1
00:00:15,015 --> 00:00:17,643
"అందుకు నేను చాలా తీవ్రంగా చింతిస్తున్నాను".

2
00:00:17,726 --> 00:00:21,688
నేను పట్టుబడినందుకు
ఆనందం వ్యక్తం చేస్తున్నాను,

3
00:00:21,772 --> 00:00:26,109
ఆ దైవ సంభూతుని చేతులే
నా పతనాన్ని అడ్డుకున్నాయి.

4
00:00:26,193 --> 00:00:28,487
నన్ను క్షమించండి. నా చర్యలకు ఎవరైనా

5
00:00:51,218 --> 00:00:53,387
కానీ ఇప్పటికీ నువ్వు మనస్ఫూర్తిగా చెప్పట్లేదు.

6
00:01:17,870 --> 00:01:19,246
లూమన్

7
00:01:25,085 --> 00:01:26,712
మళ్లీ రేపు ఉదయం ప్రయత్నించి చూద్దాం.

8
00:02:06,668 --> 00:02:07,961
మళ్లీ రేపు కలుద్దాం, హెల్లి.

9
00:02:22,142 --> 00:02:23,435
నీ యెంకమ్మ.

10
00:02:28,524 --> 00:02:30,567
నిన్న నేను 300 సార్లు చదివాను.

11
00:02:31,985 --> 00:02:36,698
కాదు, 259 సార్లు చదివావు.
మళ్లీ చదువు. మొదలుపెట్టు.

12
00:02:40,160 --> 00:02:41,662
ఆ గొంతు ఎవరిది?

13
00:02:59,513 --> 00:03:03,183
"ఈ లోకానికి నేను తలపెట్టిన హానికి
నన్ను క్షమించండి.

14
00:03:05,102 --> 00:03:07,479
నా చర్యలకు ఎవరైనా బాధపడాల్సి వస్తే,
అది నేనే పడాలి."

15
00:03:15,153 --> 00:03:17,781
"వాటి దుష్పరిణామాన్ని కూడా నేనే భరించాలి."

16
00:03:30,294 --> 00:03:32,087
నేను నిజంగానే బాధపడుతున్నాను, అర్థమైందా?

17
00:03:35,174 --> 00:03:36,341
నన్ను క్షమించండి.

18
00:03:38,594 --> 00:03:41,597
అక్కడ ఏం ఉందో అదే చెప్పాలి. మళ్లీ చెప్పు.

19
00:05:30,372 --> 00:05:34,126
మిస్డ్ కాల్స్ జాబితా
బ్లాక్ చేయబడినది

20
00:06:00,652 --> 00:06:03,697
క్యాంపింగ్ సామాగ్రి

21
00:06:28,388 --> 00:06:30,474
మెదడు - సంరక్షణా కేంద్రం - ఎండిఆర్
బ్రేక్ రూమ్ - ఓ&డీ? - పర్పెటువిటీ వింగ్

22
00:06:30,557 --> 00:06:31,975
మనందరం అక్కడ లేము కనుక
మనం ఇక్కడ ఉన్నాం

23
00:06:35,562 --> 00:06:36,563
- మార్క్?
- ఏంటి?

24
00:06:36,647 --> 00:06:41,276
సమయం 11 గంటలు దాటింది, హెల్లీ
నిన్నటి నుండి బ్రేక్ రూమ్ లోనే ఉంది.

25
00:06:41,360 --> 00:06:43,737
- అయితే?
- నువ్వు డిపార్టుమెంట్ చీఫ్ వి కాబట్టి

26
00:06:43,820 --> 00:06:46,406
తన పరిస్థితి ఏంటో చూడవలసిన బాధ్యత నీకు
ఉందని నాకు అనిపిస్తోంది, ఏమంటావు?

27
00:06:46,490 --> 00:06:47,950
- అంటే...
- మార్క్ కి ఆ అధికారం లేదు.

28
00:06:48,033 --> 00:06:49,743
- అడగడంలో తప్పు లేదు కదా.
- కానీ అతను అడగడు కదా.

29
00:06:49,826 --> 00:06:50,827
- అడగవచ్చేమో.
- సరే...

30
00:06:50,911 --> 00:06:52,329
హాయ్.

31
00:06:55,249 --> 00:06:57,167
మధ్యలో వచ్చినందుకు మన్నించాలి.

32
00:06:58,293 --> 00:07:02,130
మనం మొన్న కలిశాం.
నేను ఆప్టిక్స్ అండ్ డిజైన్ లో పని చేసే బర్ట్ ని.

33
00:07:02,214 --> 00:07:05,884
- హాయ్, అర్వింగ్.
- హాయ్, బర్ట్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?

34
00:07:05,968 --> 00:07:07,219
అసలు ఈ ఆఫీసు ఇక్కడ ఉందని

35
00:07:07,302 --> 00:07:08,387
- నీకెలా తెలిసింది?
- డిలన్!

36
00:07:08,470 --> 00:07:12,641
నాకు ముందు పని చేసిన ఆలిస్ కే, ఇక్కడికి,
శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించిన సమయాల్లో వచ్చేది,

37
00:07:12,724 --> 00:07:15,018
- తను దిశలను ఇచ్చి వెళ్లేది.
- వాటిని రివర్స్ లో ఇచ్చి వెళ్లు.

38
00:07:15,102 --> 00:07:16,228
సరే. మరేమీ పర్లేదు.

39
00:07:16,311 --> 00:07:17,771
మీకేం కావాలి, బర్ట్?

