53,220 --> 00:00:54,221
సరే.

15
00:00:54,763 --> 00:00:58,267
తల తిరిగినట్టు అనిపిస్తే పట్టుకోవడానికి,
లిఫ్టులో చేతికి అందేలా ఒక హ్యాండిల్ ఉంది.

16
00:00:58,350 --> 00:00:59,768
ఓరి దేవుడా.

17
00:01:02,437 --> 00:01:04,815
ఆయన ముఖంపై సూర్య కిరణాలు
పడినప్పుడు చూడటం నాకు చాలా ఇష్టం.

18
00:01:06,483 --> 00:01:09,361
ఆయన ప్రతిరోజూ ఉదయం పాలతో పాటు
మూడు పచ్చి గుడ్లు తినేవాడు తెలుసా?

19
00:01:09,444 --> 00:01:10,445
నేను కూడా విన్నాను.

20
00:01:10,529 --> 00:01:12,114
అతనికి చాలా ఇష్టమైన టిఫిన్ అది.

21
00:01:12,990 --> 00:01:14,533
మిమ్మల్ని ఇక్కడ సంసిద్ధం చేస్తాం.

22
00:01:15,576 --> 00:01:17,160
- శుభోదయం, లారెన్స్.
- శుభోదయం.

23
00:01:43,854 --> 00:01:45,189
ఇది నొప్పి కలిగించదని అంటుంటారు.

24
00:01:46,190 --> 00:01:47,733
కెటమిన్

25
00:01:50,068 --> 00:01:51,403
ప్రశాంతంగా ఉండండి.

26
00:02:07,669 --> 00:02:09,378
ఇప్పుడు కాస్తంత
గిర్రుమంటున్నట్టు అనిపిస్తుంది.

27
00:02:24,269 --> 00:02:26,271
లూమన్

28
00:02:26,355 --> 00:02:28,565
లూమన్ వేర్పాటు పద్ధతి
మైక్రోచిప్ టెక్నాలజీ

29
00:02:47,501 --> 00:02:50,003
ఇదెలా జరిగిందో మీకు చెప్పడానికి
నేను పైనే ఉంటాను.

30
00:02:51,964 --> 00:02:53,757
అప్పుడు పిచ్చిపిచ్చిగా
ప్రవర్తిస్తే మన్నించండి.

31
00:02:55,509 --> 00:02:58,428
కంగారుపడకండి. మీరు ఎప్పుడెప్పుడు
వస్తారా అని ఎదురుచూస్తుంటాను.

32
00:03:40,721 --> 00:03:41,805
హేయ్, హెల్లీ.

33
00:03:42,931 --> 00:03:43,932
ఏం జరుగుతోంది?

34
00:03:44,016 --> 00:03:45,142
మిమ్మల్ని చూడటం చాలా బాగుంది.

35
00:03:46,310 --> 00:03:48,103
మీపై జాయినింగ్ ఫార్మాలటీలన్నీ
చాలా బాగా గడిచాయి.

36
00:03:51,231 --> 00:03:52,232
ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను?

37
00:03:52,733 --> 00:03:57,404
సరే, అప్పుడప్పుడు కొత్తగా చేరిన ఉద్యోగి
ప్రత్యేకమైన అంతస్థుకు అలవాటు

38
00:03:57,487 --> 00:03:59,698
పడుతున్నప్పుడు, మేము వారిని
ఈ మెట్ల దగ్గరికి తీసుకువస్తాం,

39
00:03:59,781 --> 00:04:01,658
తద్వారా వారు మార్పును
భావావేశపరంగా అనుభవించగలరు.

40
00:04:01,742 --> 00:04:03,619
అయ్యయ్యో. నేను వెళ్లిపోవడానికి
ప్రయత్నిస్తున్నానా?

41
00:04:03,702 --> 00:04:04,912
లేదు, లేదు.

42
00:04:04,995 --> 00:04:06,455
ఇదంతా ప్రక్రియలో భాగమే.

43
00:04:06,538 --> 00:04:08,957
మీరు తిరిగి వెనక్కి వెళ్లాలనుకుంటే
నిశ్చింతగా ఆ పని చేయవచ్చు.

44
00:04:13,837 --> 00:04:14,838
నమస్తే.

45
00:04:17,757 --> 00:04:20,427
- ఏం జరుగుతోంది?
- మరేం పర్వాలేదు.

46
00:04:21,261 --> 00:04:22,846
అస్సలు సమస్యే కాదు.

47
00:04:22,930 --> 00:04:24,640
మరోసారి ప్రయత్నించి చూస్తారా?

48
00:04:24,723 --> 00:04:26,141
ఇంకాస్త ఉత్సాహంతో ప్రయత్నించండి.

49
00:04:31,480 --> 00:04:32,814
హాయ్.

50
00:04:32,898 --> 00:04:33,982
నేను మెట్ల దగ్గర ఉన్నాను.

51
00:04:35,234 --> 00:04:36,777
అంతా బాగానే జరుగుతోంది.

52
00:04:38,028 --> 00:04:39,321
లేదు, తను...

53
00:04:39,404 --> 00:04:40,405
ఓరి దేవుడా!

54
00:04:41,907 --> 00:04:42,991
అయ్యయ్యో, నేను మళ్లీ కాల్ చేస్తాను.

55
00:04:45,244 --> 00:04:46,245
వావ్.

56
00:04:49,081 --> 00:04:50,415
మీలో చాలా కుతూహలం ఉంది.

57
00:04:51,166 --> 00:04:52,501
నాకు లోపలికి వెళ్లాలని లేదు కదా?

58
00:04:52,584 --> 00:04:53,794
మీకు ఉండాలనే ఉందని
మీరు తెలుసుకుంటున్నారు.

59
00:04:54,920 --> 00:04:58,882
హేయ్, మీరు ఇక్కడికి వస్తున్నారని మేము
విన్నాక, అది మాకొక అద్భుతంలా అనిపించింది.

60
00:04:59,550 --> 00:05:01,593
మీరు ఏదైతే చేస్తున్నారో
అది మామూలు విషయం కాదు.

61
00:05:24,283 --> 00:05:25,367
హేయ్, విధేయత గల ఉద్యోగి!

62
00:05:25,868 --> 00:05:27,160
మొదటి రోజు గడిచిపోయింది.

63
00:07:01,296 --> 00:07:04,383
లూమన్
సీనియర్ రిఫైనర్ ఉదయపు చెక్ లిస్ట్

64
00:07:04,466 --> 00:07:06,176
రెస్ట్ రూములోని సోప్ డిస్పెన్సర్ ని
రీఫిల్ చేయండి

65
00:07:06,260 --> 00:07:08,762
కియర్ ఈగన్ ప్రతిమకి నమస్కరించండి.
స్వీయ అంచనా: ఇవాళ నేను నాయకత్వం వహించగలనా?

66
00:07:11,265 --> 00:07:13,433
లూమన్
స్పెషల్ కాఫీ

67
00:07:43,964 --> 00:07:45,966
నియమాల పాలనకు సంబంధించిన హ్యాండ్ బుక్

68
00:07:53,682 --> 00:07:55,684
మార్క్ ఎస్ - అలెన్ టౌన్

69
00:08:42,231 --> 00:08:43,232
హేయ్.

70
00:08:44,232 --> 00:08:45,234
హేయ్.

71
00:08:45,317 --> 00:08:46,610
అయితే నేను చేరి ఒకరోజు అయిపోయిందా?

72
00:08:47,903 --> 00:08:48,946
అవును.

73
00:08:49,029 --> 00:08:50,822
ఇవాళ సోమవారం.

74
00:08:51,615 --> 00:08:53,200
- అప్పుడే వారాంతం అయిపోయిందా?
- అవును.

75
00:08:53,283 --> 00:08:54,701
ఆ విషయం నాకు అస్సలు
తెలీను కూడా తెలీలేదు.

76
00:08:54,785 --> 00:08:57,496
అవును, ఇక్కడికి వచ్చాక, రాత్రుళ్లు,
వారాంతాలు అలాగే అనిపిస్తాయి.

77
00:08:58,288 --> 00:08:59,289
అస్సలు జరగనట్టే అనిపిస్తాయా?

78
00:08:59,373 --> 00:09:00,499
అంటే, నీకు అలవాటు అయిపోతుందిలే.

79
00:09:00,582 --> 00:09:03,210
నేను నిద్ర తాలూకు ప్రభావాలను ఊహించుకుంటా,
అది నాకు ఉపయోగపడుతుంది కూడా,

80
00:09:03,293 --> 00:09:05,629
ఎందుకంటే దాన్ని ఇక్కడ ఉన్నప్పుడు
మనం ఎలాగూ అనుభవించలేము కదా.

81
00:09:05,712 --> 00:09:09,216
నీకు ఉల్లాసంగా లేదా
ఆనందంగా అనిపించవచ్చు.

82
00:09:09,299 --> 00:09:11,885
భుజాల నుండి బరువు తగ్గుతుంది.
చలాకీగా అనిపిస్తుంది.

83
00:09:14,221 --> 00:09:15,931
ఇప్పుడు ఉదయం 09:05 అయిందా?

84
00:09:16,014 --> 00:09:19,268
అవును, మనం బయట కలవకూడదని లోపలికి
కూడా వాళ్లు ఒక్కొక్కళ్లనే పంపుతారు.

85
00:09:19,351 --> 00:09:20,686
అది చాలా ముఖ్యం కూడా.

86
00:09:23,313 --> 00:09:24,940
అయితే, మనం స్నేహితులం కాదన్నమాట.

87
00:09:26,733 --> 00:09:27,901
కాదనే అనుకుంటున్నా.

88
00:09:32,072 --> 00:09:33,657
ప్రస్తుతం నేను పని చేసే
ఫైల్ పేరు "టమ్వాటర్"...

89
00:09:33,740 --> 00:09:34,950
లూమన్ పరివారానికి స్వాగతం

90
00:09:35,033 --> 00:09:36,368
...దీన్ని 11 వారాల క్రితం ప్రారంభించాను.

91
00:09:36,451 --> 00:09:37,786
"టమ్వాటర్." ఒకే పదం.

92
00:09:37,870 --> 00:09:39,413
నేను నోట్ చేసుకోవాలా?

93
00:09:39,496 --> 00:09:41,832
- అక్కర్లేదు.
- నేను 96% చేసేశాను,

94
00:09:41,915 --> 00:09:44,585
అంటే అయిదు స్థాయిల ప్రోత్సాహకాలలో
నాలుగింటిని సాధించేశాను అన్నమాట,

95
00:09:44,668 --> 00:09:49,256
వాటిలోవే ఇక్కడ ఉన్న ఎరేజర్లు,
ఫింగర్ ట్రాప్ పజిల్స్.

