1
00:00:10,844 --> 00:00:12,054
పీటీ, నువ్వు బాగానే ఉన్నావు కదా?

2
00:00:17,768 --> 00:00:19,019
పీటీ?

3
00:00:19,102 --> 00:00:25,025
హా, నేను బాగానే ఉన్నాను. కాలు జారి పడ్డా.
కాస్త మంచి బాత్రూమ్ పట్టలు పెట్టుకోరాదూ.

4
00:00:25,108 --> 00:00:29,655
సరే. ఆ బాత్రూమ్ రోబ్, నాకు
నా బావ కానుకగా ఇచ్చాడు.

5
00:00:29,738 --> 00:00:32,824
దాన్ని నేను ఇప్పటిదాకా వేసుకోలేదు.
అది కాస్త వింతగా ఉంటుంది, ఏమనుకోకు.

6
00:00:34,743 --> 00:00:36,620
ఇక్కడ దిండ్లు కూడా ఉన్నాయి.
ఇంకా ఏమైనా కావాలా?

7
00:00:37,538 --> 00:00:40,290
అవును, ఈ మంచి బాత్రూమ్ రోబ్
చెత్తదని చెప్పడం ఆపు, అది చాలు.

8
00:00:41,792 --> 00:00:43,293
కావాలంటే దాన్ని నువ్వే ఉంచుకో.

9
00:00:43,377 --> 00:00:44,670
నేనే ఉంచుకుంటా.

10
00:00:44,753 --> 00:00:49,341
హేయ్. ఈ కిటికీల నుండి
ఎవరూ లోపలికి పక్కా చూడలేరు కదా?

11
00:00:49,424 --> 00:00:50,509
చూడలేరు.

12
00:00:50,592 --> 00:00:52,261
ఇంకా, పైన కూడా
అన్నీ లాక్ చేసేసి ఉన్నాయిలే.

13
00:00:53,679 --> 00:00:55,931
పక్క ఇంట్లో ఎవరైనా ఉన్నారా?

14
00:00:56,014 --> 00:00:58,892
అటు పక్క ఇంట్లో మిసెస్ సెల్విగ్ అనే ఆవిడ
ఒంటరిగా ఉంటుంది.

15
00:00:58,976 --> 00:01:04,188
ఇక్కడ చాలా ఇళ్ళు ఇంకా ఖాళీగానే ఉన్నాయి,
కాబట్టి హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.

16
00:01:06,066 --> 00:01:07,860
జనాలకు దూరంగా హాయిగా ఉండవచ్చు.

17
00:01:08,652 --> 00:01:11,738
అప్పుడప్పుడూ ఇతర శాఖలతో కలుస్తూ ఉంటే
బాగుంటుందనే ఇప్పటికీ అనుకుంటున్నా.

18
00:01:11,822 --> 00:01:15,200
నేను కూడా చెక్ చేశాను, మాన్యువల్ లో
కూడా అలాంటిది కుదరదు అని ఎక్కడా లేదు.

19
00:01:15,284 --> 00:01:16,285
అవును, అందులో సందేహమే లేదు!

20
00:01:16,368 --> 00:01:19,538
బాసూ, పోయిన త్రైమాసికంలో ఈ భవనంలోని వాళ్లు
అందరూ కలిస్తే బాగుంటుందని కోబెల్ తో అన్నా.

21
00:01:19,621 --> 00:01:22,416
దానికి ఆమె అది మీరు కష్టపడి సాధించాల్సిన
విషయం అనేదో అర్థం కాకుండా చెప్పింది.

22
00:01:22,499 --> 00:01:25,043
- కోబెల్?
- డిలన్ సన్సెట్ పార్క్ ఫైల్ పని...

23
00:01:25,127 --> 00:01:26,879
నాలుగు శాతం మాత్రమే పూర్తి చేశాడు,
అలాంటప్పుడు అది...

24
00:01:28,505 --> 00:01:29,798
పీటీ?

25
00:01:31,216 --> 00:01:32,384
నువ్వు బాగానే ఉన్నావా?

26
00:01:35,971 --> 00:01:37,723
మన్నించు. బాగానే ఉన్నాను.

27
00:01:39,725 --> 00:01:43,896
ఈ రుగ్మతతో, నాకు...
నాకు అంతా గందరగోళంగా ఉంటుంది.

28
00:01:44,855 --> 00:01:45,856
ఇది తాత్కాలికమే.

29
00:01:47,858 --> 00:01:49,234
సన్సెట్ పార్క్ అంటే ఏంటి?

30
00:01:52,404 --> 00:01:53,447
ఏమో.

31
00:04:13,128 --> 00:04:16,464
రెండు వేర్వేరు జీవితాలను కలిపి
కుట్టేసినట్టు ఉంటుంది అన్నమాట.

32
00:04:17,632 --> 00:04:19,551
కానీ వాస్తవమేదో, భ్రమ ఏదో చెప్పలేం.

33
00:04:19,635 --> 00:04:23,639
కాబట్టి, నేను లూమన్ లో చేరిన మొదటి రోజు
నుండి నా అయిదవ పుట్టిన రోజు జీవితం దాకా.

34
00:04:23,722 --> 00:04:26,808
రెండు గతాలు ఉన్న కారణంగా
నా వర్తమానం కూడా భ్రమలానే అనిపిస్తోంది.

35
00:04:28,227 --> 00:04:29,937
కానీ అది బాగు అయిపోతుందని వాళ్లు అన్నారు.

36
00:04:33,148 --> 00:04:34,149
"వాళ్లు" అంటే ఎవరు?

37
00:04:37,611 --> 00:04:40,614
"వాళ్లు" అంటే వేర్పాటు పద్ధతి మానవాళికి
పెనుముప్పు లాంటిది అని తెలిసిన వాళ్లు.

38
00:04:41,114 --> 00:04:42,741
ఆ విషయంలో వాళ్లు ఏదోకటి చేస్తారు.

39
00:04:45,285 --> 00:04:47,162
హోల్ మైండ్ కలెక్టివ్ గ్రూప్ ఆ?

40
00:04:47,829 --> 00:04:51,583
టౌన్లో సంతకాల సేకరణ చేసే పిల్లలా?
కాదు, అది డబ్ల్యూ.ఎమ్.సీ కాదు.

41
00:04:53,001 --> 00:04:54,002
వాళ్లు వేరే గ్రూప్.

42
00:04:55,087 --> 00:04:56,380
సరే. అయితే...

43
00:04:59,258 --> 00:05:02,970
నేనేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు?

44
00:05:05,722 --> 00:05:07,766
అక్కడ నువ్వు చేసే పనేంటో
తెలుసుకోవాలని నీకు లేదా?

45
00:05:12,479 --> 00:05:16,149
చూడు. నేనేమీ
జ్ఞాపకాలను కలపాలనుకోవట్లేదు.

46
00:05:16,733 --> 00:05:19,945
నేను కూడా కలపమని చెప్పడం లేదు.
ఎందుకంటే, ఆ పద్ధతికి ఒక పేరు ఉంది.

47
00:05:20,988 --> 00:05:23,073
- ఏకీకరణ.
- సర్లే. ఏదైతే ఏంటి.

48
00:05:23,156 --> 00:05:26,118
అంటే, అదేమీ నా విషయంలో
అదో ముప్పులా అని నాకనిపించలేదు.

49
00:05:26,201 --> 00:05:27,703
అది నాకు సహాయపడింది.

50
00:05:29,204 --> 00:05:32,332
సరే. ఆ సాయానికి నువ్వు
చేసే ప్రతిసాయం ద్వారా

51
00:05:34,042 --> 00:05:35,919
నువ్వు ఎనిమిది గంటల పాటు ఆఫీసులో
కూర్చొని, నీకు తెలియకుండానే

52
00:05:36,003 --> 00:05:37,045
జనాలను చంపుతున్నావని నీకు తెలిస్తే?

53
00:05:38,755 --> 00:05:39,882
అది నిజమా?

54
00:05:42,885 --> 00:05:47,848
చూడు. నాకు ఒక శాఖ గురించి
తెలిసింది. దాని గురించి మనకు ఏమీ చెప్పరు.

55
00:05:47,931 --> 00:05:49,600
ఆ శాఖ నుండి మనం బయటకు రాలేం.

56
00:05:51,268 --> 00:05:53,562
అంటే, మేమందరం కూడా
మా శాఖ నుండి బయటకు రాలేం కదా?

57
00:05:53,645 --> 00:05:58,233
అలా కాదు, వాళ్లు ఎప్పుడూ అక్కడే ఉంటారు.
ఇప్పుడు కూడా అక్కడే ఉంటారు.

58
00:05:58,317 --> 00:06:00,444
ఏంటి? సంకెళ్లతో కట్టేసి ఉంచుతారా, లేక...

59
00:06:03,530 --> 00:06:04,823
ఏంటి?

60
00:06:09,953 --> 00:06:11,705
నేను దాని గురించి ఇక్కడ మాట్లాడను.

61
00:06:12,873 --> 00:06:17,211
మానిటర్లకు ఏమైనా రికార్డర్లు
పెట్టుంటారేమో. అర్వింగ్ వస్తాడేమో.

62
00:06:25,844 --> 00:06:27,888
పీటీ, మనం లూమన్ లో లేము.

63
00:06:34,061 --> 00:06:35,395
మరి జూన్ ఎక్కడ?

64
00:06:47,157 --> 00:06:48,492
మన్నించు, మార్క్.

65
00:06:58,210 --> 00:06:59,211
జూన్ ఎవరు?

66
00:07:02,548 --> 00:07:07,469
జూన్ నా కూతురు. తను చాలా మంచి పిల్ల,
గిటార్ అద్భుతంగా వాయిస్తుంది.

67
00:07:13,600 --> 00:07:16,019
నన్ను ఇక్కడే ఉండమని చెప్పినందుకు
నీకు ఆనందంగా ఉందా?

68
00:07:46,550 --> 00:07:48,135
మార్క్.

69
00:07:50,888 --> 00:07:52,598
నువ్వు బాగానే ఉన్నావా?

70
00:07:54,850 --> 00:07:58,937
కానీ ఒక మహిళా ఉద్యోగి, మీ సంస్థ
వేర్పాటు పద్ధతిని ప్రారంభించాక

71
00:07:59,021 --> 00:08:01,356
ఒక నెలలోపే గర్భవతి అయింది,
దానిపై మీ కామెంట్ ఏంటి, నాటలీ?