40
00:07:17,855 --> 00:07:19,064
థ్యాంక్యూ. అంటే...

41
00:07:19,857 --> 00:07:21,859
చిన్న పుస్తకాల బ్యాగులు ఎప్పుడెప్పుడు
అందుతాయా అని

42
00:07:21,942 --> 00:07:25,445
మీరు ఎదురుచూస్తున్నారని చెప్పారు కదా,
నేను దాని గురించి చాలా ఆలోచించాను,

43
00:07:25,529 --> 00:07:27,489
మీరు తమాషాగా ఆటపటిద్దామనే అలా అని ఉండవచ్చు.

44
00:07:27,573 --> 00:07:29,366
లేదు, నేను నిజంగానే అన్నాను.

45
00:07:29,449 --> 00:07:32,703
సరే, మంచిది. ఏదేమైనా నేను చాలా ఆలోచించాను,
ఎందుకంటే, అలా ఎదురు చూడటం వలన

46
00:07:32,786 --> 00:07:36,039
పని మీద ఏకాగ్రత తగ్గవచ్చు అని మీరు అన్నారు,

47
00:07:36,123 --> 00:07:37,708
కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు.

48
00:07:37,791 --> 00:07:40,961
కాబట్టి, వాళ్లకి ఆ బ్యాగులు ఇప్పుడే
ఇచ్చేస్తే పోలా అని అనిపించింది.

49
00:07:41,044 --> 00:07:43,505
అలా చేయడం ద్వారా ఇక మీరు దాని గురించి
ఆలోచించరని భావించాను.

50
00:07:43,589 --> 00:07:48,594
మా కోసం ఇంకా విడుదల చేయని బ్యాగులను తెచ్చారా?

51
00:07:48,677 --> 00:07:51,638
అదే సరైన పనని నాకు అనిపించింది.
మీ సమయం చాలా విలువైనదని నాకు తెలుసు.

52
00:07:51,722 --> 00:07:54,892
సరే, వాటిని బల్ల మీద పెట్టేసి,
వెనక్కి చూడకుండా ఓ&డీకి దొబ్బేయ్.

53
00:07:55,601 --> 00:07:56,685
సరే.

54
00:07:56,768 --> 00:07:59,563
అలాగే నేను మీకు ఆహ్వానం అందిస్తున్నాను.

55
00:07:59,646 --> 00:08:02,316
మీరు... చాలా కష్టపడి పని చేయాల్సి
ఉంటుందని నాకు తెలుసు, కాబట్టి...

56
00:08:02,983 --> 00:08:06,904
కాస్తంత సేద తీరుదామని మీకు ఓ&డీకి
రావాలని అనిపిస్తే,

57
00:08:06,987 --> 00:08:10,991
నేను అర్వింగ్ కి కానీ, అలాగే మీకు కానీ
దగ్గర ఉండి మొత్తం చూపిస్తాను.

58
00:08:11,783 --> 00:08:14,494
దిశలన్నీ ముందు ఉన్న బ్యాగులో,
రివర్స్ లో అందించబడి ఉన్నాయి.

59
00:08:14,578 --> 00:08:15,662
నేను చచ్చినా రాను.

60
00:08:18,540 --> 00:08:19,625
సరే.

61
00:08:21,001 --> 00:08:22,711
థ్యాంక్యూ, బర్ట్.

62
00:08:23,837 --> 00:08:24,838
థ్యాంక్యూ.

63
00:08:32,513 --> 00:08:35,599
అలా పిలిచాడో లేదో అప్పుడే వెళ్లిపోతున్నావేంటి?

64
00:08:35,682 --> 00:08:38,644
మనం ఇప్పటి దాకా వారి డిపార్టుమెంటుకు
వెళ్లలేదంటేనే చాలా విచిత్రంగా ఉంది.

65
00:08:39,144 --> 00:08:43,565
మనందరం కలిసి పని చేయాలన్నదే
కియర్ అసలు లక్ష్యం.

66
00:08:43,649 --> 00:08:46,818
అది ఓ&డీ మిగతా వారందరినీ
చంపక ముందు మాట.

67
00:08:46,902 --> 00:08:49,238
అదంతా ఒట్టి అబద్ధం.
నేను ఒంటి గంటకల్లా వచ్చేస్తా.

68
00:08:50,948 --> 00:08:51,990
అతనికి చావు తప్పదు.

69
00:08:54,076 --> 00:08:55,077
అర్వ్...

70
00:09:04,169 --> 00:09:05,295
ఎన్నిసార్లు చెప్పావు?

71
00:09:08,507 --> 00:09:10,384
మొత్తం 1,072 సార్లు.

72
00:09:28,777 --> 00:09:30,487
ఓ&డీ
ఎండిఆర్

73
00:09:40,330 --> 00:09:41,915
తలుపు వెనుక నుండి
ఒక గొంతు వినిపించింది, ఏంటది?

74
00:09:42,541 --> 00:09:43,667
ఏడుస్తున్న పసిబిడ్డ గొంతేనా?

75
00:09:43,750 --> 00:09:44,877
లూమన్
పీనట్స్

76
00:09:44,960 --> 00:09:47,838
కాదు. ఎవరో ఒక వ్యక్తి కోపంతో
గొణుగుతున్నట్టు అనిపించింది.

77
00:09:47,921 --> 00:09:51,675
మిత్రులారా? మనం బ్రేక్ రూమ్ లో
జరిగిన వాటిని బయట మాట్లాడుకోకూడదు.