96
00:09:49,840 --> 00:09:53,010
నూరు శాతం అంటే అయిదవ స్థాయి ప్రోత్సాహకం.
ఒక ప్రత్యేకమైన ఫోటో దక్కుతుంది.

97
00:09:53,802 --> 00:09:56,972
ఆ విషయంలో ఇతరులకు అసూయ కలిగించేంత
సంఖ్యలో రివార్డులను సంపాదించాను.

98
00:09:57,055 --> 00:09:58,515
- వావ్.
- అవును.

99
00:09:58,599 --> 00:10:00,976
ఇవేంటి అని అనుకుంటున్నావా?
నేను పూర్తి చేసేసిన ఫైళ్లు.

100
00:10:01,685 --> 00:10:03,312
అయితే అదేనా టాప్ అవార్డు?

101
00:10:03,395 --> 00:10:04,521
పర్సంటేజీ వారీగా చూస్తే, అదే.

102
00:10:04,605 --> 00:10:06,690
కానీ మనం త్రైమాసికాంతానికి
అంకెల లక్ష్యాన్ని చేరుకుంటే,

103
00:10:06,773 --> 00:10:08,817
మనలో ఒకరికి త్రైమాసికపు అత్యుత్తమ
రిఫైనర్ గా అవార్డు లభిస్తుంది,

104
00:10:08,901 --> 00:10:11,195
అప్పుడు నాకు వాఫుల్ పార్టీకి
ఆహ్వానం లభిస్తుంది.

105
00:10:11,278 --> 00:10:12,863
ఏంటి, వాఫుల్ పార్టీయా?

106
00:10:12,946 --> 00:10:14,364
వావ్, కాస్త నిదానించు, పాపా.

107
00:10:14,448 --> 00:10:17,701
ఈ త్రైమాసికానికి అది నాకే దక్కుతుంది,
కాబట్టి, ఆశలేవీ పెట్టుకోకు.

108
00:10:20,621 --> 00:10:22,414
మార్క్ దగ్గర ఉన్న ఆ తలకాయ క్రిస్టల్ ఏంటి?

109
00:10:22,998 --> 00:10:25,417
అది అవార్డు కాదు,
అది అతనికి వాళ్లు ఇచ్చారు.

110
00:10:25,501 --> 00:10:27,878
హెల్లి, కాస్త ఈ సిస్టమ్ ని ఆన్ చేయగలవా?

111
00:10:44,144 --> 00:10:45,479
సరే మరి.

112
00:10:48,065 --> 00:10:49,191
అది... ఒక్క నిమిషం.

113
00:10:50,150 --> 00:10:52,277
సియానా

114
00:10:56,406 --> 00:10:58,951
మార్క్, అంతరాయానికి మన్నించు, నువ్వు
హెల్లికి శిక్షణ ఇస్తున్నావని తెలుసు.

115
00:10:59,034 --> 00:11:02,246
డెస్కుల మీద నుండి నువ్వు
గ్రూప్ ఫోటోలను తీసేసినట్టున్నావే.

116
00:11:02,329 --> 00:11:05,457
అవును. ఇవాళ హెల్లి పార్టీలో
మనం కొత్తవి తీసుకోబోతున్నాం.

117
00:11:08,669 --> 00:11:11,880
సరే మరి, ఇది సియానా ఫైల్.

118
00:11:11,964 --> 00:11:13,799
ఇక్కడ నీకు కనిపించే డేటా అంతా,

119
00:11:13,882 --> 00:11:17,344
ప్రధానంగా అయిదు విభాగాల్లో
ఏదోకదానికి చెందుతుంది.

120
00:11:17,427 --> 00:11:19,555
మనం కోడులోని ప్రతీ లైనును గ్రూప్ చేసి,

121
00:11:19,638 --> 00:11:24,184
దాన్ని అయిదు డిజిటల్ బకెట్లలోకి
సమానంగా సోర్ట్ చేస్తాము.

122
00:11:24,268 --> 00:11:25,269
వామ్మోయ్.

123
00:11:25,352 --> 00:11:27,229
అలవాటు అయ్యేదాకా ప్రయత్నిస్తూ ఉండు.
యారో బటన్స్ ను ఉపయోగించు.

124
00:11:27,855 --> 00:11:31,233
కొత్త ఫోటోలు వచ్చేదాకా
పాతవి డెస్కుల మీదనే ఉండాలని

125
00:11:31,316 --> 00:11:32,943
నేను అనుకుంటున్నాను.

126
00:11:39,950 --> 00:11:40,951
సరే మరి.

127
00:11:41,535 --> 00:11:43,787
- వీటిని నేనేమైనా మార్చగలనా?
- లేదు.

128
00:11:43,871 --> 00:11:46,331
లేదు, డేటా అంతా పై నుండి
పూర్తిగా ఎన్ కోడ్ చేయబడి వస్తుంది.

129
00:11:47,416 --> 00:11:48,917
అయితే వీటిని నెనెలా వర్గీకరించాలి?

130
00:11:51,003 --> 00:11:52,045
ఏంటి?

131
00:11:53,505 --> 00:11:58,677
ప్రతీ అంకెల కేటగిరీ కూడా రిఫైనర్ లో
ఒక భావావేశపూరిత ప్రతిస్పందనను కలిగించేలా

132
00:11:58,760 --> 00:12:00,971
ఓ నిర్దిష్ట క్రమంలో ప్రదర్శించబడతాయి.

133
00:12:02,055 --> 00:12:07,477
ఉదాహరణకు, మొదటి కేటగిరీలోని
అంకెలు చూడగానే ఒకలాగా అనిపిస్తాయి.

134
00:12:07,561 --> 00:12:10,731
అవి ఇబ్బంది కలిగించే విధంగా,
భయం కలిగించే విధంగా ఉంటాయి.

135
00:12:10,814 --> 00:12:11,815
భయం కలిగించే విధంగానా?

136
00:12:11,899 --> 00:12:13,108
అవును.

137
00:12:13,192 --> 00:12:14,943
అయితే, ఈ స్ప్రెడ్ షిట్ ని స్క్రోల్ చేస్తూ
భయంకరంగా ఉండే అంకెలను

138
00:12:15,027 --> 00:12:16,612
వెతకడమే నా పనా?

139
00:12:16,695 --> 00:12:18,697
అది విచిత్రంగా ఉంది,
మార్క్ కూడా అలాగే చెప్పాడు.

140
00:12:19,281 --> 00:12:21,950
అంకెలు హింసాత్మకమైనవా? అవి నినదిస్తాయా?

141
00:12:22,034 --> 00:12:24,912
అలా కనిపించేదాకా ఇది నమ్మశక్యంగా ఉండదు,
అలా కనిపించడానికి కూడా సమయం పడుతుంది.

142
00:12:24,995 --> 00:12:26,872
హేయ్, మార్క్. గ్రూప్ ఫోటోలను
మార్చడానికి సంబంధించి

143
00:12:26,955 --> 00:12:29,333
హ్యాండ్ బుక్ లో ఉన్న సమాచారాన్ని
నేను ప్రింట్ చేసి తెచ్చాను.

144
00:12:29,416 --> 00:12:32,544
కాస్త తీరిక దొరికినప్పుడు దీన్ని
ఒకసారి చదివితే మంచిది అనుకుంటా.

145
00:12:32,628 --> 00:12:34,463
- థ్యాంక్స్.
- క్షమించు.

146
00:12:37,883 --> 00:12:38,967
నేను ఇక్కడ ఇరుక్కుపోయానా?

147
00:12:41,178 --> 00:12:42,638
నీకు ఎందుకలా అనిపిస్తోంది?

148
00:12:42,721 --> 00:12:46,433
నాకు ఇది నచ్చక నేను మానేయాలనుకుంటే,
నేను మానేయవచ్చా?

149
00:12:50,145 --> 00:12:51,188
చూడు.

150
00:12:52,523 --> 00:12:53,815
నీకు నిజంగా నచ్చకపోతే,

151
00:12:53,899 --> 00:12:58,111
నువ్వు రాజీనామాన్ని నీ పనియేతర అవతారానికి
సమీక్ష కోసం సమర్పించి చూడవచ్చు.

152
00:12:58,195 --> 00:13:00,072
కానీ దాన్ని ఆమోదించాలి కదా.

153
00:13:00,155 --> 00:13:03,867
అవి ఎక్కువగా తిరస్కరించబడుతూ
ఉంటాయన్నది వాస్తవమే, అదీగాక...

154
00:13:05,452 --> 00:13:06,453
ఏంటి?

155
00:13:07,329 --> 00:13:12,167
అంటే, ఈ నీ పని అవతారం కేవలం
లూమన్ లో ఉన్నప్పుడే ఉంటుంది కనుక,

156
00:13:13,001 --> 00:13:15,462
రాజీనామా చేసి వెళ్లిపోతే,
ఈ జీవితాన్ని నువ్వు కోల్పోయినట్టే.

157
00:13:15,546 --> 00:13:17,464
అంటే, నీ జీవితంలో చాలా భాగాన్ని
కోల్పోయినట్టే అన్నమాట.

158
00:13:19,508 --> 00:13:20,968
హలో, రిఫైనర్లారా.

159
00:13:21,635 --> 00:13:23,136
సూపర్. చాక్లెట్స్.

160
00:13:23,220 --> 00:13:24,680
హాయ్, మిస్టర్ మిల్చెక్.

161
00:13:24,763 --> 00:13:27,099
హెల్లి, స్వాగతం.

162
00:13:27,182 --> 00:13:30,686
మీరు ఎంత బాగా కలిసిపోతున్నారో చూస్తుంటే
నాకు చాలా ఆనందంగా ఉంది.

163
00:13:31,728 --> 00:13:33,397
ఇప్పుడు ఆఫీసుకు ఒక కళ వచ్చింది.

164
00:13:34,815 --> 00:13:38,527
ఇక ఈ పార్టీ మొదలుపెడదాం.

165
00:13:44,533 --> 00:13:47,870
మీ అందరికీ తెలుసు, నా పేరు అర్వింగ్.

166
00:13:47,953 --> 00:13:50,122
నేను ఇక్కడ మూడేళ్లుగా పని చేస్తున్నాను,

167
00:13:50,205 --> 00:13:55,002
నా గురించి చెప్పాలంటే, నాకు లూమన్ సంస్థ
యొక్క తొమ్మిది ప్రధాన సూత్రాలన్నీ తెలుసు.

168
00:13:55,085 --> 00:13:57,546
సూపర్. మరి నీకు అన్నింటికన్నా
బాగా ఇష్టమైన సూత్రం ఏంటి?

169
00:14:00,549 --> 00:14:01,550
నాకు ఆ తొమ్మిదీ ఇష్టమే.