72
00:08:01,440 --> 00:08:03,859
ఆమెకి ఎదురైన అనుభవం
గురించి నిజాయితీగా మాట్లాడాలని

73
00:08:03,942 --> 00:08:05,569
ఆమెకి ఉంటే, ముందు ఆమె గుర్తింపు ఏమిటో

74
00:08:05,652 --> 00:08:07,696
- అందరికీ తెలపమనండి.
- తన పని అవతారం ప్రమేయమే ఉన్నప్పుడు

75
00:08:07,779 --> 00:08:10,699
- తను ఎలా మాట్లాడగలుగుతుంది...
- పని అవతారమేంటి?

76
00:08:11,325 --> 00:08:13,410
అదా, మీరు ఆ పదాన్నే
వాడుతుంటారని నేను అనుకున్నాను...

77
00:08:13,493 --> 00:08:16,246
తాము సొంతంగా ఎంచుకొన్న దారుల నుండి
జనాలను కాపాడాలని చూసే మీలాంటి వాళ్లు

78
00:08:16,330 --> 00:08:18,874
ఇలాంటి అహంకారపూరిత పదాలనే
వాడుతారులెండి.

79
00:08:18,957 --> 00:08:20,667
దారులా? తన పనియేతర అవతారానికి...

80
00:08:20,751 --> 00:08:22,711
పనియేతర అవతారమా?
ఈ పదాలను ఎక్కడి నుండి పట్టుకొస్తున్నారు?

81
00:08:22,794 --> 00:08:25,797
సరే. తమ మెదడును
వేరుచేసుకొన్న వ్యక్తే అనుకుందాం...

82
00:08:25,881 --> 00:08:28,050
లూమన్ లో మేము చేసే దానికి,
ఆ మాటకొస్తే ఏ వేర్పాటు పద్ధతికి అయినా,

83
00:08:28,133 --> 00:08:29,635
ఈ విషయంలో సంబంధం లేదు.

84
00:08:29,718 --> 00:08:31,386
నా ప్రశ్నలకు బదులు ఇవ్వాలని
మీకు లేదని నాకు అర్థమైంది...

85
00:08:31,470 --> 00:08:33,722
- నేను సమాధానాలు ఇస్తున్నానుగా.
- ...ఎందుకంటే అప్పుడు మీరు చేసే పనులు

86
00:08:33,804 --> 00:08:36,683
- నైతికపరంగా అమానుషమైనవని బట్టబయలైపోతుంది.
- అమానుషమైన విషయం ఏదైనా ఉందంటే...

87
00:08:41,395 --> 00:08:42,438
అది నిజం కాదు కదా.

88
00:08:44,525 --> 00:08:47,027
కాదని చెప్పాలనే
నాకు ఉంది, కానీ చెప్పలేను. అర్థమైందా?

89
00:08:48,153 --> 00:08:50,030
...పరివాహక ప్రాంతంలోకి విస్తరించింది,

90
00:08:50,113 --> 00:08:54,535
మధ్యాహ్నం దాకా కొనసాగే అవకాశముంది,
సరిగ్గా ఇదే నిన్న మేము చెప్పాము.

91
00:08:54,618 --> 00:08:58,997
మంచి విషయం ఏమిటంటే, గాన్స్ ప్రాంతంలో
ఆ మబ్బులు వీడిపోతాయి,

92
00:08:59,081 --> 00:09:03,001
దానితో మన కియర్ పరిసరాల్లో
మనకి ఎండ వాతావరణం నెలకొంటుంది.

93
00:09:03,085 --> 00:09:05,796
అది అలా ఉంచితే, చలి మాత్రం
ఎంతకీ తగ్గడం లేదు.

94
00:09:05,879 --> 00:09:08,674
ఇక రోడ్డులన్నీ ఈ వారమంతా
మంచుతో కప్పబడి ఉంటాయి,

95
00:09:08,757 --> 00:09:10,175
ఆ పరిస్థితే వారాంతం కూడా కొనసాగుతుంది.

96
00:09:10,259 --> 00:09:12,761
కాబట్టి మీరు ప్రయాణం చేసేటప్పుడు
చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.

97
00:09:20,227 --> 00:09:21,228
పీటీ.

98
00:09:24,189 --> 00:09:27,442
లేయ్, పీటీ. పీటీ?

99
00:09:33,615 --> 00:09:34,616
హేయ్.

100
00:09:35,325 --> 00:09:37,703
ఉదయం అయింది.
నువ్వు నా బేస్మెంట్ లో ఉన్నావు.

101
00:09:40,038 --> 00:09:41,248
అవును.

102
00:09:41,915 --> 00:09:46,128
కనుక నేను నువ్వన్నట్టే ఆఫీసుకు వెళ్తున్నా.
కావాలంటే నువ్వు ఇక్కడే ఉండవచ్చు.

103
00:09:47,921 --> 00:09:49,590
కానీ ఓ విషయం,

104
00:09:50,966 --> 00:09:54,052
నేను మాత్రం
ఏకీకరణ ప్రకియ జరుపుకోను, సరేనా?

105
00:09:57,347 --> 00:09:58,348
అలాగే.

106
00:09:59,057 --> 00:10:02,060
ఒక కారు ప్రమాదంలో రెండేళ్ల క్రిందట
నేను నా భార్యను దూరం చేసుకున్నా.

107
00:10:02,769 --> 00:10:06,023
దీని... దీని వల్ల నేను
ఆ బాధ నుండి బయటపడగలుగుతున్నాను.

108
00:10:06,106 --> 00:10:08,483
- అయ్యో, మార్క్.
- పర్వాలేదులే.

109
00:10:10,777 --> 00:10:11,862
ఆఫీసుకు...

110
00:10:14,781 --> 00:10:18,994
నువ్వు వచ్చేటప్పుడు,
అప్పుడప్పుడూ నీ కళ్ళు ఎర్రగా ఉంటాయి.

111
00:10:20,495 --> 00:10:23,874
నీకు లిఫ్ట్ అలర్జీ ఉంది అని
మేము జోకులు వేసుకొనేవాళ్లం.

112
00:10:25,584 --> 00:10:27,085
దాని మీద మేము ఒక పాట కూడా పాడుకొనేవాళ్ళం.

113
00:10:29,421 --> 00:10:30,797
కానీ నాకు ఆశ్చర్యంగా కూడా ఉండేది.

114
00:10:32,716 --> 00:10:34,635
నీ నుండి ఆ బాధ దూరం కాలేదు.

115
00:10:35,427 --> 00:10:38,847
ఆఫీసులో కూడా అది నిన్ను వెంటాడేది.
కానీ అది నాకు తెలియట్లేదు.

116
00:10:42,184 --> 00:10:43,268
సరే.

117
00:10:44,311 --> 00:10:47,231
నీకు ఏదైనా కావాలంటే
ఫ్రిడ్జి నుండి తీసుకో, సరేనా?

118
00:10:47,314 --> 00:10:48,607
నేను సాయంత్రం ఆరుకల్లా వచ్చేస్తాను.

119
00:11:04,706 --> 00:11:05,541
హాయ్!

120
00:11:06,291 --> 00:11:09,878
- హేయ్.
- మార్క్, ఈ శబ్దానికి క్షమించు!

121
00:11:10,379 --> 00:11:13,257
ఈ మంచునంతటినీ తీసేస్తున్నా.

122
00:11:13,340 --> 00:11:17,177
పర్వాలేదులే. కుక్కీలు
ఇచ్చినందుకు మరోసారి థ్యాంక్స్.

123
00:11:17,261 --> 00:11:18,762
ఇంకా చేసి తెస్తానులే!

124
00:11:20,097 --> 00:11:21,139
తప్పకుండా తీసుకురండి.

125
00:11:55,299 --> 00:11:57,301
- మిస్టర్ స్కౌట్, ఏంటి సంగతి?
- హేయ్, జడ్.

126
00:12:24,119 --> 00:12:25,120
లూమన్

127
00:12:38,008 --> 00:12:41,595
నేను ఒక గొప్ప పని చేశాను.
నేను ఆ భయానక సంఖ్యలను తొలగించేశాను.

128
00:12:41,678 --> 00:12:42,679
ఎప్పుడు?

129
00:12:42,763 --> 00:12:45,766
- నిన్నే. అప్పుడు నువ్వు లేవు.
- అవునా?

130
00:12:45,849 --> 00:12:49,645
అవును. నీ బదులు డిలన్ శిక్షణ
ఇచ్చాడు, చాలా బాగా ఇచ్చాడు కూడా.

131
00:12:49,728 --> 00:12:53,106
నువ్వు భలే ట్రిమ్ గా ఉన్నావు, మార్క్.
కలుషిత ఆహారం తిన్నావా ఏంటి.

132
00:12:53,190 --> 00:12:55,317
మళ్లీ స్వాగతం, బాస్. కొత్త ఫోటోలు వచ్చాయా?

133
00:12:55,400 --> 00:12:58,195
మంచిది. ఇప్పటికైనా నువ్వు
ఆ పాత ఫోటోలను తీసేయవచ్చులే.

134
00:13:02,574 --> 00:13:05,953
నువ్వు పెట్టకపోయినా పర్వాలేదు,
ఎందుకంటే నేను రాజీనామా సమర్పించాను.

135
00:13:06,787 --> 00:13:08,580
- సమర్పించేశావా?
- అవును.

136
00:13:09,915 --> 00:13:12,793
మంచిది. అప్పుడు నీకు బ్రేక్ రూమ్ కి
వెళ్లాల్సిన అవసరం ఉండదులే.

137
00:13:14,461 --> 00:13:15,921
హలో రిఫైనర్లారా.

138
00:13:16,004 --> 00:13:17,047
హలో, మిస్టర్ మిల్చెక్.

139
00:13:17,130 --> 00:13:18,841
మార్క్, నేను నిన్న
నీ పనియేతర అవతారంతో మాట్లాడాను.

140
00:13:18,924 --> 00:13:20,968
అతను ఆఫీసులో లేనందుకు తెగ బాధపడిపోయాడు.

141
00:13:21,051 --> 00:13:22,469
కానీ ఇక్కడికి నువ్వు వచ్చేశావు కనుక,

142
00:13:22,553 --> 00:13:25,597
ఈ డిపార్టుమెంటుకు నాయకునిగా ఉదయపు వేళ
తొలి ప్రకటనలను చదివి వినిపించగలవా?