78
00:09:52,217 --> 00:09:53,927
ముఖ్యమైన విషయం ఏంటంటే,

79
00:09:54,011 --> 00:09:56,889
నువ్వు సరైన విధంగా క్షమాపణలు చెప్పావు,
కాబట్టి బయటకు వచ్చేశావు.

80
00:09:57,931 --> 00:09:59,433
నీకు ఒక ట్రిక్ చెప్తాను విను,
మనం నిజంగానే బాధపడే

81
00:09:59,516 --> 00:10:01,560
ఒక విషయాన్ని తలుచుకొని చెప్పాలి,
అప్పుడు మెషిన్ నమ్ముతుంది,

82
00:10:01,643 --> 00:10:05,439
కాబట్టి నా పనియేతర అవతారం బయట ఒక మహిళతోనో,
ఇద్దరితోనో సెక్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటా,

83
00:10:05,522 --> 00:10:08,609
అది చాలా గొప్ప పనే, కానీ
నాకు వాళ్ల భర్తల విషయంలో బాధ అనిపిస్తుంది.

84
00:10:29,630 --> 00:10:30,714
హేయ్.

85
00:10:32,257 --> 00:10:33,759
బ్రేక్ రూమ్ ఘోరంగా ఉంటుంది.

86
00:10:33,842 --> 00:10:38,180
అక్కడికి మనం వెళ్లకూడదనే మనకు
ఇన్ని విధానాలూ, పద్ధతులూ ఉంటాయి.

87
00:10:39,181 --> 00:10:40,933
నేను చెప్తున్నా కదా, నువ్వు తెలుసుకుంటావు.

88
00:10:54,029 --> 00:10:55,030
హలో?

89
00:10:56,907 --> 00:10:58,200
ఎవరు?

90
00:10:58,283 --> 00:10:59,493
హాయ్.

91
00:11:00,077 --> 00:11:03,830
నేను మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ లో
పని చేసే అర్వింగ్ బీని.

92
00:11:03,914 --> 00:11:05,999
మొన్న మనం హాలులో కలుసుకున్నాం కదా.

93
00:11:09,253 --> 00:11:11,338
బర్ట్ ఆరవ అర దగ్గర ఉన్నాడు.

94
00:11:12,297 --> 00:11:13,757
దేన్నీ తాకవద్దు.

95
00:11:16,885 --> 00:11:20,722
పెద్ద బ్యాగులు, అపెండిక్స్
లేటెస్ట్ ఎడిషన్స్ ని మోయగలవు.

96
00:11:20,806 --> 00:11:26,311
కానీ, మేము హాలువేలోని
పెయింటింగ్ లన్నింటినీ పంపించేస్తాము.

97
00:11:28,730 --> 00:11:30,065
గుర్తుపెట్టుకోవలసినవి చాలానే ఉన్నాయి.

98
00:11:31,775 --> 00:11:33,443
నేనూ, ఫెలీషియా మేనేజ్ చేసుకుంటున్నాం.

99
00:11:34,027 --> 00:11:38,740
రోజంతా మీ ఎండిఆర్ చేసే దానితో
పోల్చితే ఇది పెద్ద విషయమేమీ కాదులే.

100
00:11:39,658 --> 00:11:43,287
కొత్త కళాకృతి వచ్చినప్పుడు ఎలా
ఉంటుందా అని నేను ఊహించుకోగలను అంతే.

101
00:11:43,370 --> 00:11:45,581
అంటే, అందరి కన్నా ముందు
దాన్ని చూసేది మీరే కదా.

102
00:11:46,540 --> 00:11:51,086
చెప్తే నవ్వుకుంటారు కానీ,

103
00:11:51,170 --> 00:11:54,047
మీరు "కియర్ యవ్వనంలో ఉండగా కోలుకోవడం"
పెయింటింగ్ ని పెట్టినప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది.

104
00:11:54,131 --> 00:11:55,632
- అవునా?
- నిజమే.

105
00:11:55,716 --> 00:11:59,386
హ్యాండ్ బుక్ లో ఉన్న దాన్ని అంత ఖచ్చితంగా
చూసే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం.

106
00:11:59,469 --> 00:12:05,851
కానీ అది సుమారుగా ఒక నెలకే పెట్టారు, కానీ దేవుడా,
ఆ నెలంతా నాకు ఆనందంగా అనిపించింది.

107
00:12:11,523 --> 00:12:12,524
ఇలా రండి.

108
00:12:14,276 --> 00:12:18,989
ఏదైనా పెయింటింగ్
అన్ని డిపార్టుమెంటులలో ప్రదర్శించబడ్డాక

109
00:12:19,072 --> 00:12:21,283
అది ఇక్కడికి వచ్చి చేరుతుంది.

110
00:12:21,366 --> 00:12:22,367
వావ్!

111
00:12:25,996 --> 00:12:27,497
ఫెలీషియా ఎక్కడికి వెళ్లింది?

112
00:12:27,581 --> 00:12:28,582
సరుకులను తీసుకురావడానికి.

113
00:12:32,586 --> 00:12:33,587
ఇది చూడండి.

114
00:12:39,593 --> 00:12:41,720
"మీ నరాల్లో బలహీనతకు చోటు ఇవ్వవద్దు.

115
00:12:42,304 --> 00:12:44,890
మంచి ఉద్యోగులు, దాన్ని జయిస్తారు."