170
00:14:02,426 --> 00:14:06,680
కానీ ఇవాళ, నేను "ఉల్లాసం" అని అంటాను.

171
00:14:06,763 --> 00:14:07,764
సూపర్.

172
00:14:11,143 --> 00:14:14,229
అయ్యో! ఇవాళ ఈ నమ్మకంగా
పడిపోవడాలు వద్దులే, అర్వ్.

173
00:14:16,440 --> 00:14:17,441
సరే.

174
00:14:22,279 --> 00:14:24,156
హలో, హెల్లి!

175
00:14:26,158 --> 00:14:28,202
వద్దు, వద్దు.

176
00:14:35,918 --> 00:14:37,878
హలో, నా పేరు హెల్లి.

177
00:14:37,961 --> 00:14:39,671
నేను లూమన్ లో చేరి, సుమారుగా...

178
00:14:40,672 --> 00:14:41,840
మొత్తం మీద పది గంటలు కావస్తోంది, ఇంకా...

179
00:14:44,426 --> 00:14:46,553
మన్నించాలి, నా గురించి నాకు ఏమీ తెలియదు.

180
00:14:47,554 --> 00:14:48,847
మీకు తెలిసే ఉంటుంది, హెల్లి.

181
00:14:50,265 --> 00:14:51,308
నాకు నిజంగానే తెలీదు.

182
00:14:52,684 --> 00:14:53,894
నిన్న రాత్రి ఇంటికి వెళ్లాననుకుంటా,

183
00:14:53,977 --> 00:14:56,063
కానీ నా ఇల్లు అంటే ఇండిపెండెంట్ హౌసో,
లేక ఫ్లాటో కూడా నాకు తెలీదు,

184
00:14:56,146 --> 00:14:57,231
లేదా నేను కుటుంబంతో ఉంటానా...

185
00:14:57,314 --> 00:14:59,983
నా పనియేతర అవతారం ఒక రివర్ బోట్ లో
జీవనం సాగిస్తుంటాడు అనుకుంటా.

186
00:15:02,110 --> 00:15:03,612
మన్నించాలి, పనియేతర అవతారాలంటే...

187
00:15:03,695 --> 00:15:06,490
మనమే, కానీ మన బయటి అవతారాలను
అలా పిలుస్తాం.

188
00:15:06,573 --> 00:15:08,784
మీరు మీ పనియేతర అవతారాన్ని
నిన్న వీడియోలో చూశారు.

189
00:15:08,867 --> 00:15:12,120
అవును. నేను ఆమెకి కొన్ని విషయాలు
చెప్పాలి. నేనేమైనా వీడియో తీసి పంపవచ్చా?

190
00:15:14,248 --> 00:15:16,917
పని అవతారానికి, అలాగే పనియేతర అవతారానికి
మధ్య సంప్రదింపులను

191
00:15:17,000 --> 00:15:18,377
ఇక్కడ మేము అనుమతించము.

192
00:15:18,877 --> 00:15:20,462
ఒకవేళ నేనేమైనా చీటీని రాసి పెట్టుకుంటే?

193
00:15:20,546 --> 00:15:24,591
అదృష్టవశాత్తూ, లిఫ్టులలో
"కోడ్ డిటెక్టర్లు" ఉంటాయి.

194
00:15:25,300 --> 00:15:26,969
కాబట్టి సందేశాలు లోపలికి రాలేవు,
అలాగే బయటకూ వెళ్లలేవు.

195
00:15:27,052 --> 00:15:30,472
అవును. అవి రాసిన గుర్తులను
గుర్తించే మెటల్ డిటెక్టర్లు లాంటివి.

196
00:15:30,556 --> 00:15:31,807
లూమన్ వారు రూపొందించిన సాంకేతికత అది.

197
00:15:31,890 --> 00:15:32,975
అవును, అది నిజమే.

198
00:15:33,058 --> 00:15:34,893
సరే. ఒకవేళ నేను...

199
00:15:34,977 --> 00:15:37,688
మీకు ఇక్కడ ఈ ఆట ఎలా ఆడాలో
అర్థం అవుతున్నట్టుగా లేదు, హెల్లి.

200
00:15:38,856 --> 00:15:39,898
నాకు ఇస్తారా?

201
00:15:42,776 --> 00:15:44,027
మిత్రులారా, ఈమె హెల్లి.

202
00:15:44,111 --> 00:15:47,447
తన వయస్సు 30 ఏళ్లు, తనకి బాదాం పప్పులు
పడవు, తన ఎనామెల్ బలహీనమైంది.

203
00:15:48,198 --> 00:15:51,243
ఆమె ఎత్తు 5'6" కనుక, మీ ఆఫీసులో
తను నాల్గవ ఎత్తైన వ్యక్తి,

204
00:15:51,326 --> 00:15:54,496
ఆమె హెయిర్ స్టయిల్ పేరు "షోల్డర్ లెన్త్".

205
00:15:56,123 --> 00:16:00,419
ఆమెకి ఇక్కడ మీ అందరితో చూస్తుంటే,
ఆమెకి ఓ కుటుంబం ఉన్నట్టే అనిపిస్తోంది.

206
00:16:06,341 --> 00:16:09,094
వావ్. చాలా విషయాలు చెప్పేశారు.

207
00:16:09,178 --> 00:16:12,514
నా పేరు మార్క్.

208
00:16:12,598 --> 00:16:18,312
లూమన్ లో రెండేళ్లుగా పని చేస్తున్నా,
ఇంకా నాకు ఈ ఆట అంటే చాలా ఇష్టం.

209
00:16:20,105 --> 00:16:23,567
బాగానే చెప్పావు కానీ,
పోయినసారి కూడా నువ్వు ఇదే చెప్పావు.

210
00:16:24,902 --> 00:16:26,361
నిజమే.

211
00:16:30,199 --> 00:16:31,200
నేను...

212
00:16:36,788 --> 00:16:40,334
ఈ ఉదయం ప్రోటోకాల్ ని ఉల్లంఘించాను.

213
00:16:43,921 --> 00:16:46,924
పీటీతో ఉన్న పాత గ్రూప్ ఫోటోలని
తుడుస్తూ ఉన్నప్పుడు,

214
00:16:47,007 --> 00:16:48,550
నాకు కాస్త...

215
00:16:49,843 --> 00:16:52,054
బాధగా అనిపించింది.

216
00:16:53,639 --> 00:16:55,265
ఇంకా, ఏంటంటే,

217
00:16:56,225 --> 00:17:00,103
ఎండిఆర్ ని అతను నడిపినట్టుగా
నేను నడపలేనేమోనని అనిపించింది.

218
00:17:00,187 --> 00:17:02,231
అవును, నాకు కూడా అలాగే అనిపించింది.

219
00:17:03,565 --> 00:17:04,775
కాబట్టి నేను...

220
00:17:05,776 --> 00:17:08,862
వాటిని డెస్కుల నుండి తీసి
స్టోరేజ్ అరలో పెట్టాను,

221
00:17:08,945 --> 00:17:11,156
కానీ అలా మేము చేయకూడదు.

222
00:17:13,534 --> 00:17:15,702
ఆ విషయాన్ని నేను అతనికి
గుర్తుచేశాను. అభ్యంతరం వ్యక్తం చేశాను.

223
00:17:19,455 --> 00:17:21,124
ఈ విషయాన్ని పంచుకున్నందుకు
థ్యాంక్ యూ, మార్క్.

224
00:17:22,667 --> 00:17:25,253
నీ ప్రతిస్పందన చాలా ముచ్చటగా అనిపిస్తోంది.

225
00:17:25,337 --> 00:17:29,383
అయినా కానీ, నీకు పీటీ విషయంలో
ఉన్న ఇంత ఎమోషనల్ కనెక్షన్,

226
00:17:29,466 --> 00:17:32,553
కెరోల్ డీ విషయంలో ఎందుకు లేదా
అని నాకు ఆశ్వర్యంగా అనిపిస్తోంది.

227
00:17:33,512 --> 00:17:36,557
కానీ కెరోల్ డీ వెళ్లిపోతున్నట్టు
మాకు ముందే తెలుసు.

228
00:17:36,640 --> 00:17:38,600
అంటే, ఆమె పనియేతర అవతారం
థ్యాంక్స్ వీడియోను కూడా పంపారు.

229
00:17:39,560 --> 00:17:41,728
పీటీ హఠాత్తుగా అదృశ్యమైపోయాడు.

230
00:17:43,105 --> 00:17:45,107
అంటే, నాకు... నాకు తెలియట్లేదు,

231
00:17:45,190 --> 00:17:51,488
కొత్త ఉద్యోగంలో చేరాడా, లేదా వెకేషన్ కి
వెళ్ళాడా, లేదా చనిపోయాడా...

232
00:17:51,572 --> 00:17:53,031
ఇక చాలు.

233
00:18:02,916 --> 00:18:05,043
మరణాల్లాంటి అశుభమైనవి ఈ భవనం
బయట జరిగే విషయాలని

234
00:18:05,127 --> 00:18:08,255
మనం ఇప్పుడు గుర్తుచేసుకోవడం మంచిది.

235
00:18:09,715 --> 00:18:10,716
అవి ఇక్కడ జరగవు.

236
00:18:12,134 --> 00:18:15,179
లూమన్ లో అలాంటి వాటి నుండి
సురక్షితంగా ఉంటారు.

237
00:18:16,305 --> 00:18:21,977
కాబట్టి అందుకు మీ అందరూ
కృతజ్ఞతగా ఉండాలనుకుంటా.

238
00:18:30,110 --> 00:18:33,614
ఇంకా, ఇప్పుడు చాక్లెట్లు
తినాల్సిన సమయం ఆసన్నమైంది.

239
00:19:08,732 --> 00:19:10,400
హేయ్, నీ ఆటను చెడగొట్టినందుకు క్షమించు.

240
00:19:11,443 --> 00:19:15,280
నేనే చెడగొట్టాననుకున్నా, కానీ
నువ్వు దానికి ఇంకాస్త ఆజ్యం పోశావు.

241
00:19:18,492 --> 00:19:20,786
అయితే, పీటీ బాగున్నాడా లేదా అని
నువ్వు ఎలా తెలుసుకోబోతున్నావు?

242
00:19:20,869 --> 00:19:23,372
ఆ విషయంలో మిల్చెక్
చాలా స్పష్టంగా చెప్పేశాడు కదా.

243
00:19:24,289 --> 00:19:26,041
మన ఆయా వద్దు అన్నంత మాత్రాన

244
00:19:26,124 --> 00:19:27,918
నువ్వు నీ ఆప్త మిత్రుని గురించి
అడగడం మానేస్తావా?

245
00:19:30,045 --> 00:19:32,214
ఓ విషయం చెప్తాను, మిల్చెక్ చాలా మంచి వాడు.