143
00:13:27,140 --> 00:13:28,141
తప్పకుండా.

144
00:13:28,976 --> 00:13:32,104
నేను ప్రేక్షకులలో లేను కాబట్టి
ఇది సాఫీగానే సాగిపోతుందిలే.

145
00:13:34,106 --> 00:13:37,317
పీటీ ప్రకటనలు చేసేటప్పుడు
ఆటంకం కలిగించడమంటే మార్క్ కి భలే సరదా.

146
00:13:37,401 --> 00:13:38,986
పిత్తులు వదిలేవాడు అన్నమాట.

147
00:13:40,988 --> 00:13:45,868
సరేమరి, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. నేను
మార్క్ ని, మీకు ప్రకటనలు చేసే కొత్తవాడిని.

148
00:13:50,330 --> 00:13:51,665
ఇక్కడ కొన్ని విషయాలే ఉన్నాయి.

149
00:13:51,748 --> 00:13:54,501
ఎందుకంత విచిత్రంగా నిలబడ్డావు?
సరిగ్గా నిలబడు.

150
00:13:55,544 --> 00:13:57,421
నేను... నేను సూపర్ గా నిలబడి ఉన్నాను.

151
00:13:57,921 --> 00:14:00,507
నీకు ఇబ్బందిగా ఉందా?
మేమందరమూ పక్కకి చూడమా?

152
00:14:00,591 --> 00:14:03,844
రీసైకిల్ బిన్ లో చెత్తను వేస్తున్నారు.

153
00:14:03,927 --> 00:14:06,597
అందరూ దయచేసి అలా చేయకండి.

154
00:14:08,056 --> 00:14:12,811
ఇంకో విషయం, చీటీలను
ముఖాల మీద అంటించుకోకూడదు.

155
00:14:12,895 --> 00:14:14,521
అవి మీ పనియేతర అవతారం యొక్క ముఖం
మీద ఉండే పోర్స్ ని దెబ్బతీస్తాయి.

156
00:14:15,230 --> 00:14:18,817
నా గురించే అది. నేను ఊరికే
ముఖం మీద చీటీలు అంటించుకుంటుంటా.

157
00:14:18,901 --> 00:14:22,905
అదీగాక, ఇంతకు ముందు గెలిచి సాధించుకొన్న
విందు పార్టీలను ఇకపై గొప్పగా చెప్పుకోకండి.

158
00:14:22,988 --> 00:14:23,989
నన్ను ఉద్దేశించే అంటున్నారు కదా.

159
00:14:25,365 --> 00:14:26,366
ఆఖరిగా...

160
00:14:31,079 --> 00:14:34,249
ఒక రాజీనామా అభ్యర్థనకు ఇంత త్వరగా
ప్రతిస్పందించడం నేనెప్పుడూ చూడలేదే.

161
00:14:36,418 --> 00:14:39,129
పని వేళలయ్యాక వెళ్లనా లేదా
ఇప్పుడే వెళ్లిపోనా?

162
00:14:44,885 --> 00:14:47,804
చివరగా, హెల్లి సమర్పించిన రాజీనామా...

163
00:14:49,723 --> 00:14:50,724
తిరస్కరించబడింది.

164
00:14:53,519 --> 00:14:54,770
అది నిజం అయ్యుండదు.

165
00:14:55,854 --> 00:14:56,980
నా పనియేతర అవతారం అలా చేయదు.

166
00:15:01,777 --> 00:15:03,737
పీటీ ఏమనేవాడంటే...

167
00:15:22,923 --> 00:15:24,049
ఇది భలే సరదాగా ఉంటుంది.

168
00:15:25,342 --> 00:15:30,055
నేను చడీచప్పుడు కాకుండా
తలుపు దగ్గరకు వెళ్లనా?

169
00:15:30,138 --> 00:15:32,307
- వాడు పనికెళ్లాడు. ఎలా వెళ్లినా పర్లేదు.
- అది నీకెలా తెలుసు?

170
00:15:32,391 --> 00:15:34,393
- వాడి కారు ఇక్కడ లేదు కదా.
- చెప్పాపెట్టకుండా ఆఫీసు ఎగ్గొట్టాడేమో.

171
00:15:34,977 --> 00:15:36,395
వెళ్లి దాన్ని పెట్టేసి రాగలవా?
నాకు సుసు వస్తోంది.

172
00:15:36,895 --> 00:15:37,980
సరే.

173
00:15:51,326 --> 00:15:54,204
తలుపుకు ఆనించి పెట్టనా,
లేదా పక్కకు పెట్టనా?

174
00:15:54,288 --> 00:15:55,956
ఎలాగైనా పర్వాలేదు.

175
00:15:58,083 --> 00:16:00,043
- ఆశ్చర్యపోతాడు అంటావా?
- తప్పకుండా.

176
00:16:00,711 --> 00:16:03,297
బంగారం, నేను పక్కగా పెడతానులే.

177
00:16:03,380 --> 00:16:04,381
సూపర్.

178
00:16:14,183 --> 00:16:15,184
- సూపర్ గా పెట్టేశా.
- మంచిది.

179
00:16:15,267 --> 00:16:17,060
- అదిరిపోయేలా పెట్టా.
- అవును.

180
00:16:24,318 --> 00:16:25,652
దాన్ని చూసి ఎగిరి గంతేస్తాడు.

181
00:16:25,736 --> 00:16:27,196
- అవును.
- వాడు త్వరగా వచ్చేయాలని కోరుకుంటున్నా.

182
00:16:27,279 --> 00:16:28,405
వాడు త్వరగా రాడు.

183
00:17:09,154 --> 00:17:11,448
మార్క్

184
00:17:28,799 --> 00:17:30,759
హేయ్. ఏంటది? సుడోకూనా?

185
00:17:31,385 --> 00:17:32,386
ఏమీ లేదులే.

186
00:17:33,053 --> 00:17:34,179
ఏం గీస్తున్నావు?

187
00:17:34,263 --> 00:17:36,890
నువ్వు పని చేయడం
ప్రస్ఫుటంగా కనబడేలా గీస్తున్నాను.

188
00:17:36,974 --> 00:17:40,143
సరే, రెండు విషయాలు అడుగుతాను.
ప్రస్ఫుటంగా కనబడేలా ఎలా గీస్తావు?

189
00:17:40,227 --> 00:17:42,437
ఇంకోటి, నీ డ్రెస్ ఏంటి అలా ఉంది?

190
00:17:45,607 --> 00:17:46,733
అయ్యయ్యో.

191
00:18:55,886 --> 00:18:56,887
అయ్యో.

192
00:19:06,522 --> 00:19:08,440
జెమ్మాస్ క్రాఫ్ట్స్

193
00:19:22,621 --> 00:19:23,622
ఏంటి?

194
00:19:29,503 --> 00:19:32,256
ప్రకటన తర్వాత అతను ఆమెకి ఏం చెప్పాడు?

195
00:19:44,184 --> 00:19:45,644
లేదులే, మరీ అంత దారుణమేమీ కాదులే.

196
00:19:52,693 --> 00:19:55,529
కాస్తంత దూకుడు ఎక్కువ అంతే.

197
00:19:58,073 --> 00:20:00,033
తనను ఉద్దేశించి
ఏమైనా మంచి మాటలు చెప్పావా?

198
00:20:02,077 --> 00:20:04,496
ఆహా. ఆహా.

199
00:20:05,497 --> 00:20:06,498
నేను వస్తున్నాను.

200
00:21:09,853 --> 00:21:11,188
హేయ్, హెల్లి?

201
00:21:11,271 --> 00:21:12,272
వెళ్లిపో.

202
00:21:12,773 --> 00:21:14,733
- నువ్వు బాగానే ఉన్నావు కదా?
- బాగానే ఉన్నాను.

203
00:21:14,816 --> 00:21:16,485
అంటే, నువ్వు వెళ్లి 45 నిమిషాలకు
పైనే అయింది.

204
00:21:21,740 --> 00:21:23,116
నేను టాయిలెట్ పోతున్నా.

205
00:21:23,784 --> 00:21:27,538
సరే. అంటే...
నువ్వు వెళ్లి చాలా సేపయింది మరి.

206
00:21:27,621 --> 00:21:30,249
- నాకేమీ కాలేదులే, మార్క్.
- నేను లోపలికి రావాలి.

207
00:21:30,916 --> 00:21:32,543
- అది... పర్వాలేదు కదా?
- వద్దు!

208
00:21:33,126 --> 00:21:36,171
నేను లోపలికి వస్తున్నాను,
కాబట్టి సిద్ధంగా ఉండు.

209
00:21:36,255 --> 00:21:38,298
నువ్వేం చేయాలో చేసేయ్,
ఎందుకంటే నేను లోపలికి వచ్చేస్తున్నా.

210
00:21:38,382 --> 00:21:39,383
వద్దు!

211
00:21:39,466 --> 00:21:41,552
- సరే, వచ్చేస్తున్నా. మన్నించాలి.
- మార్క్, వద్దు! నా డ్రెస్ సరిగ్గా లేదు!

212
00:21:41,635 --> 00:21:42,845
- వద్దు... అబ్బా.
- మన్నించాలి. నేను...

213
00:21:46,390 --> 00:21:47,975
నేరుగా చర్మం మీద రాసుకుంటున్నావే.

214
00:21:48,475 --> 00:21:51,812
దురదృష్టవశాత్తు, డిటెక్టర్స్
నువ్వు ఎక్కడ రాసుకున్నా పసిగట్టేస్తాయి.

215
00:21:51,895 --> 00:21:53,897
ఇవి నీకు అక్షరాల్లా కనబడుతున్నాయా?

216
00:21:53,981 --> 00:21:55,941
నువ్వు రెండు చేతులను కలిపితే,
అప్పుడు అక్షరాలవుతాయి.

217
00:21:58,110 --> 00:21:58,944
అది మంచి ఐడియానే.

218
00:21:59,027 --> 00:21:59,862
నన్ను పంపించేయండి

219
00:22:01,905 --> 00:22:04,867
నీకు ఇక్కడి వాతావరణం నచ్చడం
మొదలైందని అనుకున్నానే.