116
00:12:45,390 --> 00:12:48,435
"మరణం అంచుల నుండి లేచి
ముందుకు సాగండి,

117
00:12:48,977 --> 00:12:53,190
ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోగలరు."

118
00:12:54,441 --> 00:12:55,442
ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు.

119
00:12:55,984 --> 00:12:56,985
నేను...

120
00:12:58,111 --> 00:12:59,363
మీ దగ్గర ఇది ఉందంటే...

121
00:13:01,031 --> 00:13:02,282
నేను అస్సలు నమ్మలేకపోతున్నాను.

122
00:13:17,714 --> 00:13:20,217
క్షమించాలి. సమయం ఎంత అయింది?

123
00:13:20,843 --> 00:13:21,844
నేను బయలుదేరాలి.

124
00:13:38,944 --> 00:13:40,320
హేయ్, హెల్లీ.

125
00:13:41,238 --> 00:13:43,323
- నాకు 4% వచ్చింది.
- సూపర్!

126
00:13:43,407 --> 00:13:44,491
చాలా ఆనందంగా ఉంది, కదా?

127
00:13:46,159 --> 00:13:48,745
- అవుననే అనుకుంటా.
- మంచిది. నువ్వు అంగీకరించినందుకు ఆనందంగా ఉంది.

128
00:13:52,291 --> 00:13:53,292
మంచి పనితీరును కనబర్చావు.

129
00:15:02,569 --> 00:15:04,488
నువ్వు అనబడే నువ్వు
నీ ఆధ్యాత్మిక ఆత్మకథ

130
00:15:04,571 --> 00:15:05,697
డాక్టర్ రికెన్ లాజ్లో హేల్, పీహెచ్డీ

131
00:15:21,213 --> 00:15:22,631
కొందరు ఇక్కడ ఉంటూ ఉండవచ్చు

132
00:15:25,968 --> 00:15:26,969
ఏంటి ఇది?

133
00:15:27,761 --> 00:15:29,179
దాన్ని ఎవరికీ కనబడకుండా దాచిపెడతావా?

134
00:15:31,014 --> 00:15:33,225
- దేన్ని దాచిపెట్టాలి?
- ఇది హాల్ వేస్ మ్యాప్.

135
00:15:33,308 --> 00:15:34,726
కాదు.

136
00:15:34,810 --> 00:15:36,854
మనం మ్యాప్స్ చేయకూడదు కదా.

137
00:15:37,604 --> 00:15:39,815
అవును. నేను చేయలేదు కూడా.
నాకు అది దొరికింది.

138
00:15:39,898 --> 00:15:40,899
దాన్ని పీటీ చేశాడు అనుకుంటా.

139
00:15:40,983 --> 00:15:42,776
బాబోయ్. నువ్వు దీని గురించి పైవారికి చెప్పలేదా?

140
00:15:44,194 --> 00:15:45,529
నాకేమీ నియమాలను అనుసరించాలని శ్రీరంగ నీతులు చెప్పి,

141
00:15:45,612 --> 00:15:47,656
నువ్వేమో ఇలాంటివి చేస్తున్నావా?

142
00:15:47,739 --> 00:15:50,450
నేనేమీ నీకు నీతులు చెప్పలేదు. నువ్వు
బ్రేక్ రూమ్ లోకి వెళ్లకూడదనే నా ప్రయత్నమంతా.

143
00:15:50,534 --> 00:15:52,578
పీటీ మ్యాప్ గీశాడంటే ఆశ్చర్యంగా ఉంది.
ఇలా ఇవ్వవా, నేను చూస్తాను.

144
00:15:53,370 --> 00:15:58,542
సంరక్షణా కేంద్రం, మేనేజ్మెంట్, పర్పెటువిటీ వింగ్...
మనకి తెలిసినవన్నీ ఉన్నాయి.

145
00:15:58,625 --> 00:16:00,210
దీన్ని తయారు చేయడానికి
అతనికి చాలా వారాలు పట్టి ఉంటుంది.

146
00:16:00,294 --> 00:16:01,962
ఆఫీసును మ్యాప్ రూపంలో ఎందుకు గీయకూడదు?

147
00:16:02,045 --> 00:16:05,382
అది ఈగన్ నియమం. "నా సృష్టికి
సూక్ష్మరూపం ఇవ్వవద్దు."

148
00:16:05,465 --> 00:16:06,466
ఎందుకని?

149
00:16:07,384 --> 00:16:08,886
ఇదేంటి?

150
00:16:08,969 --> 00:16:11,305
ఇవి ఇళ్లలానే ఉన్నాయి, కదా?
ఇళ్లు అలాగే ఉంటాయి.

151
00:16:11,388 --> 00:16:14,933
అవును, అలానే ఉంటాయి, ఎందుకంటే
పీటీకి ఏమీ తోచనప్పుడు వాటిని గీశాడు కాబట్టి.

152
00:16:15,017 --> 00:16:17,769
అవి బయట ఉన్నాయేమో, అక్కడికి
చేరుకోవడానికి పీటీ ఏదైనా దారిని కనిపెట్టాడేమో.

153
00:16:17,853 --> 00:16:20,314
అయితే, అవి ప్రత్యేకమైన అంతస్థు మ్యాపులో
ఎందుకు ఉంటాయి?

154
00:16:20,397 --> 00:16:21,899
అది నిజమే అయ్యుండవచ్చు.
ఖచ్చితంగా నీకు తెలీదు కదా.

155
00:16:21,982 --> 00:16:23,150
అదేమీ నిజం కాదు.