246
00:19:32,297 --> 00:19:35,175
అతను ఏదైనా చెప్పినప్పుడు,
దాన్ని వింటే మంచిది.

247
00:19:35,259 --> 00:19:38,095
- అది నేను పట్టించుకోను.
- ఎందుకంటే, అతను ఎప్పుడూ మంచిగా ఉండడు.

248
00:19:38,720 --> 00:19:40,097
సరే మరి, రిఫైనర్లారా!

249
00:19:40,180 --> 00:19:43,350
ఎక్కువ తినేసి కడుపు ఉబ్బరంగా కాకముందే
మనం ఒక కొత్త గ్రూప్ ఫోటో తీసుకుందాం.

250
00:19:55,445 --> 00:19:56,488
ఎట్టకేలకు.

251
00:19:59,324 --> 00:20:04,329
సరే మరి. బాగా నవ్వండి. రోజూ మీరు
చూసుకొనేది ఈ ఫోటోనే అని గుర్తుంచుకోండి.

252
00:20:06,164 --> 00:20:07,624
"కృతజ్ఞత" అని అనండి.

253
00:20:08,333 --> 00:20:09,585
కృతజ్ఞత!

254
00:20:12,754 --> 00:20:13,881
"ఉల్లాసం" అని అనండి.

255
00:20:14,423 --> 00:20:15,883
ఉల్లాసం!

256
00:20:20,262 --> 00:20:22,181
హెల్లి? ఏం చేస్తున్నారు?

257
00:20:22,264 --> 00:20:26,143
నేను ఇక ఇక్కడ
పని చేయలేను అనుకుంటా. మన్నించాలి.

258
00:20:26,226 --> 00:20:27,394
అంటే, నీ ఉద్దేశం ఏంటి?

259
00:20:27,978 --> 00:20:28,937
నేను మానేస్తున్నాను.

260
00:20:29,021 --> 00:20:30,731
నాకు ఈ ఫైళ్ళను సోర్ట్ చేసే
పని చేయాలని లేదు, అలాగే

261
00:20:30,814 --> 00:20:33,150
సూర్యుడు కనబడని చోట, కనబడకుండా పోయే
మిత్రులున్న చోట పని చేయాలని లేదు.

262
00:20:33,233 --> 00:20:35,694
- నాకు ఇవేమీ వద్దు.
- కోడ్ డిటెక్టర్లు ఉంటాయని చెప్పాం కదా.

263
00:20:35,777 --> 00:20:39,489
అది నీకు తెలుసా? ఎప్పుడైనా ప్రయత్నించావా?
ఎందుకంటే, అదొక అబద్ధంలా అనిపిస్తోంది.

264
00:20:47,581 --> 00:20:48,582
హెల్లి!

265
00:20:52,127 --> 00:20:53,253
హెల్లి!

266
00:21:04,890 --> 00:21:07,142
దయచేసి విను, నీకు తెలీదు...

267
00:21:09,061 --> 00:21:10,646
ఓరి దేవుడా. కానివ్వు.

268
00:21:20,989 --> 00:21:23,116
అయ్యయ్యో. మిస్టర్ గ్రేనర్?

269
00:21:26,703 --> 00:21:27,704
బయటకు రండి.

270
00:21:33,627 --> 00:21:35,045
ఏం రాశారు?

271
00:21:38,173 --> 00:21:39,675
మీరు నాతో వస్తే మంచిది.

272
00:21:39,758 --> 00:21:40,843
మిస్టర్ గ్రేనర్.

273
00:21:43,554 --> 00:21:47,766
హేయ్. మాట వినని నా ట్రయినీని
మీరు కనుగొన్నట్టున్నారు.

274
00:21:48,892 --> 00:21:50,936
ఎప్పటిలాగానే, మీ సహాయానికి
ధన్యవాదాలు, సర్.

275
00:21:53,981 --> 00:21:54,982
చీటీ.

276
00:21:55,607 --> 00:21:59,403
ఇది నాకు సిగ్గుచేటు విషయమే, కానీ నేను
శిక్షణ ఇవ్వడం ఇదే మొదటిసారి,

277
00:21:59,486 --> 00:22:03,699
డేటా తరలింపుకు సంబంధించిన నియమాలను
హెల్లికి చెప్పడం మర్చిపోయినట్టున్నాను.

278
00:22:05,158 --> 00:22:06,702
మన్నించాలి. ఈమె పేరే హెల్లి.

279
00:22:06,785 --> 00:22:07,786
హెల్లి, ఈయన మిస్టర్ గ్రేనర్.

280
00:22:08,996 --> 00:22:09,997
అదన్నమాట.

281
00:22:12,165 --> 00:22:14,668
కాబట్టి, కోడ్ డిటెక్టర్లను హెల్లి
ట్రిగ్గర్ చేసి ఉంటే,

282
00:22:14,751 --> 00:22:19,298
దానికి కారణం నేనే,
అందుకు నన్ను క్షమించండి, సర్.

283
00:22:19,798 --> 00:22:20,799
మనస్పూర్తిగా కోరుతున్నాను.

284
00:22:22,593 --> 00:22:24,303
డిపార్టుమెంట్ చీఫ్ వి అయిపోయావా, మార్క్?

285
00:22:24,970 --> 00:22:25,971
అదీ...

286
00:22:27,556 --> 00:22:30,517
అయితే నీదే తప్పు. పద మరి.

287
00:23:19,441 --> 00:23:21,777
బ్రేక్ రూమ్

288
00:23:46,635 --> 00:23:47,886
మార్క్.

289
00:23:51,056 --> 00:23:52,933
అయితే మీరు అనధికారికంగా
పురుడు పోస్తుంటారు అన్నమాట?

290
00:23:53,016 --> 00:23:55,352
మంత్రసాని అని చెప్పవచ్చు.

291
00:23:57,688 --> 00:24:01,525
అయితే ఇప్పటిదాకా మీరు ఎంత మందికి
పురుడు పోసుంటారు?

292
00:24:05,404 --> 00:24:06,822
మూడు వందలకు పైగానే ఏమో?

293
00:24:07,447 --> 00:24:09,199
ఎక్కువగా మోంటానాలో ఉన్నప్పుడే జరిగాయి.

294
00:24:09,283 --> 00:24:11,743
- వావ్. అది సూపర్ విషయం.
- అవును.

295
00:24:11,827 --> 00:24:14,162
చాలా ఎక్కువ మందికి పురుడు పోశారు.

296
00:24:14,246 --> 00:24:17,749
అవును.
రోజుకు రెండు డెలివరీలు జరిగేవి.

297
00:24:18,876 --> 00:24:19,918
కాస్త అటూఇటుగా అంతే.

298
00:24:30,012 --> 00:24:32,723
అయితే, వారానికి పదా?

299
00:24:32,806 --> 00:24:34,725
అంటే, వారానికి అయిదు
పని దినాలు అనుకుంటే...

300
00:24:34,808 --> 00:24:36,435
- అంతే అనుకుంటా.
- సరే. అలాగే.

301
00:24:37,436 --> 00:24:41,106
- మీ సోదరికి నచ్చడం కోసం అడుగుతున్నారా?
- లేదు. అదేం లేదు. మీరు నిజంగా సూపర్.

302
00:24:41,190 --> 00:24:42,733
- నేను ఊరికే అన్నానులే.
- నాకు తెలుసు.

303
00:24:52,326 --> 00:24:53,410
థ్యాంక్ యూ.

304
00:24:53,493 --> 00:24:55,996
మీరు లూమన్ లో పని చేస్తారా?

305
00:24:57,122 --> 00:24:58,957
- అవును.
- ఈ ఊరిలో సగం మంది అక్కడే పని చేస్తున్నారు.

306
00:24:59,791 --> 00:25:01,835
నాలోని సగం కూడా అన్నమాట.
సరదాగా అన్నానులే.

307
00:25:02,961 --> 00:25:03,962
భలే తమాషాగా అనిపించింది.

308
00:25:04,046 --> 00:25:09,885
అవును. నేను ఆర్కైవ్స్ విభాగంలో చేస్తాను,
నన్ను కార్పొరేట్ హిస్టోరియన్ అని అనవచ్చు.

309
00:25:10,802 --> 00:25:14,181
చాలా గోప్యమైన అంశాలు ఉంటాయి, అందుకే...

310
00:25:16,892 --> 00:25:18,310
అయితే మీరు ఎవరి తరఫున పని చేస్తున్నారో...

311
00:25:19,770 --> 00:25:23,148
ఏం పని చేస్తున్నారో...
లేదా అసలేదీ కూడా తెలీదా?

312
00:25:23,232 --> 00:25:24,942
అవును, అదే కదా అసలు ఉద్దేశం.

313
00:25:25,025 --> 00:25:27,319
- ఒకవేళ దొంగతనంగా చీటీ పెట్టుకొని వస్తే?
- చీటీలు లాంటివి పెట్టుకొని రాలేం.

314
00:25:27,903 --> 00:25:28,946
అయితే...

315
00:25:30,030 --> 00:25:31,907
- మీకు లూమన్ లో ఒక ప్రేయసి ఉండుండవచ్చు...
- థ్యాంక్ యూ.

316
00:25:31,990 --> 00:25:32,991
...కానీ బయట మీకు అది తెలీకపోవచ్చు.

317
00:25:33,075 --> 00:25:35,702
అలాగే, మీరు బయట ఎవరితోనైనా ప్రేమలో
పడితే, అది లోపల మీకు గుర్తు ఉండదు.

318
00:25:36,286 --> 00:25:38,163
అంటే, మీకు పెళ్లయి పిల్లలు కూడా ఉండవచ్చు,

319
00:25:38,247 --> 00:25:40,791
కానీ రోజుకు ఎనిమిది గంటల పాటు,
మీ జీవితాంతం, వారు ఉన్నారనే విషయాన్నే

320
00:25:40,874 --> 00:25:42,251
మీరు మర్చిపోతారు.

321
00:25:42,835 --> 00:25:44,336
అది తలుచుకున్నప్పుడు
మీకు ఏమీ అనిపించడం లేదా?

322
00:25:47,631 --> 00:25:50,384
కొంతమందికి కావాల్సింది కూడా అదే అనుకుంటా.

323
00:25:55,305 --> 00:25:59,560
ఒక స్థానిక వ్యక్తిగా మీకు ఈ చలి
ఒక మామూలు విషయంగానే అనిపిస్తోందా?

324
00:25:59,643 --> 00:26:01,603
నిజానికి, మా ఊరు గాన్స్.

325
00:26:01,687 --> 00:26:04,022
అయినా మీకు దీని గురించి తెలిసే ఉండాలి కదా.

326
00:26:04,106 --> 00:26:08,318
అంటే మిన్నెసొటాలో కూడా చెరువులు,
ఇంకా చలి బాగా ఉంటాయి కదా?