220
00:22:04,950 --> 00:22:06,451
అంకెల పని చూసుకున్నాను కదా అని
అలా అనుకున్నావా?

221
00:22:06,535 --> 00:22:09,705
నీకు ఒక విజయం దక్కింది కదా.
చాలా మందికి అది ఆనందాన్ని కలిగిస్తుంది.

222
00:22:09,788 --> 00:22:11,665
దాని వల్ల భయం తప్ప ఇంకేదీ కలగదు.

223
00:22:11,748 --> 00:22:14,376
అది అంకెల్లో ఒక భాగం మాత్రమే.
ఊరటనిచ్చేవి ఇంకా చాలా ఉన్నాయి...

224
00:22:14,459 --> 00:22:16,170
మార్క్, నాకు ఇక్కడ మీతో పని చేయాలని లేదు.

225
00:22:16,253 --> 00:22:19,006
కాబట్టి ఇలా బాత్రూమ్లోకి దూసుకొచ్చి
బాస్ గొంతులో మాట్లాడాలని కష్టపడిపోతూ

226
00:22:19,089 --> 00:22:20,382
నాకు నచ్చజెప్పాలని ప్రయత్నించకు.

227
00:22:24,720 --> 00:22:26,763
సరే, అయిదు నిమిషాల్లో
నీ చేతులని శుభ్రంగా కడుక్కొని రా.

228
00:22:26,847 --> 00:22:28,098
లేకపోతే ఏమవుతుంది?

229
00:22:29,391 --> 00:22:31,602
గ్రేనర్ నీ పై ఆ దరిద్రపు సబ్బును
ప్రయోగించాలా ఏంటి?

230
00:22:33,478 --> 00:22:34,646
దరిద్రపు సబ్బు కూడా ఉందా?

231
00:22:39,776 --> 00:22:40,986
థ్యాంక్స్, బాస్.

232
00:22:42,029 --> 00:22:43,697
అవును, ఇక్కడ పని చేయడం నా భాగ్యం.

233
00:22:44,198 --> 00:22:45,324
- మార్క్.
- అర్వ్.

234
00:22:45,407 --> 00:22:47,576
నేను తలుపు దగ్గరే నిలబడి
మొత్తం వినేశాను.

235
00:22:47,659 --> 00:22:49,661
- సరే.
- కలుషిత ఆహారం తిని ఇప్పుడిప్పుడే

236
00:22:49,745 --> 00:22:53,290
కోలుకుంటున్నావు, ఇప్పుడు ఇంతటి
ఒత్తిడితో కూడిన వాగ్వాదం అవసరమా?

237
00:22:53,373 --> 00:22:54,583
పర్వాలేదులే.

238
00:22:54,666 --> 00:22:56,919
తను నీతో మాట్లాడేటప్పుడు
తన గొంతులో చాలా అసహ్యం కనిపిస్తోంది.

239
00:22:57,002 --> 00:22:58,462
కలవడానికి కాస్త సమయం పడుతుందిలే.

240
00:22:58,545 --> 00:22:59,796
అలాగే మార్గనిర్దేశానికి కూడా.

241
00:23:01,507 --> 00:23:02,674
నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, అర్వింగ్?

242
00:23:05,761 --> 00:23:08,805
డిలన్ నిన్నంతా బోనస్ లు, ఎరేసర్లు,
వాఫుల్ పార్టీల గురించే మాట్లాడాడు,

243
00:23:08,889 --> 00:23:12,518
అదేదో మనం వాటి కోసమే
ఇక్కడ పని చేస్తున్నట్టు.

244
00:23:12,601 --> 00:23:14,228
మనం ఇక్కడ పని చేసేది వాటి కోసం కాదు.

245
00:23:15,395 --> 00:23:21,318
తనకి ఇందులోని పరమార్థం తెలియాలంటే,
తనని పర్పెటువిటీ వింగ్ లోకి తీసుకెళ్లాలి.

246
00:23:21,401 --> 00:23:23,570
ఆ సమాచారమంతా తనకు ఇచ్చిన
హ్యాండ్ బుక్ లో ఉంటుంది కదా.

247
00:23:23,654 --> 00:23:27,199
కానీ అక్కడ ఉండి దాన్ని కళ్లారా చూస్తే
ఆ ఫీల్ వేరు అని నీకు తెలుసు.

248
00:23:29,284 --> 00:23:31,703
ఇప్పుడే అంటే తొందరపాటు అవుతుందేమో
అనిపిస్తోంది. అక్కడ చాలా సారం ఉంటుంది.

249
00:23:31,787 --> 00:23:36,208
అవును. అక్కడే సారమంతా ఉంటుంది.

250
00:23:41,004 --> 00:23:42,005
తనిఖీ ఎలా సాగింది?

251
00:23:42,548 --> 00:23:46,176
తన ఇంటి తలుపు దగ్గర ఎవరో ఒక ప్యాకేజీని
పెట్టారు. దీన్ని తెరిచి చూడవా?

252
00:23:47,302 --> 00:23:48,887
నువ్వు అనబడే నువ్వు
నీ ఆధ్యాత్మిక ఆత్మకథ

253
00:23:48,971 --> 00:23:49,888
డాక్టర్ రికెన్
లాజ్లో హేల్, పీహెచ్డీ

254
00:23:49,972 --> 00:23:51,890
- ఓరి దేవుడా.
- ఇతను బావ కదా?

255
00:23:51,974 --> 00:23:53,684
రికెన్. వాడి అయిదవ పుస్తకం.

256
00:23:57,187 --> 00:24:01,066
"అధ్యాయం 12: నా భార్య ముందు భావావేశపరంగా
నర్మగర్భంగా ఉండటం నేర్చుకోవడం."

257
00:24:01,149 --> 00:24:04,069
ఎందుకైనా మంచిది,
అందులో ఏమైనా సందేశాలున్నాయేమో చూడు.

258
00:24:04,653 --> 00:24:05,779
మార్క్.

259
00:24:07,197 --> 00:24:09,157
- ఏమైనా పనా?
- ఆమెతో నేను ఒక్క నిమిషం మాట్లాడవచ్చా?

260
00:24:09,241 --> 00:24:13,036
పై అధికారితో మాట్లాడటానికి
అధికారిక అభ్యర్థనను సమర్పించావా?

261
00:24:14,538 --> 00:24:16,748
- లేదు, నేను...
- పర్వాలేదులే. లోపలికి రా.

262
00:24:16,832 --> 00:24:18,709
మన్నించాలి.
నేను ఆ ఫారాన్ని పూరించి వస్తాను.

263
00:24:19,418 --> 00:24:20,419
ఏంటి సంగతి?

264
00:24:23,088 --> 00:24:24,089
తలుపు మూసివేయ్.

265
00:24:28,093 --> 00:24:31,597
హెల్లిని ఇవాళ పర్పెటువిటీ వింగ్ కి
తీసుకువెళ్తే మంచిదని అర్వింగ్ అంటున్నాడు.

266
00:24:31,680 --> 00:24:34,516
డిపార్టుమెంట్ చీఫ్ నువ్వా, అర్వింగ్ ఆ?

267
00:24:34,600 --> 00:24:40,898
మన్నించాలి. హెల్లిని, మిగతా బృందాన్ని
నేను పర్పెటువిటీ వింగ్ కి తీసుకెళ్తాను.

268
00:24:40,981 --> 00:24:44,443
అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశాన్ని
సందర్శించడానికి ఫారాన్ని పూరించావా?

269
00:24:46,236 --> 00:24:48,822
- లేదు, నేను...
- మార్క్.

270
00:24:48,906 --> 00:24:52,284
మన్నించండి. నేను ఇప్పుడే...
ఏమో తెలియడం లేదు.

271
00:24:52,367 --> 00:24:55,037
పీటీ వెళ్లిపోయినప్పటి నుండి
అంతా చిత్రవిచిత్రంగా ఉంది.

272
00:24:56,663 --> 00:25:00,751
అంటే, అతను ఉన్నప్పుడు...
అంతా బాగా ఉండేలా చూసుకొనేవాడు.

273
00:25:02,836 --> 00:25:06,924
నువ్వు అన్నట్టు పీటీ అలాంటివాడే అయితే,

274
00:25:07,799 --> 00:25:09,426
అతను ఇంకా ఇక్కడ పని చేస్తూ ఉండేవాడే.

275
00:25:12,054 --> 00:25:13,055
అంటే ఏంటి?

276
00:25:14,848 --> 00:25:17,518
నీ మీదకి నేను ఇప్పుడు
నా మగ్గు విసరాలా ఏంటి?

277
00:25:19,061 --> 00:25:20,812
నా... నేనేం చేశానని...

278
00:25:22,898 --> 00:25:25,442
- ముందు ఎండిఆర్ చేత అంకెల పని చేయించు.
- సరే.

279
00:25:28,612 --> 00:25:29,613
మార్క్?

280
00:25:31,240 --> 00:25:35,869
ఇప్పుడు నేను చేసిన పని ద్వారా నువ్వు
నేర్చుకొని ఎదగగలవని నాకు తెలుసు.

281
00:25:37,037 --> 00:25:39,373
నేను అలా చేయడం
నాకే చాలా బాధగా అనిపించింది.

282
00:25:41,333 --> 00:25:43,460
ఇది నీకు ఉపయోగకరంగా ఉంటుందనే ఆశిస్తున్నా.

283
00:25:50,968 --> 00:25:52,261
తెరిచి ఉంచనా లేదా మూసివేయనా?

284
00:25:58,183 --> 00:25:59,351
రెండూ చేయ్.

285
00:26:03,605 --> 00:26:04,606
అయితే నేను...

286
00:26:09,903 --> 00:26:14,950
నా కండలు ఇవాళ చాలా బాగున్నాయి. నా పనియేతర
అవతారం కండరాల ప్రదర్శన చేస్తుంటాడు.

287
00:26:15,033 --> 00:26:17,911
అదే నిజమైతే, నువ్వు ఇక్కడ
పని చేస్తూ ఉండవు.

288
00:26:17,995 --> 00:26:19,872
మన్నించాలి, కండరాల ప్రదర్శన ద్వారా
ఎంత సంపాదన ఉంటుందో నీకు తెలుసా?

289
00:26:19,955 --> 00:26:21,456
తెలీదు, మనలో ఎవరికీ కూడా
అది తెలిసే అవకాశం లేదు.