156
00:16:23,233 --> 00:16:25,110
అతను నీకు ఏదో చెప్పాలని
చూస్తున్నాడన్నమాట మాత్రం నిజం.

157
00:16:25,194 --> 00:16:26,445
అలాంటిదేమీ లేదు.

158
00:16:26,945 --> 00:16:28,655
వెళ్లి వాళ్ల చంక నాకు పో, మార్క్.

159
00:16:30,032 --> 00:16:32,201
నీ స్నేహితుని కన్నా నువ్వు ఈ ఆఫీసుకే
ఎక్కువ విలువ ఇస్తున్నావు.

160
00:16:32,868 --> 00:16:36,705
నువ్వు రాకముందు ఈ చోటు ఎలా ఉండేదో,
దానికి నేను విలువ ఇస్తున్నాను.

161
00:16:36,788 --> 00:16:38,040
అంటే, పీటీ ఉన్నప్పుడా?

162
00:16:38,123 --> 00:16:40,083
అవును, అప్పుడు అంతా సమతుల్యతతో ఉండేది.

163
00:16:40,167 --> 00:16:44,755
అప్పుడు పనితో పాటు సరదా కూడా ఉండేది,
కానీ ఇప్పుడైతే ఏదోకటి నెత్తి మీదకి వస్తూనే ఉండి.

164
00:16:44,838 --> 00:16:46,298
మనం అర్థంపర్థం లేని పని చేస్తున్నాను.

165
00:16:46,381 --> 00:16:49,635
పని రహస్యమైనది, అలాగే ముఖ్యమైనది.

166
00:16:49,718 --> 00:16:52,721
కియర్ ఏ విధంగా అయితే కోరుకున్నాడో,
అదే విధంగా, దాని ద్వారా వచ్చే అనిశ్చితితో

167
00:16:52,804 --> 00:16:55,432
మనం వ్యవహరిస్తాం.

168
00:16:56,391 --> 00:16:59,019
అందరం కలిసి ఒక కుటుంబంలాగా.

169
00:17:00,521 --> 00:17:04,107
నువ్వు నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా

170
00:17:04,733 --> 00:17:07,277
నీ కుటుంబంలో నేను భాగం కాను.

171
00:17:13,242 --> 00:17:16,744
నీ ప్రాణ స్నేహితుడు నీ కోసం దీన్ని పెట్టి
వెళ్లిపోయాడు, నువ్వేమో అస్సలు లెక్కే చేయట్లేదు.

172
00:17:34,263 --> 00:17:36,682
నువ్వన్నది నిజమే. నేను లెక్క చేయను.

173
00:17:36,765 --> 00:17:37,766
మార్క్...

174
00:17:41,478 --> 00:17:45,649
అదుగో. ముక్కలు ముక్కలైపోయింది. థ్యాంక్యూ, హెల్లీ.
ఇక మనం తిరిగి పని మొదలుపెట్టవచ్చు.

175
00:17:50,904 --> 00:17:51,905
మార్క్!

176
00:17:54,533 --> 00:17:55,993
ఒక అత్యవసరమైన విషయం.

177
00:17:58,287 --> 00:17:59,496
సరే. ఇది...

178
00:17:59,580 --> 00:18:00,831
నేను మిస్టర్ మిల్చెక్ కి చెప్దామనుకున్నాను,

179
00:18:00,914 --> 00:18:03,041
కానీ నా పైఅధికారిగా ఇది నువ్వే
చెప్పాల్సిన విషయమని గ్రహించాను.

180
00:18:03,125 --> 00:18:05,502
ఇవాళ ఒకటి తర్వాత ఇంకొకటి
ఏదోకటి జరుగుతూనే ఉంది.

181
00:18:05,586 --> 00:18:07,087
- ఏమంటున్నావు నువ్వు?
- అదంతా ఇప్పుడు అనవసరం.

182
00:18:07,629 --> 00:18:10,340
ఇలాంటిదాన్ని ఇంతకు ముందు ఎవరైనా చూశారా?

183
00:18:10,424 --> 00:18:12,092
ముప్పై ఒకటవ పేరా, 110వ పేజీ.

184
00:18:12,176 --> 00:18:17,931
"నా వాక్కును నమ్మండి, అల్పులు చెప్పిన వాటిని
తెలుసుకోవాలని సమయం వృధా చేసుకోవద్దు."

185
00:18:18,015 --> 00:18:19,933
హ్యాండ్ బుక్ తప్ప ఇంకో పుస్తకం
చదవకూడదు. నాకు తెలుసు.

186
00:18:22,561 --> 00:18:23,604
ఏం చేస్తున్నావు?

187
00:18:23,687 --> 00:18:25,814
వాళ్ల చంక నాకుతున్నాడని హెల్లీ అన్నది,
దానితో మనోడు చాలా కోపంగా ఉన్నాడు.

188
00:18:25,898 --> 00:18:29,193
- నేను మామూలుగానే ఉన్నా. నా ప్రయత్నమంతా...
- దేవుడా.

189
00:18:29,276 --> 00:18:30,444
మెదడునే చిత్రపటంగా
మలచిన మార్క్ కి అంకితం.

190
00:18:30,527 --> 00:18:31,862
మార్క్, ఏంటి ఇది?

191
00:18:31,945 --> 00:18:34,865
బహుశా ఇది పీటీ పెట్టి వెళ్లిన మరో సందేశమేమో.
పేజీలు తిప్పి నా పేరు కనిపిస్తుందేమో చూడు.