327
00:26:08,402 --> 00:26:10,737
అవును, మోంటానాలోని మా ఇంటి నుండి

328
00:26:10,821 --> 00:26:14,908
నేను మిన్నెసొటాకి వెళ్లినప్పుడు
అది చాలా చల్లగా ఉండింది.

329
00:26:15,868 --> 00:26:17,035
అయితే, అవి రెండూ వేర్వేరు
ప్రదేశాలు అన్నమాట.

330
00:26:18,120 --> 00:26:19,246
అవును.

331
00:26:20,414 --> 00:26:22,165
అయితే, మీరు లూమన్ క్వార్టర్స్ లో ఉంటారా?

332
00:26:23,500 --> 00:26:25,669
అదేదో హాస్టల్ అన్నట్టు చెప్పారు మీరు.

333
00:26:26,420 --> 00:26:28,589
- లేదు, నా ఉద్దేశం ఏంటంటే...
- నేను బెయిర్డ్ క్రీక్ లో నివసిస్తాను.

334
00:26:28,672 --> 00:26:33,343
అవును, మీరనట్టు నేను పని చేసే సంస్థయే
ఆ ఇళ్ళ నిర్మాణానికి ఆర్థికంగా సాయపడింది.

335
00:26:33,427 --> 00:26:35,721
ఏవండి, చిన్నారుల మెదడు
ఆరోగ్య విషయమై ఒక నిమిషం కేటాయించగలరా?

336
00:26:35,804 --> 00:26:37,389
అలాగే ఆఫీసులో చట్టపరమైన
వేర్పాటు పద్దతి విషయమై కూడా?

337
00:26:38,974 --> 00:26:41,602
- అహా. డబ్ల్యూ.ఎమ్.సీ మళ్లీ మొదలుపెట్టింది.
- ఎవరు?

338
00:26:41,685 --> 00:26:44,313
జ్ఞాపకాలు వేరు చేయబడిన
ఉద్యోగులకు సూర్యుడిని చూసే అవకాశమే ఉండదు.

339
00:26:44,396 --> 00:26:46,690
హోల్ మైండ్ కలెక్టివ్.
వాళ్లు మామూలోళ్లు కాదు.

340
00:26:46,773 --> 00:26:49,443
ఏవండి, చిన్నారుల మెదడు ఆరోగ్య
విషయమై ఒక నిమిషం కేటాయించగలరా?

341
00:26:49,526 --> 00:26:50,527
పర్వాలేదు.

342
00:26:50,611 --> 00:26:52,487
చిన్నారుల మెదడు ఆరోగ్య విషయమై
మీరు ఒక నిమిషం కేటాయించగలరా?

343
00:26:52,571 --> 00:26:53,447
- తప్పకుండా.
- చాలా మంచిది!

344
00:26:53,530 --> 00:26:55,240
లూమన్ లాంటి బడా సంస్థలు
చట్టప్రకారంగా బలవంతంగా

345
00:26:55,324 --> 00:26:58,076
జ్ఞాపకాలను వేరు చేయకుండా, వాటిని
ఆపడానికి మేము తగినన్ని ఓట్లు సంపాదించి

346
00:26:58,160 --> 00:26:59,411
ప్రజా నిర్ణయాన్ని ప్రభుత్వానికి
తెలపాలనుకుంటున్నాం.

347
00:26:59,494 --> 00:27:00,871
ఇప్పుడు బలవంతంగా
జ్ఞాపకాలను వేరు చేస్తున్నారా?

348
00:27:00,954 --> 00:27:03,749
దాని కోసమే వారు పైరవీలు చేస్తున్నారు.
ఇంకా జేమ్ ఈగన్ ఆ పద్ధతిని పిల్లలపై...

349
00:27:03,832 --> 00:27:07,085
అయితే తమంతట తాము బలవ్వాలని
చేరే వారి సంగతేంటి?

350
00:27:07,169 --> 00:27:09,671
అంటే, కొంత మంది ఎంత భ్రమలో
ఉంటారంటే, వారు బాధితులని

351
00:27:09,755 --> 00:27:11,507
వారికి కూడా తెలీదని నేను విన్నాను.

352
00:27:11,590 --> 00:27:14,176
అదీగాక, ఎవరైనా వేర్పాటు పద్ధతిని
జరిపించుకుంటే,

353
00:27:14,259 --> 00:27:17,346
వారు రెండు నరకాలకు వెళ్తారట.
అది నిజమేనా?

354
00:27:17,429 --> 00:27:19,848
బాసూ, మీరు వెట్టి చాకిరీ ద్వారా
ప్రయోజనం పొందాలనుకుంటే, అది...

355
00:27:19,932 --> 00:27:22,142
- బాసూ, వెట్టి చాకిరీనా?
- ...అది మీ ఇష్టం.

356
00:27:22,226 --> 00:27:23,268
నిజంగానా?

357
00:27:23,352 --> 00:27:24,561
- హేయ్!
- అవును.

358
00:27:24,645 --> 00:27:25,938
- వెట్టి చాకిరియా? సరే.
- నిజమే.

359
00:27:26,021 --> 00:27:28,482
అయితే, జనాలు తమలో తామే
బందీలు అయిపోవచ్చా?

360
00:27:28,565 --> 00:27:30,067
మీరు కూడా ఇప్పుడు బందీయా?

361
00:27:30,150 --> 00:27:34,363
నిజంగానే అడుగుతున్నా, ఎందుకంటే
మీ అంతరాత్మ ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చి

362
00:27:34,446 --> 00:27:36,907
జనాలకు చిరాకు తెప్పించాలని చెప్పింది.

363
00:27:36,990 --> 00:27:39,785
వేర్పాటు పద్ధతి జరిపించుకుంటే
బానిస బతుకే, దరిద్రుడా.

364
00:27:40,786 --> 00:27:42,621
బూతులు మాట్లాడుతున్నావే...

365
00:27:42,704 --> 00:27:44,122
నీ... నీ వయస్సు ఎంత? 12 ఏళ్లు ఉంటాయా?

366
00:27:44,206 --> 00:27:47,084
నీకు 12 ఏళ్లు ఉంటాయా?
కనీసం కాలేజీకి వెళ్తున్నావా?

367
00:27:49,753 --> 00:27:51,255
సరే. ఇక పదండి.

368
00:28:21,952 --> 00:28:22,953
మిసెస్ సెల్విగ్.

369
00:28:23,453 --> 00:28:24,746
మన మధ్య శాంతి కోసం ఇవి తెచ్చాను.

370
00:28:25,789 --> 00:28:26,790
మన మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయా?

371
00:28:26,874 --> 00:28:30,002
డస్ట్ బిన్స్ విషయంలో మిమ్మల్ని
ఇబ్బంది పెట్టాను కదా, అందుకని.

372
00:28:30,961 --> 00:28:35,382
పర్వాలేదులెండి, కానీ ఇవి తేవడం
మీ మంచితనానికి నిదర్శనం. థ్యాంక్ యూ.

373
00:28:38,760 --> 00:28:41,221
లోపలికి రాకూడదూ? కాసిన్ని పాలు తాగండి.

374
00:28:41,930 --> 00:28:43,682
- అలాగే, థ్యాంక్ యూ!
- పర్వాలేదు.

375
00:28:46,018 --> 00:28:49,855
నేను కుక్కీలపై ప్రయోగాలు చేస్తున్నా,
ఒకవేళ వాంతి వస్తే ఏమనుకోకు.

376
00:28:49,938 --> 00:28:51,106
నేనేం వాంతి చేసుకోనులెండి.

377
00:28:54,359 --> 00:28:58,030
ఇంకా మూడవ బల్బును మార్చలేదా?

378
00:28:58,113 --> 00:29:01,158
అవును. దాని సంగతి మర్చిపోతూనే ఉన్నా.

379
00:29:01,950 --> 00:29:04,786
మ్, నీ వద్ద మంచి వాసన వస్తోంది.
డేట్ కి వెళ్లావా?

380
00:29:05,829 --> 00:29:12,753
అలాంటిదే అనుకోవచ్చు. నా సోదరి పరిచయం చేసి
పంపింది, ఆమె మంత్రసాని అనుకుంటా.

381
00:29:12,836 --> 00:29:14,505
ఏదో వెళ్లానా, వచ్చానా అన్నట్టు ఉంది నాకు.

382
00:29:19,885 --> 00:29:22,262
సరే, ఓసారి రుచి చూద్దాం...

383
00:29:32,064 --> 00:29:33,190
వావ్.

384
00:29:33,690 --> 00:29:35,150
ఇది... ఇవి చాలా బాగున్నాయి.

385
00:29:39,446 --> 00:29:41,281
నా భర్త కార్పెంటర్,

386
00:29:41,365 --> 00:29:42,824
చనిపోక ముందు ఒక మాట అన్నాడు,

387
00:29:42,908 --> 00:29:47,788
స్వర్గంలో మేమిద్దరం ఉండటానికి
ఒక ఇంటిని కట్టడం ప్రారంభిస్తానని చెప్పాడు.

388
00:29:48,830 --> 00:29:52,292
నేను అక్కడికి చేరుకోకముందు, నాకు ఇంకో
తోడు ఏమైనా దొరికితే, ఆయన కూడా ఉండటానికి,

389
00:29:52,376 --> 00:29:55,337
వెనుక పక్క ఒక చిన్న అవుట్ హౌస్
కూడా కడతానన్నాడు.

390
00:29:58,966 --> 00:30:00,843
అది... అది చాలా గొప్ప విషయం.

391
00:30:02,970 --> 00:30:07,516
అవును. ఆయన బ్లూ ప్రింట్స్ ని కూడా గీసి
పెట్టుకున్నాడు, అవి నా పర్సులోనే ఉన్నాయి.

392
00:30:13,063 --> 00:30:14,648
ఒకసారి అంగడి దాకా వచ్చిపో, సరేనా?

393
00:30:14,731 --> 00:30:19,319
నేను నీకు ఒక క్యాప్సూల్ ఇస్తాను, దాన్ని
నీళ్లలో వేస్తే, కుంభకర్ణుడిలా నిద్రపోతావు.

394
00:30:19,403 --> 00:30:20,863
తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను.

395
00:30:21,947 --> 00:30:23,448
శుభరాత్రి, మిసెస్ సెల్విగ్.

396
00:31:17,419 --> 00:31:19,838
జెమ్మాస్ క్రాఫ్ట్స్

397
00:31:19,922 --> 00:31:21,924
గమ్మత్తైన విషయం
ఏంటంటే, నా కొత్త పార్టనర్ ఒక మహిళ.

398
00:31:22,007 --> 00:31:24,259
అది నువ్వు ముందే
చెప్పాల్సిన విషయం కదా.