290
00:26:21,540 --> 00:26:23,333
అది అంచెలంచెల వ్యవస్థ
అయి ఉంటుంది అనుకుంటా.

291
00:26:23,417 --> 00:26:24,501
నాకు ఇక్కడ పని చేయాలని లేదు

292
00:26:24,585 --> 00:26:27,254
బహుశా పసిడి, రజతం, కాంస్యం, ఇలా
విభజించి, నగదు బహుమతులు ఇస్తారేమో.

293
00:26:27,337 --> 00:26:31,508
లేదు, వాళ్లు ఒక్కో ప్రదేశాన్ని
బట్టి డబ్బులిస్తారనుకుంటా. అంటే...

294
00:26:31,592 --> 00:26:33,969
- అలా అయ్యుండదు.
- అత్యుత్తమ భుజాలకు 30 డాలర్లు.

295
00:26:34,052 --> 00:26:38,140
అత్యుత్తమ ఛాతీకి 20 కండరాలు, బైసెప్స్
ఫ్యాన్సీగా ఉంటాయి కనుక వాటికి 75 డాలర్లు.

296
00:26:38,223 --> 00:26:39,892
లాట్స్ కి ఎక్కువ ఇస్తారనుకుంటా.

297
00:26:39,975 --> 00:26:42,728
కండరాల పోషించేవారు, అవే
ఆకర్షణీయమైనదని చెప్తుంటారు.

298
00:26:42,811 --> 00:26:44,605
అలాగే ఈ సమాజానికి కూడా
చాలా వరకు అవే నచ్చుతాయి.

299
00:26:44,688 --> 00:26:46,190
లాట్స్ లేదు, తొక్కా లేదు, బాసూ...

300
00:26:46,273 --> 00:26:49,359
- మంచి ఆకృతికి అది చాలా ముఖ్యం.
- అది కేవలం నీ అభిప్రాయమే, అర్వ్...

301
00:26:49,443 --> 00:26:51,445
- నా లాట్స్ ని నువ్వు ఎప్పుడూ గమనించలేదా?
- ...నిజంగా ఒక్కసారి కూడా చూడలేదు.

302
00:26:51,528 --> 00:26:56,658
నా ఆకృతి ఇంత నిటారుగా ఎందుకు
ఉందో నీకు తెలియట్లేదు. ఎందుకంటే...

303
00:27:04,833 --> 00:27:05,959
దాహంగా ఉందా?

304
00:27:09,213 --> 00:27:12,466
హేయ్, ఇప్పుడు నేను చెప్పబోయేది
నీకు పనికి రావచ్చేమో,

305
00:27:12,549 --> 00:27:17,346
కోడ్ డిటెక్టర్లు, నీ శరీరంలో సందేశాలు
ఎక్కడ దాగి ఉన్నా పసిగట్టేస్తాయి.

306
00:27:20,182 --> 00:27:25,979
ఆ తర్వాత, ఆ సందేశాన్ని నీ శరీరం నుండి
బయటకు తీసే బాధ్యత మిల్చెక్ ది.

307
00:27:26,563 --> 00:27:31,235
నువ్వు దాన్ని ఎప్పుడు మింగావు
అని అతను అడిగినప్పుడు,

308
00:27:31,318 --> 00:27:34,613
నువ్వు నిజాయితీగా ఉంటే నీకే మంచిది.

309
00:27:36,782 --> 00:27:40,077
దాన్ని ఏ వైపు నుండి తీయాలో అతనికు తెలిస్తే
అది మీ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

310
00:27:50,254 --> 00:27:51,547
ఈ ప్రయత్నం కూడా బాగానే ఉంది.

311
00:27:56,552 --> 00:27:58,846
నీ సిస్టమ్ ని ఆపివేసిరా.
మనం ఒక చోటుకు వెళ్తున్నాం.

312
00:27:58,929 --> 00:28:00,472
శక్తి అంతా పిక్కలలోనే ఉంటుంది.

313
00:28:00,556 --> 00:28:04,393
...మొదట్నుంచీ అంతే. అది
మాత్రం పక్కాగా చెప్పగలను, కుర్రోడా.

314
00:28:05,269 --> 00:28:07,729
మొత్తం ఎనిమిది మంది సీఈఓలు,
అందరూ ఈగన్ కుటుంబీకులే.

315
00:28:07,813 --> 00:28:09,690
వ్యవస్థాపకుని నుండీ అంతా వాళ్లే.

316
00:28:09,773 --> 00:28:12,860
వారి పేర్లను గుర్తుంచుకోవడం సులభతరం
చేసేందుకు నా దగ్గర ఒక కవిత కూడా ఉంది.

317
00:28:12,943 --> 00:28:16,363
దాన్ని నేనే రాశాను, అది మన
కార్పొరేట్ నియమాలకు విరుద్ధం,

318
00:28:16,446 --> 00:28:18,740
ఇంకా అస్సలు కవిత్వంలానే అనిపించదు.

319
00:28:18,824 --> 00:28:22,828
రెండవ చరణంలో "ఆంబ్రోస్"ది "వాటిని
నిషేధించండి" అంటూ ఒక నొప్పించేది ఉంటుంది,

320
00:28:22,911 --> 00:28:26,665
అది విచారకరమైనదే అయినా,
కథ సాగాలంటే దాన్ని తప్పక చేర్చాలి.

321
00:28:26,748 --> 00:28:30,502
ఆంబ్రోస్ ని అన్యాయంగా తన కుటుంబమనే తులసీ
వనంలో మొలిచిన గంజాయి మొక్క అంటుంటారు.

322
00:28:30,586 --> 00:28:31,587
ఏంటిది?

323
00:28:31,670 --> 00:28:34,590
అతడిని మరింతగా
దిగజార్చడం నా ఉద్దేశం కాదు,

324
00:28:34,673 --> 00:28:36,758
- కానీ నా ఉద్దేశంలో మీకు...
- "ఈగన్ బింగో"?

325
00:28:37,259 --> 00:28:38,677
హేయ్. ఈగన్ బింగో.

326
00:28:38,760 --> 00:28:42,264
- మనం ఇలా చేయకూడదు కదా? ఇది...
- ...మనం చేరుకున్నాక...

327
00:28:42,347 --> 00:28:44,183
హేయ్, ఈ ఈగన్ బింగో అంటే ఏంటి?

328
00:28:44,266 --> 00:28:46,810
పర్పెటువిటీ వింగ్ లో బోర్ కొట్టకుండా
ఉండాలంటే ఇది తప్పనిసరి.

329
00:28:46,894 --> 00:28:48,896
అదీగాక, అర్వ్ తప్ప మిగతా వాళ్ళందరమూ

330
00:28:48,979 --> 00:28:50,689
దగ్గరవ్వడానికి ఇదొక మంచి అవకాశం.

331
00:29:02,284 --> 00:29:03,535
ఆప్టిక్స్ అండ్ డిజైన్.

332
00:29:04,953 --> 00:29:06,705
మ్యాక్రోడేటా రిఫైన్మెంట్.

333
00:29:08,624 --> 00:29:09,625
బర్ట్.

334
00:29:09,708 --> 00:29:10,709
హాయ్.

335
00:29:11,418 --> 00:29:13,212
మీ సెషన్ బాగా జరిగింది అనుకుంటా.

336
00:29:13,295 --> 00:29:15,005
చాలా బాగా జరిగింది, బాగా ఉపయోగపడింది.

337
00:29:15,088 --> 00:29:16,548
ఏంటి... మీ ఇద్దరూ ఒకరికొకరు తెలుసా?

338
00:29:16,632 --> 00:29:21,595
మేము ఇందాకటి నుండే లూమన్ కళాఖండాల
గురించి గొప్పగా చర్చించుకుంటున్నాం.

339
00:29:21,678 --> 00:29:24,431
గుర్తుంచుకో, మనకి ఆ చిన్న సంచులు
త్వరలోనే అందించబడతాయి.

340
00:29:24,515 --> 00:29:25,641
సూపర్.

341
00:29:25,724 --> 00:29:27,935
సమాచారానికి థ్యాంక్స్. ఏమైనా పనుందా
లేదా ఊరికే అలా బయటకు వచ్చారా?

342
00:29:28,018 --> 00:29:30,854
- డిలన్.
- ఏంటి? మీరు చాలా గొప్పవాళ్ళు కదా,

343
00:29:30,938 --> 00:29:34,358
మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని అడిగానంతే.
మామూలుగా మీ గది నుండి మీరు బయటకు రారు కదా.

344
00:29:34,441 --> 00:29:37,236
టీమ్ బిల్డింగ్ ప్రదేశంలో
ఎగ్ డ్రాప్ ఛాలెంజ్ చేస్తున్నాం.

345
00:29:38,153 --> 00:29:40,447
మా శాఖలోని వాళ్లకి తీరిక ఉండదు కనుక,
ఇలాంటి ఉత్తేజకర కార్యక్రమాలు అవసరం.

346
00:29:40,531 --> 00:29:43,033
ఎగ్ డ్రాప్ ఛాలెంజ్.
దీన్ని నమ్ముతున్నారా మీరు?

347
00:29:43,116 --> 00:29:44,785
- మరి మీరేం చేస్తున్నారు?
- ఫెలీషియా.

348
00:29:44,868 --> 00:29:48,038
పర్పెటువిటీ వింగ్ ని చూడటానికి వెళ్తున్నాం.
ఈమె మా కొత్త రిఫైనర్, హెల్లి.

349
00:29:48,121 --> 00:29:49,456
- ఆమె ఇక్కడ...
- స్వాగతం, హెల్లి.

350
00:29:50,499 --> 00:29:55,671
ఇక మేము బయలుదేరాలి.
మా శాఖలో ఎవరూ లేకుంటే బాగుండదు.

351
00:29:56,713 --> 00:29:58,006
మిమ్మల్ని చూడటం సంతోషం, ఓ&డీ.

352
00:30:00,175 --> 00:30:01,510
ఆ గుడ్లు దరిద్రంగా ఉన్నాయి.

353
00:30:07,599 --> 00:30:08,642
అర్వింగ్, పద.

354
00:30:16,650 --> 00:30:17,651
సెత్?

355
00:30:23,615 --> 00:30:24,783
నాటలీ.

356
00:30:24,867 --> 00:30:26,869
హార్మనీ, హలో.