192
00:18:35,657 --> 00:18:37,451
ఇది విధేయతకు పరీక్ష అయ్యుంటుంది.

193
00:18:38,368 --> 00:18:39,786
కారంగా ఉండే చాక్లెట్ గుర్తు ఉందా?

194
00:18:39,870 --> 00:18:41,330
నేను దీన్ని మిల్చెక్ కి ఇస్తాను.

195
00:18:41,413 --> 00:18:44,291
ఏంటి? ఎందుకు? ఇది చాలా విలువైనది.
అందులోనూ దీనిపై నీ పేరు ఉంది.

196
00:18:44,374 --> 00:18:45,501
మంచి నిర్ణయం తీసుకున్నావు, మార్క్.

197
00:18:45,584 --> 00:18:48,629
కియర్ రాయనిది ఏదైనా కానీ అతనికి ఇచ్చేయాలి.

198
00:19:15,072 --> 00:19:17,449
వాళ్ళ డిపార్టుమెంట్ ఎలా ఉంది?
అగ్ని గోళాలూ, మంటలతో నరకంలా ఉందా?

199
00:19:17,533 --> 00:19:20,827
లేదు, బాగానే ఉంది. బర్ట్
అందరికీ నచ్చేలా దాన్ని తీర్చిదిద్దాడు.

200
00:19:20,911 --> 00:19:23,497
లూమన్ సూత్రాలను ఆయన అర్థం చేసుకుంటాడు.

201
00:19:25,040 --> 00:19:26,041
హెల్లి?

202
00:19:28,377 --> 00:19:29,419
ఆగు! హెల్లి!

203
00:19:29,503 --> 00:19:30,629
ఏంటిది, హెల్లి?

204
00:19:30,712 --> 00:19:31,964
నాకు ఒక కెమెరా కావాలి.

205
00:19:32,047 --> 00:19:35,384
- మన్నించాలి, మిస్ కొబెల్. నేను...
- ఇక్కడ ఏం జరుగుతోంది?

206
00:19:35,467 --> 00:19:38,303
ఏం జరుగుతుందంటే,
మీరు నాకు ఒక వీడియో కెమెరాని ఇస్తారు,

207
00:19:38,387 --> 00:19:43,100
దానితో నా పనియేతర అవతారానికి నేనొక
వీడియోని తీసి పంపుతాను,

208
00:19:43,183 --> 00:19:46,478
లేదా నా నాలుగు వేళ్లు ఏమైపోయాయి అనేదాని
గురించి మీరు తనకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.

209
00:19:46,562 --> 00:19:49,523
సరే. కాస్తంత...

210
00:19:50,107 --> 00:19:51,942
మీ పేరు కొబెల్ కదా?

211
00:19:52,526 --> 00:19:53,527
అవును.

212
00:19:54,528 --> 00:19:58,574
కొబెల్, ఇప్పుడు నేనేదో తమాషా చేస్తున్నట్టు
మీకు అనిపిస్తోందా?

213
00:19:58,657 --> 00:20:01,702
లేదు. అలా అనిపించట్లేదు.

214
00:20:01,785 --> 00:20:02,786
హెల్లి!

215
00:20:04,204 --> 00:20:08,709
హాయ్, మార్క్. నీ ట్రయినీతో మాట్లాడుతున్నాను.

216
00:20:11,795 --> 00:20:13,422
మిస్టర్ మిల్చెక్,

217
00:20:14,339 --> 00:20:16,758
వెళ్లి వీడియో కెమెరా తీసుకురాగలవా?

218
00:20:42,826 --> 00:20:44,119
హేయ్.

219
00:21:16,818 --> 00:21:21,240
సరే మరి, బాస్. ఇక నీకు నీ చావు నీది
అని చెప్పాల్సిన సమయం వచ్చింది.

220
00:21:23,075 --> 00:21:24,493
ఇక్కడ ఉన్నావు కాబట్టి అది ఎలాగూ తప్పదుగా.

221
00:21:33,168 --> 00:21:34,461
నేనేమీ బాధపడట్లేదు.

222
00:21:56,650 --> 00:21:57,943
హెల్లి,

223
00:21:58,944 --> 00:22:01,822
నేను రాజీనామా చేయాలని
నువ్వు కోరిన వీడియోను నేను చూశాను.

224
00:22:02,406 --> 00:22:06,034
ఇంతకు ముందు నువ్వు పంపిన అభ్యర్థనను
కూడా నేను చూసి ప్రతిస్పందించాను.

225
00:22:06,577 --> 00:22:08,120
దానితోనే సమస్య పరిష్కారమవుతుందని భావించాను,

226
00:22:08,203 --> 00:22:13,417
కానీ నువ్వు నీ వేళ్లను కోసేసుకుంటావని
బెదిరించావని మిస్ కొబెల్ చెప్పారు.

227
00:22:17,921 --> 00:22:22,676
నీకు అక్కడి జీవితంపై అసంతృప్తిగా
ఉందని నేను అర్థం చేసుకోగలను.

228
00:22:24,011 --> 00:22:27,014
కానీ ఒకటి చెప్పనా? నువ్వు ఎప్పటికైనా
వాస్తవాన్ని గ్రహిస్తావు.

229
00:22:28,056 --> 00:22:31,059
కాబట్టి, కరాఖండిగా ఓ విషయం చెప్తున్నాను.

230
00:22:33,520 --> 00:22:35,272
నేను ఒక వ్యక్తిని.