399
00:31:24,343 --> 00:31:28,931
నువ్వు ఇలా తినడానికి
తిరగకుండా... జాగ్రత్తగా ఉండాలి.

400
00:32:03,632 --> 00:32:05,259
జ్ఞాపకాలను వేరు చేసే పద్ధతికి
ముగింపు పలుకుదాం!

401
00:32:05,342 --> 00:32:09,388
వేర్పాటు పద్ధతి ఉద్యోగి యొక్క నైతిక
స్వీయ నియంత్రణను దోచుకుంటుంది

402
00:32:28,740 --> 00:32:30,868
లూమన్ ఇండస్ట్రీస్
నుండి సెత్ మిల్చెక్ ని మాట్లాడుతున్నాను.

403
00:32:30,951 --> 00:32:33,036
మిస్టర్ మిల్చెక్, నేను మార్క్ స్కౌట్ ని.

404
00:32:33,120 --> 00:32:36,081
నేను ప్రత్యేక అంతస్థులో పని చేసే
ఉద్యోగిని. నా ఎంప్లాయి నంబర్ 4502.

405
00:32:36,164 --> 00:32:39,168
మిస్టర్ స్కౌట్, మీతో మాట్లాడటం చాలా
బాగుంది. చెప్పండి.

406
00:32:39,251 --> 00:32:41,712
నిద్ర లేచినప్పటి నుండి నాకు అదోలా ఉంది.

407
00:32:41,795 --> 00:32:43,380
ఇప్పుడు కాల్ చేస్తున్నందుకు క్షమించాలి.

408
00:32:44,047 --> 00:32:47,176
అయ్యయ్యో. తీవ్రమైనదా లేకపోతే పర్లేదా?

409
00:32:47,259 --> 00:32:51,930
తీవ్రమైనదేమీ కాదు,
కాస్త కడుపు గడబిడగా ఉందంతే.

410
00:32:52,014 --> 00:32:53,307
రేపటికి ఆఫీసుకు వచ్చేయగలను.

411
00:32:54,391 --> 00:32:55,517
అయ్యయ్యో.

412
00:32:55,601 --> 00:32:58,228
మీ పని అవతారం, ఆఫీసుకు రాలేకపోయినందుకు
ఖచ్చితంగా బాధపడతాడు.

413
00:33:00,522 --> 00:33:02,983
ఆరోగ్యం జాగ్రత్త. సరేనా, మిస్టర్ స్కౌట్?

414
00:33:07,946 --> 00:33:10,324
- మార్క్ ఎక్కడ?
- ముందు ఉన్న నేను కనబడట్లేదా నీకు?

415
00:33:10,407 --> 00:33:13,327
అతనే కదా ముందు రావలసింది.
నీకు అదేమీ...

416
00:33:13,410 --> 00:33:15,996
ఆరోగ్యం బాగాలేదేమో. పీటీని తీసేసిన
వారంలోనే అతడిని కూడా తీసేయరులే.

417
00:33:16,079 --> 00:33:17,414
తీసేయకూడదనే ఆశిస్తున్నా.

418
00:33:17,497 --> 00:33:18,916
త్రైమాసికపు గడువు సమీపిస్తోంది,

419
00:33:18,999 --> 00:33:21,502
అదీగాక, నాకు డిపార్టుమెంట్ చీఫ్
కావాలని కూడా లేదు.

420
00:33:21,585 --> 00:33:25,422
వావ్. పనిలో తూగుతున్నప్పుడు మందలించబడిన
నీకు చచ్చినా ఆ పదవి ఇవ్వరులే.

421
00:33:27,841 --> 00:33:29,343
మన్నించు. అది...

422
00:33:32,137 --> 00:33:35,182
నన్ను పనిలోకి తీసుకున్నప్పుడే వయస్సులో
నీకన్నా పెద్దవాడిని. దానికి నేనేం చేయను!

423
00:33:37,976 --> 00:33:39,603
ఇది ఎప్పటికీ ముగియదు, కదా?

424
00:33:39,686 --> 00:33:40,938
అంతేలేని చాకిరీ.

425
00:33:42,272 --> 00:33:43,398
మార్క్ ఎక్కడ?

426
00:33:43,482 --> 00:33:45,651
ఆరోగ్యం బాగాలేదో లేక తీసేశారో.
ఆరోగ్యం బాగా లేదనుకుంటా.

427
00:33:46,151 --> 00:33:48,237
కొంపదీసి నేను చీటీ రాసినందుకు
అతడిని తీసేశారా ఏంటి?

428
00:33:48,320 --> 00:33:51,031
లేదులే. దానికి నిన్న బ్రేక్ రూమ్ లో
అనుభవించేశాడు.

429
00:33:55,160 --> 00:33:56,370
ఆరోగ్యం బాగాలేదని అన్నాడు.

430
00:33:56,954 --> 00:33:58,163
అతని గొంతు ఎలా అనిపించింది?

431
00:33:58,247 --> 00:34:00,499
నాకు అర్థం కాలేదు.
కడుపులో గడబిడ అని అన్నాడు.

432
00:34:02,042 --> 00:34:03,210
టైమింగ్ భలే చిత్రంగా ఉంది కదా.

433
00:34:24,481 --> 00:34:26,149
499 హాఫ్ లూప్ రోడ్

434
00:34:44,877 --> 00:34:47,963
మన దగ్గర పెన్సిల్స్ ఉండవు కనుక,
ఎరేసర్స్ అనేవి అలంకారం కోసమే అనుకోవచ్చు.

435
00:34:48,045 --> 00:34:50,382
ఫింగర్ ట్రాప్ తో భలే సరదాగా ఉంటుంది, కానీ
వాటితో సురక్షితంగా ఎలా ఆడాలో తెలిసుండాలి.

436
00:34:50,465 --> 00:34:53,594
కానీ నిజానికి అవి మనం ఫైల్ లో ఎంత
పురోగతి సాధించామనేదాన్ని ప్రతిబింబిస్తాయి.

437
00:34:54,261 --> 00:34:57,139
- కానీ ఫైళ్లు ఎందుకు పూర్తి అవ్వవు?
- ఎందుకంటే అవి చాలా పెద్దగా ఉంటాయి.

438
00:34:57,806 --> 00:35:01,185
సగటున, ఫైళ్ల గడువు తీరిపోయేలోపు అయిదింటిలో
మనం ఒక ఫైలును మాత్రమే పూర్తి చేస్తున్నాము.

439
00:35:01,268 --> 00:35:04,938
కొత్తగా చేరినప్పుడు మార్క్ అదృష్టం కొద్దీ
సాధించినదాని కంటే అది మెరుగైనదే.

440
00:35:05,022 --> 00:35:06,273
అదృష్టం కొద్దీ సాధించడమేంటి?

441
00:36:05,332 --> 00:36:06,416
ఓరి నాయనోయ్!

442
00:36:07,251 --> 00:36:08,252
అర్వ్?

443
00:36:11,129 --> 00:36:12,464
నన్ను... నన్ను క్షమించండి.

444
00:36:13,257 --> 00:36:14,299
అర్వింగ్?

445
00:37:17,404 --> 00:37:20,490
నువ్వు తూగిన సమయానికి
నీకు జీతం తగ్గించి ఇస్తాం.

446
00:37:20,991 --> 00:37:24,661
కానీ నాకు, మిస్ కొబెల్ కి నీపై ఉన్న
నమ్మకాన్ని నువ్వు వమ్ము చేశావు, అర్వింగ్.

447
00:37:25,204 --> 00:37:28,081
నన్ను మన్నించండి.
నాకు చాలా బాధగా ఉంది.

448
00:37:28,165 --> 00:37:31,126
నిన్ను బ్రేక్ రూమ్ కు పంపాలని
ఎవరికీ ఉబలాటంగా లేదు.

449
00:37:31,835 --> 00:37:34,922
కానీ ముందు మిస్ కేసీ నీ ఆరోగ్య పరిస్థితిని
తనిఖీ చేస్తారు, ఆ తర్వాత చూద్దాంలే, సరేనా?

450
00:37:35,422 --> 00:37:36,840
థ్యాంక్ యూ, మిల్చెక్.

451
00:37:38,342 --> 00:37:39,635
ఆరోగ్యం పరిరక్షణ

452
00:37:43,805 --> 00:37:46,141
మీ జీవితంలో భయానికి చోటు ఇవ్వవద్దు.
కియర్ ఈగన్

453
00:37:46,225 --> 00:37:48,227
నీ భావావేశాలను వశపరుచుకో
కియర్ ఈగన్

454
00:37:59,404 --> 00:38:00,656
ఇంకా భయంకరమైన అంకెలేవీ కనబడట్లేదు.

455
00:38:09,957 --> 00:38:11,291
అయ్య బాబోయ్! నాలుగు!

456
00:38:11,375 --> 00:38:12,543
జోకులు వేయకు.

457
00:38:13,085 --> 00:38:16,338
నువ్వు బాగా గమనించినప్పుడు నీకే అర్థం
అవుతుంది అన్నా కదా, కాస్త ఓపిగ్గా ఉండు.

458
00:38:16,964 --> 00:38:18,423
అసలు ఈ అంకెలు దేన్ని సూచిస్తాయి?

459
00:38:18,507 --> 00:38:20,884
అంటే, మనం దేన్ని శుద్ధి చేస్తున్నామో
అయినా మనకి తెలుసా?

460
00:38:23,262 --> 00:38:24,263
నా సిద్ధాంతం చెప్పనా?

461
00:38:25,973 --> 00:38:26,974
సముద్రాన్ని శుద్ధి చేస్తున్నాం.

462
00:38:29,268 --> 00:38:30,269
సముద్రాన్నా?

463
00:38:30,978 --> 00:38:32,437
అవును. ఒకసారి ఆలోచించు.

464
00:38:32,521 --> 00:38:35,649
మన పనియేతర అవతారాలన్నీ, బయట
తమ జ్ఞాపకాలను వేరు చేసుకుంటూ ఉన్నారంటే,

465
00:38:35,732 --> 00:38:37,526
బయటి పరిస్థితి చాలా దారుణంగా ఉండుండాలి.

466
00:38:37,609 --> 00:38:40,279
కరువు, మహమ్మారులు మొదలైనవి.

467
00:38:40,362 --> 00:38:43,574
కాబట్టి ఏ దిక్కూ లేని మానవజాతికి
ఉండే దిక్కు ఏంటి?

468
00:38:46,034 --> 00:38:47,035
సముద్రంలో జీవించడమా?

469
00:38:47,119 --> 00:38:48,495
అవును, సముద్రంలో జీవించడం.