357
00:30:27,494 --> 00:30:30,706
నేను నువ్వు వస్తావని అనుకోలేదు...
హెలెనా గురించి వచ్చావా?

358
00:30:31,290 --> 00:30:33,417
లేదు, పీటర్ కిల్మర్ గురించి.

359
00:30:33,500 --> 00:30:36,044
ఇంకా మనతో బోర్డు కూడా
ఈ చర్చలో పాల్గొంటోంది.

360
00:31:03,614 --> 00:31:05,532
ముందు నువ్వు మాట్లాడాలని బోర్డు అభిమతం.

361
00:31:05,616 --> 00:31:07,117
అలాగే. తప్పకుండా.

362
00:31:07,701 --> 00:31:09,036
నమస్కారములు.

363
00:31:15,250 --> 00:31:17,669
కిల్మర్ కోసం మేము గాలిస్తూనే ఉన్నాం.

364
00:31:24,426 --> 00:31:26,178
నేను ఒక విషయం చెప్తాను.

365
00:31:26,261 --> 00:31:29,431
కంగారుపెట్టాలని కాదు,
కానీ అతను వెళ్లిపోయే ముందు,

366
00:31:29,515 --> 00:31:34,394
అతనిలో ఆందోళనకరమైన లక్షణాలు
కనిపించాయి... ఏకీకరణకు సంబంధించినవి.

367
00:31:47,908 --> 00:31:48,909
సరే.

368
00:31:48,992 --> 00:31:52,037
సరే, వేర్పాటు పద్ధతిని పునరుద్ధరించడం

369
00:31:52,120 --> 00:31:55,374
అసాధ్యమని బోర్డు చాలా గట్టిగా చెప్తోంది.

370
00:31:56,291 --> 00:31:57,292
అవును...

371
00:31:57,376 --> 00:32:01,255
అలాగే, ఆ విషయాన్ని ప్రత్యేకమైన అంతస్థును
చూసుకొనేవారికి కూడా తెలపాలని చెప్తోంది.

372
00:32:01,338 --> 00:32:02,506
తప్పకుండా.

373
00:32:02,589 --> 00:32:05,592
ఇంకా, మూడు వారాల్లో ముగియనున్న
ఈ త్రైమాసికానికి నిర్దేశించిన లక్ష్యాన్ని

374
00:32:05,676 --> 00:32:07,845
ఎండిఆర్ చేరుకొనేలా కూడా
చూసుకొనే బాధ్యత తన మీదనే ఉంది.

375
00:32:07,928 --> 00:32:09,596
అవును, తప్పకుండా.

376
00:32:10,514 --> 00:32:15,269
మా చురుకైన కొత్త రిఫైనర్ తో
మా ఉత్పాదకత వేగంగా పెరిగింది.

377
00:32:15,853 --> 00:32:18,772
- మరో విషయం, నేను ఒక...
- బోర్డు కాల్ నుండి నిష్క్రమించింది.

378
00:32:21,483 --> 00:32:24,069
సరే. థ్యాంక్యూ.

379
00:32:26,071 --> 00:32:28,282
- నేను ఓ విషయం అడగవచ్చా...
- ఉంటాను, హార్మనీ.

380
00:32:34,454 --> 00:32:37,833
ఆ డిపార్టుమెంట్లో ఇద్దరే ఉంటారా? ఎప్పుడూ
వాళ్ళ ముఖాలు వాళ్లే చూసుకుంటుంటారా?

381
00:32:37,916 --> 00:32:41,128
చాలా వరకు అంతే. అది
చాలా ఒంటరిగా అనిపిస్తుంది అనుకుంటా.

382
00:32:41,211 --> 00:32:43,213
ఇంకా అసహజమైనది, విచిత్రమైనది కూడా.

383
00:32:43,297 --> 00:32:44,381
ఓ&డీ బాగానే ఉంటుంది.

384
00:32:44,464 --> 00:32:47,217
అది నిజం కాదు.
వాళ్లకి మన విలువలు కూడా పట్టవు.

385
00:32:47,301 --> 00:32:49,261
కియర్ గుణాలవారీగా
డిపార్టుమెంట్లను విభజించారు.

386
00:32:49,344 --> 00:32:53,056
మ్యాక్రోడేటాలోని వారు తెలివిమంతులు,
నిజాయితీపరులు, కానీ ఓ&డీ వారు క్రూరులు.

387
00:32:53,140 --> 00:32:54,266
మొత్తం ఎన్ని డిపార్టుమెంట్లు ఉన్నాయి?

388
00:32:54,349 --> 00:32:55,475
- ముప్పై దాకా ఉంటాయి.
- అయిదు వరకు ఉంటాయి.

389
00:32:55,559 --> 00:32:56,935
అది ఎవరికీ అంత ఖచ్చితంగా తెలీదు.

390
00:32:57,019 --> 00:32:59,897
కొన్ని శతాబ్దాల క్రితం, ఓ&డీ వారు ఇతరులపై
చాలా హింసాత్మకరీతిలో దురాక్రమణ చేయబోయారు,

391
00:32:59,980 --> 00:33:01,773
అందుకే ఆ డిపార్టుమెంట్ సంఖ్యను
ఇద్దరికి కుదించారు.

392
00:33:01,857 --> 00:33:03,734
అందుకే వాళ్ళు మనల్నందరినీ
దూరంగా ఉంచుతున్నారు.

393
00:33:03,817 --> 00:33:05,527
అదంతా కట్టు కథ.

394
00:33:05,611 --> 00:33:06,737
వాళ్లు ఎవరినైనా చంపారా?

395
00:33:06,820 --> 00:33:09,448
లేదు. దురాక్రమణ జరగలేదు.
ప్రాణలు కూడా పోలేదు.

396
00:33:09,531 --> 00:33:11,617
అయితే, అందరం కలిసి
సరదగా గడపవచ్చు కదా?

397
00:33:12,534 --> 00:33:14,870
అంటే, దురాక్రమణ జరగలేదని
నేను 99% నమ్మకంతో చెప్పగలను.

398
00:33:17,247 --> 00:33:20,042
వాళ్లు ఒకవేళ మన మీద దాడి చేస్తే,
మనం మార్క్ ని చంపేయాలి.

399
00:33:20,125 --> 00:33:21,251
- అవునా?
- అవును.

400
00:33:21,752 --> 00:33:23,712
అలా చేస్తే మనకి పిచ్చి అని, మనం
ఎంతకైనా తెగిస్తామని వాళ్లు అనుకుంటారు.

401
00:33:23,795 --> 00:33:25,005
తెలివైన పని. అది చాలా తెలివైన పని.

402
00:33:25,088 --> 00:33:28,091
అంటే, మేమందరం ఒక మూలన నిలబడి,
రక్తపు మడుగులో ఉంటామని ఊహించుకుంటున్నా,

403
00:33:28,175 --> 00:33:31,720
అప్పుడు నేను నీ ముఖాన్ని వేసుకొని ఉంటా,
వాళ్లు "ఎవరి ముఖం అది?" అని అడుగుతారు.

404
00:33:31,803 --> 00:33:35,057
అప్పుడు నేను "మా జీవితాలని నాశనం
చేసిన ఆఖరి వ్యక్తిది," అని అంటాను.

405
00:33:36,391 --> 00:33:38,769
అది నాకెందుకో చాలా బలీయమైన
చిత్రంలా అనిపిస్తోంది.

406
00:33:38,852 --> 00:33:42,272
కాకపోతే... వాళ్లు నా ముఖాన్ని
గుర్తుపట్టేస్తారు అనుకుంటా.

407
00:33:42,356 --> 00:33:43,857
నా ముఖాన్ని లోపలిది బయటకు
కనబడేలా ధరిస్తే మంచిదేమో?

408
00:33:52,741 --> 00:33:53,784
పర్పెటువిటీ వింగ్

409
00:33:53,867 --> 00:33:54,868
మనం వచ్చేశాం.

410
00:34:00,958 --> 00:34:03,043
అందరి మనస్సులో ఉండే వ్యక్తికి
మరణం ఉండదు. - కియర్ ఈగన్

411
00:34:03,126 --> 00:34:05,921
మనం చరిత్రను తెలుసుకొన్నా, తెలుసుకోకపోయినా
అది మనలోనే ఉంటుంది - జేమ్ ఈగన్

412
00:34:10,676 --> 00:34:13,303
"నా పరిశ్రమలో పని చేసే
వ్యక్తుల్లారా, స్వాగతం,

413
00:34:13,846 --> 00:34:16,764
ఇప్పుడు నా సంతతి గురించి తెలుసుకోండి."

414
00:34:19,601 --> 00:34:20,601
వావ్.

415
00:34:21,478 --> 00:34:27,734
ఆయన జేమ్ ఈగన్.
ప్రస్తుత సీఈఓ అతనే. చాలా గొప్ప వ్యక్తి.

416
00:34:28,569 --> 00:34:31,530
అందగాడు కూడా.
ఆ కనుబొమలు చూడు ఎలా ఉన్నాయో?

417
00:34:54,719 --> 00:34:58,307
మధ్యలో ఉండే ప్రతిమలన్నీ
గత ఈగన్ సీఈఓలకి చెందినవి.

418
00:34:59,057 --> 00:35:01,935
కానీ వెనుక ఉండేదంతా
కేవలం కియర్ ది మాత్రమే.

419
00:35:25,209 --> 00:35:28,295
నాకు మరణం సమీపిస్తోందని అర్థమైంది,

420
00:35:28,378 --> 00:35:34,593
ఎందుకంటే, జీవితంలో నేను సాధించిన అత్యుత్తమ
విజయం ఏంటని అందరూ అడగడం మొదలుపెట్టారు.

421
00:35:35,177 --> 00:35:40,516
నేను చనిపోయాక, నన్ను ఏ విధంగా తలచుకోవాలా
అని వాళ్లు తెలుసుకోవాలనుకుంటున్నారు.

422
00:35:41,266 --> 00:35:48,106
నా జీవితంలో, నేను నాలుగు భాగాలను
గుర్తించాను, వాటిని భావావేశాలని అంటాను,

423
00:35:48,190 --> 00:35:52,236
వాటి నుండే మానవుడు ఉద్భవించాడు.

424
00:35:52,819 --> 00:35:58,242
బాధ. సంతోషం. భయం. క్రూరత్వం.