231
00:22:36,982 --> 00:22:38,358
కానీ నువ్వు కాదు.

232
00:22:40,068 --> 00:22:41,862
నిర్ణయాలను నేను తీసుకుంటాను.

233
00:22:43,280 --> 00:22:44,573
నువ్వు కాదు.

234
00:22:45,657 --> 00:22:49,494
నా వేళ్లకు నువ్వు ఏమైనా చేశావనుకో,

235
00:22:50,078 --> 00:22:53,540
ఎందుకు ఆ పని చేశానని బాధపడేలా
నీకు జీవితాంతం నరకం చూపిస్తాను.

236
00:22:56,251 --> 00:22:58,462
నీ రాజీనామా అభ్యర్థనను తిరస్కరిస్తున్నాను.

237
00:22:59,671 --> 00:23:00,672
ఇక ఆపేయండి.

238
00:23:17,689 --> 00:23:21,527
"ప్రకృతి నడిమధ్యన ఉన్న
ప్రపంచంలోకి మీ కొడుకును ఆహ్వానించండి."

239
00:23:22,236 --> 00:23:23,529
వద్దులే.

240
00:23:25,072 --> 00:23:29,618
"పిల్లలను కనడానికి అనువుగా ఉండే మా గ్రామీణ
పూరిళ్ళ గురించి తెలుసుకోవడానికి కిందికి స్క్రోల్ చేయండి."

241
00:23:31,245 --> 00:23:32,287
అంతా అయోమయంగా ఉంది. ఇది కేవలం...

242
00:23:33,080 --> 00:23:38,418
పిల్లలను కనే ప్రదేశంలా కాకుండా ఇది నాకు
ఒక చెత్త స్కీయింగ్ కేంద్రంగా అనిపిస్తోంది, కానీ...

243
00:23:38,961 --> 00:23:40,003
సరే, అలాగేలే.

244
00:23:40,087 --> 00:23:42,297
కానీ అది చాలా బాగుంటుంది.
నీకు కూడా నచ్చుతుంది.

245
00:23:42,381 --> 00:23:46,176
ఇది రికెన్ ఐడియానే కదా, నిజం చెప్పు.

246
00:23:46,260 --> 00:23:47,469
ఇక...

247
00:23:47,553 --> 00:23:50,556
నీ చిరాకును కాస్త పక్కకు పెట్టు లేదా
నువ్వు మావయ్య అనిపించుకోలేవు చెప్తున్నా.

248
00:23:50,639 --> 00:23:54,643
ఒకటి చెప్పబా? నాకు కాస్త చిరాగ్గా
ఉన్నట్టుంది. బాగా అలసటగా ఉంది.

249
00:23:54,726 --> 00:23:56,937
- రేపు కాల్ చేయనా?
- అలాగే, బై.

250
00:24:09,324 --> 00:24:10,576
కియర్ క్రానికల్
స్థానిక వార్తల అలర్ట్

251
00:24:10,659 --> 00:24:16,373
"ఏదో తెలియని వ్యాధి" కారణంగా వేర్పాటు పద్ధతిని
జరిపించుకొన్న లూమన్ ఉద్యోగి మరణించాడు

252
00:24:56,496 --> 00:24:58,123
బోర్డు వాళ్లు ఏమైనా సంప్రదించారా?

253
00:25:01,335 --> 00:25:02,669
లేదు.

254
00:25:03,754 --> 00:25:06,465
కిల్మర్ మరణానికి నువ్వు కారణం కాదు,
నేను కూడా కాదు.

255
00:25:06,548 --> 00:25:07,841
వాళ్లు అర్థం చేసుకుంటారు.

256
00:25:12,846 --> 00:25:14,431
అందులో నీ తప్పేమీ లేదు, హార్మనీ.

257
00:25:17,267 --> 00:25:20,604
నీకు ఆత్మీయంగా కౌగిలించుకోవాలనుంటే,
ఇక్కడి నుండి బయటకు దొబ్బేయ్.

258
00:25:20,687 --> 00:25:21,772
బాబోయ్.

259
00:25:21,855 --> 00:25:23,023
పీటర్ ఏకీకరణ జరిపించుకున్నాడు కనుక...

260
00:25:23,106 --> 00:25:25,108
ఏకీకరణను బోర్డు ఇప్పటిదాకా అంగీకరించనే లేదు.

261
00:25:25,192 --> 00:25:27,945
మనం అతడి చిప్ ని దక్కించుకోవాలి.

262
00:25:30,739 --> 00:25:33,784
ఆదివారం అతని అంత్యక్రియలు ఉన్నాయి,

263
00:25:33,867 --> 00:25:35,953
అప్పుడు అతని దేహాన్ని ఖననం చేస్తారు.

264
00:25:36,745 --> 00:25:37,829
నీకు పనికి వస్తుందేమోనని చెప్తున్నా.

265
00:25:55,055 --> 00:25:56,056
దార్శనికత.

266
00:25:57,140 --> 00:25:58,225
జోష్.

267
00:25:59,309 --> 00:26:00,310
తెలివి.

268
00:26:01,562 --> 00:26:02,771
ఉల్లాసం.

269
00:26:03,814 --> 00:26:04,982
నమ్రత.

270
00:26:05,774 --> 00:26:07,401
మంచితనం.

271
00:26:07,985 --> 00:26:09,778
చురుకుదనం.

272
00:26:11,905 --> 00:26:13,115
సత్ప్రవర్తన.

273
00:26:14,324 --> 00:26:15,909
సమర్థత.