470
00:38:48,579 --> 00:38:52,332
కానీ అలా చేయాలంటే, ముందు వాళ్లు
సముద్ర అడుగు భాగానికి ప్రోబ్స్ ని పంపి,

471
00:38:52,416 --> 00:38:55,878
భయంకరమైన జీవులని, చెత్తాచెదారాన్ని శుద్ది
చేయాలి, అప్పుడే కదా మనం అక్కడ జీవించగలం.

472
00:38:56,378 --> 00:38:59,882
కనుక మనం అడుగు భాగానికి ప్రోబ్స్ పంపుతాం,
అవి డేటాను కోడ్ రూపంలో మనకి పంపుతాయి,

473
00:38:59,965 --> 00:39:04,511
మనం భయంకరమైన జీవులని పసిగట్టి,
వాటిని చంపేయమని ప్రోబ్స్ కి చెప్తాం.

474
00:39:08,015 --> 00:39:09,266
అందరూ ఈ సిద్ధాంతాన్నే నమ్ముతున్నారా?

475
00:39:11,226 --> 00:39:14,313
లేదు, సినిమాల్లో ఉండే బూతు పదాలను
తొలగిస్తున్నామని అర్వ్ అనుకుంటున్నాడు.

476
00:39:18,775 --> 00:39:22,362
కానీ మేము చేసే పనేంటి? అంటే...
ఆఫీసులో మేము అసలు ఏం పని చేస్తున్నాం?

477
00:39:24,448 --> 00:39:25,449
నాకు తెలీదు.

478
00:39:26,742 --> 00:39:29,328
వేర్పాటు అనేది లేకపోతే, అంతా
అర్థమవుతుంది అనుకున్నా, కానీ...

479
00:39:31,163 --> 00:39:33,832
వాళ్లు మన డిపార్టుమెంటుని, ఇతర
డిపార్టుమెంటులని వేరుగా ఉంచుతున్నారు.

480
00:39:33,916 --> 00:39:35,751
అసలు అక్కడ ఎన్ని డిపార్టుమెంటులు
ఉన్నాయో కూడా మనకి తెలీదు.

481
00:39:40,255 --> 00:39:42,508
కానీ నా జ్ఞాపకాలు పునరుద్ధరించబడి
రెండు వారాలు అవుతోంది.

482
00:39:45,135 --> 00:39:46,887
నేను ఆ అంతస్థు ప్లాన్ ని గీస్తున్నాను.

483
00:39:58,607 --> 00:40:00,984
నేను బయటకు వచ్చేసేటప్పుడు, నీ కోసం
అసలైన మ్యాప్ ని దాచి ఉంచాను.

484
00:40:03,070 --> 00:40:04,696
బ్రేక్ రూమ్

485
00:40:20,963 --> 00:40:22,089
నువ్వు బాగానే ఉన్నావా?

486
00:40:30,222 --> 00:40:31,223
మన్నించు.

487
00:40:32,599 --> 00:40:33,892
ఏకీకరణ తాలూకు దుష్ప్రభావం.

488
00:40:36,520 --> 00:40:38,188
ఆ దుష్ప్రభావం గురించి
నేను వినడం ఇదే మొదటిసారి.

489
00:40:38,981 --> 00:40:41,400
ఎందుకంటే, దాన్ని మొట్టమొదటిసారిగా
జరిపించుకున్న సన్నాసిని నేనే కదా.

490
00:40:42,693 --> 00:40:46,530
కానీ చలి ఉండే ఈ గ్రీన్ హౌస్ లో ఉండటం వల్ల
ఆరోగ్యం బాగవ్వట్లేదు, ఇంటికైనా వెళ్లలేను.

491
00:40:49,658 --> 00:40:53,787
సరే, అయితే అక్కడ జరిగే
అంత దారుణమైన విషయం ఏంటి?

492
00:40:57,666 --> 00:40:58,667
అక్కడ ఒక గది ఉంటుంది...

493
00:41:05,340 --> 00:41:07,759
మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు
మనల్ని అక్కడికి తీసుకెళ్తారు.

494
00:41:15,517 --> 00:41:16,643
ఏంటి ఆ గది?

495
00:41:23,358 --> 00:41:24,943
నీకు అస్సలు బాధగా లేదు.

496
00:41:26,069 --> 00:41:30,282
నిజంగానే నేను చాలా, చాలా బాధపడుతున్నా.

497
00:41:30,365 --> 00:41:32,034
మళ్లీ చెప్పు.

498
00:41:33,994 --> 00:41:38,415
ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి
నన్ను క్షమించండి.

499
00:41:38,498 --> 00:41:44,338
నా చర్యలకు బాధపడాల్సింది నేనే,
వాటి దుష్పరిణామాన్ని కూడా నేనే భరించాలి.

500
00:41:44,421 --> 00:41:46,632
నేను పట్టుబడినందుకు
ఆనందం వ్యక్తం చేస్తున్నాను,

501
00:41:46,715 --> 00:41:50,802
ఆ దైవ సంభూతుని చేతులే
నా పతనాన్ని అడ్డుకున్నాయి.

502
00:41:51,678 --> 00:41:55,307
అందుకు నేను చాలా తీవ్రంగా
చింతిస్తున్నాను.

503
00:41:56,475 --> 00:42:00,896
నువ్వు దాన్ని
మనస్ఫూర్తిగా చెప్పలేదు. మళ్లీ చెప్పు.

504
00:42:02,439 --> 00:42:07,069
ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి
నన్ను క్షమించండి.

505
00:42:08,570 --> 00:42:11,865
నా చర్యలకు బాధపడాల్సింది నేనే.

506
00:42:15,327 --> 00:42:16,662
ఏంటది?

507
00:42:19,081 --> 00:42:20,332
అదే బ్రేక్ రూమ్.

508
00:42:53,448 --> 00:42:54,700
నన్ను... నన్ను మన్నించండి.

509
00:42:54,783 --> 00:42:56,034
లేదు, నన్నే మన్నించండి, సర్.

510
00:42:56,118 --> 00:42:58,328
ఇక్కడ ఎవరూ లేరని అనుకున్నాను.

511
00:42:58,412 --> 00:43:01,206
నేను నా సెషన్ కోసం వచ్చాను.

512
00:43:01,290 --> 00:43:06,587
నేను లోపలికి వెళ్లబోతున్నా.
అందాకా ఇక్కడ ఉన్న కళను ఆస్వాదిస్తున్నా.

513
00:43:07,462 --> 00:43:11,133
ఆ చిత్రం, చాలా కాలం
పర్పెటువిటీ వింగ్ లో ఉండింది.

514
00:43:11,216 --> 00:43:14,094
నాకు తెలుసు. వాళ్లు అక్కడి నుండి
తీసేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది.

515
00:43:14,678 --> 00:43:16,972
ఇక్కడ ఉంటే బాగుంది.
అది మనస్సుకు ప్రశాంతతని ఇస్తోంది.

516
00:43:20,184 --> 00:43:22,895
నా పేరు అర్వింగ్.
మ్యాక్రోడేటా రిఫైన్మెంట్.

517
00:43:23,478 --> 00:43:24,938
మీరు మీ డిపార్టుమెంట్ చీఫ్ ఆ?

518
00:43:25,022 --> 00:43:26,940
అవును,
ఆప్టిక్స్ అండ్ డిజైన్ డిపార్టుమెంటుకి.

519
00:43:27,691 --> 00:43:30,152
మా డిపార్టుమెంటులో ఇద్దరే ఉంటారు,
కాబట్టి చీఫ్ అయినా తేడా ఏముందిలే.

520
00:43:30,235 --> 00:43:31,653
అయితే ఇది మీ పనితనమేనా?

521
00:43:32,446 --> 00:43:35,199
మేము గీయము. వేలాడదీస్తామంతే.

522
00:43:35,282 --> 00:43:40,495
గత త్రైమాసికానికి టీమ్ బిల్డింగ్ ప్రదేశంలో
మీరు ఆంబ్రోస్ సైకిల్ చేయడం నాకు నచ్చింది.

523
00:43:41,038 --> 00:43:42,956
అప్పటిదాకా నేను దాన్ని చూడనేలేదు.

524
00:43:43,457 --> 00:43:45,959
అంత ఆధునిక ఆలోచనభావాలున్న వారిని
కలుసుకోవడం చాలా అరుదు.

525
00:43:46,877 --> 00:43:50,881
చాలా మంది ఓ&డీని వారికి కొత్త హ్యాండ్ బుక్
సంచులు అందినప్పుడే తలుచుకుంటారు.

526
00:43:51,924 --> 00:43:53,717
నాకు అవి కూడా బాగా నచ్చుతాయి.

527
00:43:53,800 --> 00:43:55,177
అవునా?

528
00:43:55,260 --> 00:43:57,638
వచ్చే నెల కొత్తవి వస్తున్నాయి.

529
00:43:58,597 --> 00:44:00,390
నా దృష్టిలో, వాటిని తలదన్నే డిజైన్ లేదు.

530
00:44:01,433 --> 00:44:05,437
వావ్! అవి అందేదాకా, వాటి కోసమే
ఎదురు చూస్తుంటాను అయితే.

531
00:44:06,063 --> 00:44:06,897
అర్వింగ్?

532
00:44:45,352 --> 00:44:46,645
సరే మరి, అర్వింగ్.

533
00:44:47,479 --> 00:44:51,400
నేను మీ పనియేతర అవతారం గురించి
కొన్ని విషయాలను మీకు తెలియజేస్తున్నాను.

534
00:44:51,483 --> 00:44:53,694
అర్వింగ్ బీ - ఆరోగ్య సంరక్షణా కేంద్రం
రోగి పనియేతర అవతారానికి చెందిన విషయాలు

535
00:44:53,777 --> 00:44:58,991
మీ పనియేతర అవతారం గొప్ప వ్యక్తి కనుక,
ఈ విషయాలు ఊరటనిస్తాయి.

536
00:45:00,659 --> 00:45:04,663
మీరు మనస్సును తేలికపరుచుకొని
చెప్పే విషయాలను ఆలకించండి.

537
00:45:05,455 --> 00:45:08,584
అన్నింటినీ సమంగా ఆస్వాదించడానికి
ప్రయత్నించండి.

538
00:45:09,918 --> 00:45:13,130
ఈ విషయాలను మూడవ కంటికి
తెలియనివ్వకూడదు.

539
00:45:14,673 --> 00:45:17,885
కానీ ప్రస్తుతానికి,
మీరు వీటిని ఆస్వాదించండి.

540
00:45:23,390 --> 00:45:25,350
మీ పనియేతర అవతారం
మంచి ఉదార స్వభావమున్న వ్యక్తి.

541
00:45:27,978 --> 00:45:31,899
మీ పనియేతర అవతారానికి సంగీతమంటే ఇష్టం,
ఆయన వద్ద చాలా రికార్డులు ఉన్నాయి.