425
00:35:58,325 --> 00:35:59,618
సీఈఓ 1865-1939
కియర్ ఈగన్ 1841-1939

426
00:35:59,701 --> 00:36:05,541
ప్రతీ వ్యక్తి గుణం, ఈ భాగాలు ఏ నిష్పత్తిలో
ఉన్నాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.

427
00:36:05,624 --> 00:36:07,292
సీఈఓ 1959-1976
బెయిర్డ్ ఈగన్ 1902-1976

428
00:36:07,376 --> 00:36:11,171
నేను నా అంతరంగం లోలోతులకు వెళ్లి
ఆలోచించి, వాటిని ఆధీనంలోకి తెచ్చుకున్నాను.

429
00:36:11,255 --> 00:36:12,881
సీఈఓ 1987-1999
ఫిలిప్ "పిప్" ఈగన్ 1937-1999

430
00:36:12,965 --> 00:36:18,428
నాలాగే మీరు కూడా మీ భావావేశాలను
వశపరుచుకుంటే, అప్పుడు ఈ ప్రపంచం...

431
00:36:18,512 --> 00:36:19,972
సీఈఓ 1976 - 1987
గెర్హార్ట్ ఈగన్ 1920-1991

432
00:36:20,055 --> 00:36:21,306
...మీ గుప్పెట్లోకి వచ్చేస్తుంది.

433
00:36:21,390 --> 00:36:25,102
ఈ గొప్ప పవిత్రమైన శక్తినే

434
00:36:25,185 --> 00:36:30,482
నా సంతతికంతటికీ
అందించాలని కోరుకుంటున్నాను.

435
00:36:31,066 --> 00:36:32,609
సీఈఓ 1941-1959
మర్టుల్ ఈగన్ 1886-1960

436
00:36:32,693 --> 00:36:34,862
ఒక ఈగన్ గా ఉండాలంటే,

437
00:36:34,945 --> 00:36:39,783
అది ఈగన్ వారసులైనా సరే, లేదా
లూమన్ సంస్థలో పని చేసేవారైనా సరే,

438
00:36:39,867 --> 00:36:42,744
వారు కొన్ని విలువలకు కట్టుబడి ఉండాలి,

439
00:36:42,828 --> 00:36:47,583
ఆ విలువలను మేము ఎంతో విలువైనవని నమ్మి,
ఎప్పట్నుంచో పాటిస్తూ వస్తున్నాము,

440
00:36:47,666 --> 00:36:51,795
అలాగే అవే ఒకరోజున ఈ లోకానికి
శ్రీరామ రక్షగా నిలుస్తాయి అనుకుంటున్నాను.

441
00:36:51,879 --> 00:36:54,298
ఆ విలువలు మా రక్తంలోనే ఉన్నాయి,

442
00:36:54,381 --> 00:36:56,091
- కియర్ నుండి...
- వావ్, నీకు ఒకటి దొరికిందిగా.

443
00:36:56,175 --> 00:36:58,468
...మాకు అవి వారసత్వంగా లభించాయి.

444
00:36:58,552 --> 00:37:00,846
- మీ కన్నీళ్లను మీరు దాచుకోనక్కర్లేదు.
- నా చిన్నతనంలో,

445
00:37:01,513 --> 00:37:03,140
మా నాన్న నా చెవిలో చెప్పేవాడు...

446
00:37:03,223 --> 00:37:05,726
ఆమె తర్వాత అయిదు సీఈఓలు వచ్చారు.

447
00:37:07,102 --> 00:37:08,729
ఆమె తొలి మహిళా సీఈఓ.

448
00:37:09,479 --> 00:37:14,359
ఆమెకి ఏడు ఏళ్లు ఉన్నప్పుడు, ఆమె నాన్న
తను మొదటి మహిళా సీఈఓ అవుతుందని చెప్పారు.

449
00:37:14,443 --> 00:37:16,069
దార్శకినత. జోష్.

450
00:37:16,153 --> 00:37:17,696
- అది భలేగా ఉంది కదా?
- తెలివి.

451
00:37:17,779 --> 00:37:19,031
- అది చాలా బాగుంది.
- ఉల్లాసం.

452
00:37:19,656 --> 00:37:22,910
నాకు కూడా నా చిన్నతనం గుర్తుంటే
బాగుంటుందని దీని వల్ల నాకు అనిపిస్తుంది.

453
00:37:22,993 --> 00:37:27,789
చురుకుదనం. సత్ప్రవర్తన. సమర్థత.

454
00:37:28,624 --> 00:37:33,962
ఎవరికైనా చరిత్ర లేకపోవడం అనేది
చాలా విచిత్రమైన పరిస్థితి.

455
00:37:34,463 --> 00:37:40,010
చరిత్ర మనకి ఒక గుర్తింపును ఇస్తుంది.
మనకి సందర్భాన్ని, రూపును ఇస్తుంది.

456
00:37:40,677 --> 00:37:44,932
కానీ ఆ బల్ల మీద లేచినప్పుడు,
నాకు అవన్నీ దూరమైపోయాయి.

457
00:37:47,017 --> 00:37:52,189
కానీ, నేను 1866 నుండి మానవజాతి
శ్రేయస్సు కోసం పాటుపడే సంస్థలో

458
00:37:52,272 --> 00:37:58,278
పని చేస్తున్నానని తెలుసుకున్నాను.

459
00:37:59,029 --> 00:38:00,113
చూడు.

460
00:38:00,197 --> 00:38:05,536
ఈ నవ్వులన్నీ బయటి వ్యక్తులకి చెందినవి.

461
00:38:06,245 --> 00:38:09,414
లూమన్ ఇండస్ట్రీస్ చేయూతని ఇచ్చినవారివి.

462
00:38:10,082 --> 00:38:12,417
ఈ నవ్వుల వీడియోలన్నీ ఎప్పటికప్పుడూ
తిరుగుతూనే ఉంటాయి.

463
00:38:12,501 --> 00:38:16,797
ఈ చిరునవ్వుల సంఖ్య కోట్లలో ఉంటుంది.

464
00:38:18,549 --> 00:38:20,342
అయితే మనది పళ్లకి సంబంధించిన సంస్థనా?

465
00:38:20,425 --> 00:38:21,552
కాదు.

466
00:38:21,635 --> 00:38:24,638
నీకు కూడా ఇప్పుడు చరిత్ర ఉందని
చెప్తున్నాను.

467
00:38:24,721 --> 00:38:27,266
- అది కూడా ఒక మంచి చరిత్ర.
- అందులో చాలా పరమార్థం ఉందని...

468
00:38:27,349 --> 00:38:28,433
ఈ నోళ్ల గోడను వాళ్లు
ఎప్పటికప్పుడు మారుస్తుంటారా?

469
00:38:28,934 --> 00:38:31,645
దీని పేరు "నోళ్ల గోడ" కాదు.

470
00:38:31,728 --> 00:38:33,647
ఓరి దేవుడా, నాకు ఇష్టమైన అమ్మాయి
నవ్వు కూడా ఇక్కడ ఉందే.

471
00:38:34,189 --> 00:38:36,275
- మనమిక బయలుదేరుదామా?
- ఇప్పుడే కదా మనం వచ్చింది.

472
00:38:38,193 --> 00:38:40,654
ఆమె కియర్ కి సంబంధించింది
ఇంకా చూడను కూడా లేదు.

473
00:38:44,867 --> 00:38:45,868
గెర్హార్ట్.

474
00:38:48,787 --> 00:38:51,790
సరదాకి లూమన్ ఇచ్చిన నిర్వచనం
కియర్ ఈగన్ ఇంటి ప్రతిరూపం

475
00:39:00,090 --> 00:39:02,718
- దేవుడా.
- కాదు, కియర్.

476
00:39:03,927 --> 00:39:04,970
ఇఫి అతని ఇల్లా?

477
00:39:05,053 --> 00:39:07,055
అచ్చుగుద్ధినట్టు అలాగే ఉండే రూపం.

478
00:39:07,139 --> 00:39:08,140
చాలా బాగుంది కదా?

479
00:39:09,266 --> 00:39:11,268
అవును, చాలా బాగుంది.

480
00:39:37,294 --> 00:39:40,047
కియర్ ఈగన్ మంచం మీద వాలవద్దు

481
00:39:40,130 --> 00:39:45,219
కియర్ యొక్క పడక గది, ఆయన
తదనంతరం అది నిజంగా ఇలాగే ఉండవచ్చు.

482
00:39:49,598 --> 00:39:50,974
ఈ పడక గది చాలా బాగుంది.

483
00:39:51,975 --> 00:39:55,687
నాకు ఈ చోటు నచ్చదు.
ఇది 19వ శతాబ్దపు గదిలా ఉంటుంది.

484
00:39:55,771 --> 00:39:59,274
ఇదేదో మందు పార్టీ అనుకోకుండా
మామూలుగా ప్రవర్తించండి.

485
00:39:59,358 --> 00:40:01,568
అలా అంటావేంటి. ఇప్పటిదాకా,
నేను చాలా పవిత్రంగా చూస్తూ వచ్చాను.

486
00:40:03,487 --> 00:40:04,488
- మార్క్.
- ఏంటి?

487
00:40:06,949 --> 00:40:10,744
నువ్వు... ఆ బెడ్ మీద కూర్చోబోతున్నావా?

488
00:40:10,827 --> 00:40:13,497
లేదు. ఆ? అస్సలు కాదు.

489
00:40:15,874 --> 00:40:18,752
నీ జేబులో ఏముంది, మార్క్? ఏముంది?

490
00:40:20,712 --> 00:40:21,713
నేను...

491
00:40:22,589 --> 00:40:26,218
అయ్య బాబోయ్, మార్క్. ఇప్పటికీనా?

492
00:40:27,845 --> 00:40:29,680
ఇది... కేవలం సరదాకే.

493
00:40:29,763 --> 00:40:31,265
ఇది పర్పెటువిటీ వింగ్.

494
00:40:31,974 --> 00:40:33,684
ఇది ఈగన్ల చరిత్ర.

495
00:40:33,767 --> 00:40:38,105
ఇది లూమన్ యొక్క అస్తిత్వం,
ఆ సంస్థ విలువలకు ప్రతిరూపం,

496
00:40:38,188 --> 00:40:39,565
అంతే కానీ బింగో ఆట కానే కాదు.

497
00:40:39,648 --> 00:40:43,277
చూడు, "మనస్సులో లాదకరమైన హాస్య చతురత
ఎప్పుడూ ఉండాలి," అని కియర్ అన్నాడు.

498
00:40:44,194 --> 00:40:45,863
ట్రయనీకి కూడా ఇదే ఒకటి ఇచ్చావా? చెప్పు.

499
00:40:47,447 --> 00:40:48,448
ఇచ్చే ఉంటావులే.

500
00:40:49,867 --> 00:40:52,035
ఆమె ఇక్కడ పరమార్థం తెలుసుకోవాలని
తహతహలాడుతోంది.

501
00:40:52,119 --> 00:40:54,705
కానీ నువ్వు మన వ్యవస్థాపకుని సందేశాన్ని
జోకులతో, అగౌరవంతో

502
00:40:54,788 --> 00:40:57,207
మలినం చేశావు.

503
00:40:57,291 --> 00:41:01,253
తన డిపార్టుమెంట్ చీఫ్ నుండి
ఆమె ఆశించేది ఇదేనా?

504
00:41:01,336 --> 00:41:03,172
హేయ్, నేనేమీ ఏరికోరి
డిపార్టుమెంట్ చీఫ్ కాలేదు.

505
00:41:03,255 --> 00:41:05,924
పీటీ చెప్పాపెట్టకుండా వెళ్లిపోవాలని
నేను కోరుకోలేదు, ఇక...

506
00:41:10,888 --> 00:41:11,889
హెల్లి?

507
00:41:13,724 --> 00:41:14,725
అబ్బా.

508
00:41:15,517 --> 00:41:16,518
హెల్లి?

509
00:41:17,269 --> 00:41:18,854
ఓరి నాయనా.

510
00:41:47,090 --> 00:41:48,091
హెల్లి!

511
00:41:52,596 --> 00:41:54,765
ఇది... అయ్యబాబోయ్.

512
00:42:15,869 --> 00:42:16,870
హెల్లి!

513
00:42:30,175 --> 00:42:31,385
హెల్లి!

514
00:42:36,640 --> 00:42:37,641
హెల్లి!

515
00:42:39,726 --> 00:42:40,686
ఇక్కడికి ఎప్పుడూ రావద్దు

516
00:42:40,769 --> 00:42:41,770
అయ్యో!

517
00:42:43,939 --> 00:42:45,816
ఏం చేస్తున్నావు, హెల్లి?

518
00:42:57,911 --> 00:42:59,663
దయచేసి ఇటువైపుకు రండి, హెల్లీ ఆర్.

519
00:43:03,876 --> 00:43:06,420
ప్రత్యేక అంతస్థు పరిమితి
అధికారమున్న వారికే ప్రవేశం

520
00:43:39,703 --> 00:43:40,704
లోపలికి పదండి.

521
00:44:14,947 --> 00:44:16,949
నిన్ను ఇక్కడ చూడాల్సి రావడం
నాకు చాలా బాధగా ఉంది, హెల్లి.

522
00:44:21,745 --> 00:44:22,746
ట్రిపుల్ యాంటిబయాటిక్
డిస్ ఇన్ఫెక్టెంట్

523
00:44:27,835 --> 00:44:29,503
నువ్వు సర్దుకుపోతావని భావించాను.

524
00:44:32,089 --> 00:44:35,342
నీకు సౌకర్యంగా ఉండేలా చేయడానికి
మార్క్ చాలా కష్టపడుతున్నాడని నాకు తెలుసు.

525
00:44:43,934 --> 00:44:48,772
నువ్వు తెలివైనవాడిలానే ఉన్నావు. ఇదంతా
ఎంత అస్తవ్యస్తంగా ఉందో నీకు తెలియట్లేదా?

526
00:44:49,273 --> 00:44:50,691
- ఇలా బందీగా...
- ఇప్పుడు ఆ చర్చ వద్దు, హెల్లి.

527
00:44:53,110 --> 00:44:55,237
కూర్చో. దయచేసి కూర్చో.

528
00:45:11,545 --> 00:45:13,088
చేతులను బల్ల మీద ఉంచు.

529
00:45:52,461 --> 00:45:54,963
నేను హెల్లి ఆర్ కోసం పశ్చాత్తాప ప్రకటనను
తెర మీదికి ప్రవేశపెడుతున్నాను.

530
00:46:01,553 --> 00:46:02,554
ఏంటిది?

531
00:46:06,225 --> 00:46:07,226
దాన్ని చదువు.

532
00:46:10,687 --> 00:46:11,688
నేను చదవను.

533
00:46:13,273 --> 00:46:15,275
కుదరదు. చదువు.

534
00:46:21,823 --> 00:46:25,369
"ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి
నన్ను క్షమించండి.

535
00:46:26,411 --> 00:46:29,831
నా చర్యలకు ఎవరైనా బాధపడాల్సి వస్తే,
అది నేనే పడాలి,

536
00:46:29,915 --> 00:46:32,626
వాటి దుష్పరిమాణాన్ని కూడా నేనే భరించాలి.

537
00:46:33,836 --> 00:46:36,505
నేను పట్టుబడినందుకు
ఆనందం వ్యక్తం చేస్తున్నాను,

538
00:46:36,588 --> 00:46:38,966
ఆ దైవ సంభూతుని చేతులే
నా పతనాన్ని అడ్డుకున్నాయి.

539
00:46:39,633 --> 00:46:41,760
అందుకు నేను చాలా తీవ్రంగా
చింతిస్తున్నాను."

540
00:46:45,889 --> 00:46:47,391
నువ్వు దాన్ని మనస్ఫూర్తిగా చెప్పలేదు.

541
00:46:49,351 --> 00:46:50,352
ఏంటి?

542
00:46:52,062 --> 00:46:53,230
మళ్లీ చెప్పు.

543
00:46:56,024 --> 00:46:58,694
"ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి
నన్ను క్షమించండి.

544
00:47:00,112 --> 00:47:02,990
నా చర్యలకు ఎవరైనా బాధపడాల్సి వస్తే,
అది నేనే పడాలి,

545
00:47:04,032 --> 00:47:07,327
వాటి దుష్పరిమాణాన్ని కూడా నేనే భరించాలి.

546
00:47:07,911 --> 00:47:09,955
నేను పట్టుబడినందుకు
ఆనందం వ్యక్తం చేస్తున్నాను,

547
00:47:10,539 --> 00:47:13,208
ఆ దైవ సంభూతుని చేతులే
నా పతనాన్ని అడ్డుకున్నాయి.

548
00:47:14,042 --> 00:47:16,879
అందుకు నేను చాలా తీవ్రంగా
చింతిస్తున్నాను."

549
00:47:23,260 --> 00:47:24,428
మళ్లీ ఇంకోసారి చెప్పు.

550
00:47:27,181 --> 00:47:28,182
ఓరి నాయనోయ్.

551
00:47:33,687 --> 00:47:34,688
ఇవాళ చాలా సరదాగా గడిచింది.

552
00:47:36,648 --> 00:47:37,649
మళ్లీ రేపు కలుద్దాం.

553
00:47:39,651 --> 00:47:40,652
అలాగే.

554
00:47:42,362 --> 00:47:43,614
లైటులన్నీ ఆపివేయనా?

555
00:47:44,907 --> 00:47:45,908
అలాగే.

556
00:49:05,571 --> 00:49:07,030
మనందరం అక్కడ లేము కనుక
మనం ఇక్కడ ఉన్నాం

557
00:49:07,114 --> 00:49:08,115
నరకానికి దారి అయిన... తీగ

558
00:49:08,198 --> 00:49:09,241
పర్పెటువిటీ వింగ్

559
00:49:09,324 --> 00:49:10,742
కొందరు ఇక్కడ ఉంటూ ఉండవచ్చు

560
00:49:30,137 --> 00:49:34,057
బ్రేక్ రూమ్

561
00:49:41,231 --> 00:49:44,109
మెదడు

562
00:50:02,169 --> 00:50:05,964
నా దగ్గర టోకెన్లు లేవు.
టోకెన్లు లేకుండా నేను తినలేను.

563
00:50:13,639 --> 00:50:14,640
హేయ్!

564
00:50:15,724 --> 00:50:17,434
నాకు తినడానికి టోకెన్లు కావాలి!

565
00:50:27,152 --> 00:50:28,028
అయ్య బాబోయ్.

566
00:51:00,602 --> 00:51:02,604
లూమన్

567
00:51:34,386 --> 00:51:35,387
పీటీ?

568
00:51:41,602 --> 00:51:42,603
పీటీ?

569
00:53:05,936 --> 00:53:07,354
సరే మరి. నిదానంగా రండి.

570
00:53:11,692 --> 00:53:13,652
ఆయన ఎటు వైపు నుండి వచ్చారో
మీరేమైనా గమనించారా?

571
00:53:15,737 --> 00:53:17,781
నేను వెళ్లి స్ట్రెచర్ తీసుకొని వెంటనే
వచ్చేస్తాను.

572
00:53:18,323 --> 00:53:19,616
ఇతను ఎవరో చూసి చెప్పగలవా?

573
00:53:23,245 --> 00:53:26,540
బాత్రూమ్ రోబ్ లో వచ్చాడంటే
ఇక్కడి వాడే అయ్యుంటాడు. అంతే తెలుస్తోంది.

574
00:53:38,594 --> 00:53:39,803
బాబోయ్. అతను కుప్పకూలిపోయాడు.

575
00:53:39,887 --> 00:53:42,014
సర్, సర్. నా మాటలు మీకు వినిపిస్తున్నాయా?

576
00:53:42,097 --> 00:53:43,682
తెచ్చారా? కాస్త వెనక్కి నిలబడండి.

577
00:53:43,765 --> 00:53:48,562
హా, డిస్పాచ్. 42వ రోడ్డులో
ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి ఉన్నాడు.

578
00:53:48,645 --> 00:53:49,897
దయచేసి వారిని పంపండి.

579
00:53:51,523 --> 00:53:53,692
- శ్వాస ఆడుతోందా?
- లేదు, బాసూ.

580
00:53:53,775 --> 00:53:55,110
సరే. గుండె ఎంత వేగంగా
కొట్టుకుంటోందో చెప్పు.

581
00:53:56,820 --> 00:53:59,239
- మీరు బాగానే ఉన్నారా?
- బండి ఎక్కించండి.

582
00:56:32,351 --> 00:56:34,353
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