542
00:45:33,650 --> 00:45:39,448
మీ పనియేతర అవతారం పిల్లలకు, పెద్దలకు,
అలాగే మతిస్థితిమితంలేని వారికి ఆప్తులు.

543
00:45:41,491 --> 00:45:45,704
ఆయనకి మంచి బలం ఉంది, ఒక బరువైన
వస్తువును ఎత్తడంలో ఒకరికి సాయపడ్డారు.

544
00:45:47,748 --> 00:45:53,420
ఆయన అనేక డాన్స్ షోలకి వెళ్తుంటారు, వాటికి
వచ్చే వ్యక్తులలో చాలా మందికి ఆయన తెలుసు.

545
00:45:54,755 --> 00:46:01,720
ఆయనకి సినిమాలంటే ఇష్టం, వాటిని
ప్లే చేసే మెషిన్ కూడా ఆయన దగ్గర ఉంది.

546
00:46:03,430 --> 00:46:08,894
ఆయనకి మంచి ఫిజిక్ ఉంది,
చాలా చక్కగా, బాగా ఈత కొట్టగలడు.

547
00:46:10,395 --> 00:46:11,605
మన్నించాలి.

548
00:46:12,481 --> 00:46:15,067
ప్రతీ విషయాన్ని కూడా సమానంగా
ఆస్వాదించడానికి ప్రయత్నించండి,

549
00:46:15,734 --> 00:46:18,403
ఒకదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి,
మిగతావాటికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి.

550
00:46:18,987 --> 00:46:21,990
పది పాయింట్లు తగ్గిస్తున్నాను.
ఇప్పుడు మీ వద్ద 90 పాయింట్లు ఉన్నాయి.

551
00:46:22,074 --> 00:46:24,284
- పాయింట్లా?
- దయచేసి మాట్లాడకండి.

552
00:46:32,042 --> 00:46:34,628
మీ పనియేతర అవతారం రెండు వారాల క్రితం
ఒక ఆటలో గెలిచాడు.

553
00:46:36,046 --> 00:46:38,632
ఆయన నీటికి విలువ ఇస్తారు.

554
00:46:39,925 --> 00:46:44,638
ఆయన ఒక ట్రోఫీని అందుకుంటున్న ఫోటో
ఒక వార్తాపత్రికలో వచ్చింది.

555
00:46:46,265 --> 00:46:50,602
ఆయనకి దొంగలన్నా, రౌడీలన్నా భయమే లేదు.

556
00:46:52,563 --> 00:46:55,607
ఆయనకి రాడార్ ధ్వని అంటే చాలా ఇష్టం.

557
00:46:58,193 --> 00:47:03,073
ఆయన ముద్దాడటంలో, అలాగే శృంగారంలో
మంచి నేర్పరి.

558
00:47:05,909 --> 00:47:06,910
మన్నించాలి.

559
00:47:06,994 --> 00:47:09,913
ఏ ఒక్క విషయానికీ ప్రతిస్పందించకండి.

560
00:47:09,997 --> 00:47:11,790
పది పాయింట్లు తీసివేస్తున్నాను.

561
00:47:11,874 --> 00:47:14,084
- నేను కేవలం...
- మరేమీ మాట్లాడకండి,

562
00:47:14,168 --> 00:47:18,005
లేదంటే మీ పాయింట్లన్నీ కోతకు గురయి,
ఈ సంరక్షణా సెషన్ ముగిసిపోతుంది.

563
00:47:22,259 --> 00:47:24,511
ఒక రోజుకు ఒక వ్యక్తి
రెండు టోకెన్లు మాత్రమే వాడుకోవాలి

564
00:47:35,772 --> 00:47:36,815
ఏం తీసుకుందాం అబ్బా.

565
00:47:39,443 --> 00:47:40,944
బీన్స్ - ఎండు ద్రాక్ష
పీనట్స్ - స్వీట్స్

566
00:47:47,743 --> 00:47:49,494
బ్లూబెర్రీస్ - జిన్సెంగ్
సన్ ఫ్లవర్ సీడ్స్ - మింట్స్

567
00:47:53,081 --> 00:47:54,041
ఎండు ద్రాక్ష

568
00:47:57,753 --> 00:47:59,254
- లిఫ్టులలోనే ఉంటాయా?
- ఏంటి?

569
00:47:59,338 --> 00:48:01,673
కోడ్ డిటెక్టర్లు. మెట్ల మార్గంలో
కూడా ఉంటాయా?

570
00:48:01,757 --> 00:48:03,675
బాబోయ్. మెట్ల మార్గంలో కూడా ఉంటాయి.
ఎందుకు అడుగుతున్నావు?

571
00:48:03,759 --> 00:48:05,969
ఎవరూ రాజీనామాలను ఆమోదించకపోతే,

572
00:48:06,053 --> 00:48:07,846
అసలు వాటిని మన పనియేతర అవతారానికి
చేరవేస్తున్నారో లేదో ఎలా తెలుస్తుంది?

573
00:48:07,930 --> 00:48:10,224
నువ్వు సమాచారాన్ని దొంగచాటుగా బయటకు
చేరవేయాలనే నీ ఆలోచనను మానుకోవాలి.

574
00:48:10,307 --> 00:48:11,558
సరే, కానీ స్కానర్లు బాగా పని చేస్తాయా?

575
00:48:11,642 --> 00:48:14,811
ఒకవేళ మనం అక్షరాలను మామూలుగా
కాకుండా వేరే విధంగా రాస్తే?

576
00:48:14,895 --> 00:48:16,772
- హాయ్, పిల్లలారా. డిన్నర్ కి ఏంటి స్పెషల్?
- ఏం లేదు!

577
00:48:16,855 --> 00:48:18,106
సంరక్షణా సెషన ఎలా గడిచింది?

578
00:48:18,190 --> 00:48:20,067
బాగా గడిచింది.
ఇప్పుడు నాకు చాలా బాగా ఉంది.

579
00:48:20,150 --> 00:48:21,944
నేను ఓ&డీ డిపార్టుమెంట్ చీఫ్ ని కలిశాను.

580
00:48:22,027 --> 00:48:26,198
బర్ట్? అతడిని నేను కలిశాను. అతనొక సన్నాసి.
మనం ఎక్కడ ఉండే అతనికి చెప్పావా ఏంటి?

581
00:48:26,281 --> 00:48:28,367
బర్ట్ సన్నాసేం కాదు. నేను కూడా
మనం ఎక్కడ ఉండేది చెప్పలేదు.

582
00:48:28,450 --> 00:48:30,577
నేను ఈ డిపార్టుమెంట్ క్షేమం
కోసం అడుగుతున్నాను.

583
00:48:30,661 --> 00:48:32,120
- నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు...
- అదంతా కట్టు కథ.

584
00:48:32,204 --> 00:48:34,039
అదీగాక, ఈ డిపార్టుమెంట్ గురించి నువ్వు
పట్టించుకుంటున్నట్టు బిల్డప్ ఇవ్వకు.

585
00:48:34,122 --> 00:48:35,749
నీకు కావలసిందల్లా
నీ వాఫుల్ పార్టీ మాత్రమే.

586
00:48:35,832 --> 00:48:38,794
ఏడిచావులే. ప్రోత్సాహకాలను
ఇష్టపడటం కూడా తప్పేనా?

587
00:48:38,877 --> 00:48:42,881
"లూమన్ ఉద్యోగులందరూ ప్రోత్సాహకాల
వెల్లువలో ఉబ్బితబ్బిబవుతారు."

588
00:48:42,965 --> 00:48:45,676
హ్యాండ్ బుక్ లో ఉన్న విషయాన్ని
నీకు అనుకూలంగా చెప్పుకోకు, సరేనా?

589
00:48:45,759 --> 00:48:46,927
- అలా చేయకు.
- హేయ్, మిత్రులారా?

590
00:48:47,010 --> 00:48:48,846
లూమన్ మనకి చాలా ఇచ్చింది,
మనం అలా లెక్కచేయకుండా...

591
00:48:48,929 --> 00:48:49,930
మిత్రులారా!

592
00:48:58,480 --> 00:48:59,731
అదుగో.

593
00:49:00,524 --> 00:49:01,525
అవును.

594
00:49:02,150 --> 00:49:03,694
ఎందుకు... అది ఎందుకు...

595
00:49:03,777 --> 00:49:06,488
ఏం పర్వాలేదు. నేను నీకు చూపాను కదా,
అలా ఆ చెత్త డేటాను రౌండ్ చేసేయ్.

596
00:49:06,572 --> 00:49:08,448
నీకు హద్దులు కనిపిస్తున్నాయా?

597
00:49:17,624 --> 00:49:19,042
దాన్ని ట్రాష్ లో పడేయ్.

598
00:49:31,263 --> 00:49:33,140
సూపర్. శుద్ధి చేసేశావు.

599
00:49:33,223 --> 00:49:35,392
సూపర్, హెల్లి. అదరగొట్టేశావు.

600
00:49:36,143 --> 00:49:39,146
నంబర్లు భయంకరంగానే ఉన్నాయి.
చాలా భయాన్ని కలిగించాయి.

601
00:49:56,997 --> 00:50:00,375
ఇదుగో సోఫా.
నీకొక పరుపు తీసుకువస్తాను.

602
00:50:01,251 --> 00:50:04,671
కావాలంటే నువ్వు ఈ బాత్రూమ్ లో
స్నానం చేసి రావచ్చు.

603
00:50:05,422 --> 00:50:06,840
ఏం చెప్పాలనుకుంటున్నావు?

604
00:50:11,845 --> 00:50:13,138
ఇలా నాకు
సాయమందిస్తున్నందుకు థ్యాంక్స్, మార్క్.

605
00:50:13,680 --> 00:50:16,517
అంటే, నేను నిన్ను ఆ గ్రీన్ హౌస్ లోనే
ఉండనిస్తే, నా పని అవతారానికి

606
00:50:16,600 --> 00:50:18,185
బాగా మండుతుందని గ్రహించాను.

607
00:50:24,316 --> 00:50:25,317
లైట్ స్విచ్ ఎడమ పక్కన ఉంది.

608
00:50:46,004 --> 00:50:47,005
క్యాంపింగ్ సామాగ్రి

609
00:50:53,011 --> 00:50:54,179
లోపల నీకు అంతా బాగానే ఉందా?

610
00:50:54,263 --> 00:50:56,557
అవును! బాగానే ఉన్నాను.

611
00:52:09,546 --> 00:52:10,672
పీటీ, నువ్వు బాగానే ఉన్నావా?

612
00:53:13,694 --> 00:53:14,736
కాలెబ్ స్మిత్ జ్ఞాపకార్థం

613
00:53:14,820 --> 00:53:16,822
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