274
00:26:18,203 --> 00:26:19,580
సమర్థత.

275
00:26:51,778 --> 00:26:52,905
మార్క్.

276
00:26:52,988 --> 00:26:54,198
మిసెస్ సెల్విగ్?

277
00:26:54,281 --> 00:26:55,824
- నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?
- ఏంటి...

278
00:26:57,117 --> 00:27:02,623
నేను... అంటే... వార్తల్లో అతను లూమన్ లో
పని చేసే వాడని చెప్పారు,

279
00:27:02,706 --> 00:27:06,376
కాబట్టి అతను నాకు తెలుసేమో అనుకున్నాను.
మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?

280
00:27:06,460 --> 00:27:10,380
అతను మా అంగడికి తరచుగా వచ్చేవాడు.

281
00:27:10,464 --> 00:27:14,176
ఓరి దేవుడా. ఈ ప్రపంచం చాలా చిన్నది కదా.

282
00:27:14,259 --> 00:27:16,220
పాపం, అప్పుడే చనిపోయాడు.

283
00:27:17,012 --> 00:27:19,681
కానీ ఇందులో మంచి విషయమేంటంటే, ఇప్పటికైనా
మనం బయట కలుసుకున్నాం.

284
00:27:23,101 --> 00:27:24,436
అతని దేహం అక్కడ ఉంది.

285
00:27:24,520 --> 00:27:26,522
అక్కడికి వెళ్లి, ఆయనకి నివాళి
అర్పించాలనుకుంటే వెళ్లు,

286
00:27:26,605 --> 00:27:27,856
నేను ఇక్కడే ఉంటాను.

287
00:27:27,940 --> 00:27:30,984
నేను బాత్రూమ్ కి వెళ్లి వస్తాను,
ఆ తర్వాత మిమ్మల్ని కలుస్తాను.

288
00:27:32,027 --> 00:27:34,154
- అంత్యక్రియలు ఇంకాసేపట్లో మొదలవుతాయి.
- సరే.

289
00:27:46,625 --> 00:27:48,335
విస్కీ. ఐస్ తో పాటు ఇవ్వండి.

290
00:27:48,418 --> 00:27:50,212
కేవలం వైన్ మాత్రమే ఉంది, సర్,

291
00:27:50,295 --> 00:27:52,130
సరే. రెడ్ వైన్ ఇవ్వండి.

292
00:28:26,665 --> 00:28:28,667
హలో. మీరు ఆయనకి స్నేహితులా?

293
00:28:31,587 --> 00:28:32,880
ఆయన మా నాన్న.

294
00:28:33,589 --> 00:28:36,133
ఇలా జరిగినందుకు నా సంతాపం తెలియజేస్తున్నాను.

295
00:28:41,054 --> 00:28:43,390
మీ ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉందనుకుంటా.

296
00:28:56,570 --> 00:28:57,696
వైట్ వైన్ ఇవ్వండి.

297
00:29:04,870 --> 00:29:06,997
మన్నించాలి, మీరెవరో నాకు తెలీదు. నా పేరు నీనా.

298
00:29:07,748 --> 00:29:08,749
నా పేరు మార్క్ స్కౌట్.

299
00:29:10,125 --> 00:29:11,710
నేను పీటర్ మాజీ భార్యని.

300
00:29:13,170 --> 00:29:15,631
అలాగా. నా సంతాపం తెలియజేస్తున్నాను.

301
00:29:20,552 --> 00:29:22,095
మీరు లూమన్ లో పని చేస్తారు కదా.

302
00:29:31,939 --> 00:29:33,941
అయితే, మీకు అతని గురించి ఏమీ తేలీదన్నమాట.

303
00:29:36,860 --> 00:29:38,820
- అతను నాకు తెలిసి ఉండవచ్చేమో అనుకొని...
- అమ్మా.

304
00:29:38,904 --> 00:29:40,030
వాళ్ళు మొదలుపెడతారట.

305
00:29:40,614 --> 00:29:41,615
సరే, బంగారం.

306
00:29:42,241 --> 00:29:45,077
హాయ్, మీరు... మీ పేరు జూన్ ఆ?

307
00:29:46,245 --> 00:29:47,538
అవును.

308
00:29:48,205 --> 00:29:49,331
మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది.

309
00:30:00,801 --> 00:30:02,386
పీటర్ కిల్మర్ సంస్మరణ కార్యక్రమం

310
00:30:02,469 --> 00:30:03,637
తనను తాను పరిశీలించుకొన్న కాలం

311
00:30:03,720 --> 00:30:04,721
స్మృతి చేసుకోవడానికి వీడియో ప్రదర్శన

312
00:30:17,651 --> 00:30:19,027
అయితే మీకు మా నాన్న తెలుసా?

313
00:30:21,738 --> 00:30:22,739
తెలుసు.

314
00:30:26,493 --> 00:30:27,494
నా సహోద్యోగి.

315
00:30:28,996 --> 00:30:30,122
మీరు కూడా అంతే అన్నమాట.

316
00:30:31,665 --> 00:30:32,958
మన జీవితంలో ఏదైనా దారుణమైన సంఘటన జరిగితే,

317
00:30:33,041 --> 00:30:35,335
దానికి పరిష్కారం మన సగం జీవితాన్ని
మర్చిపోవడం కాకుండా

318
00:30:35,419 --> 00:30:37,671
ఇంకేదైనా ఉంటుందని మీకు అనిపించలేదా?

319
00:30:41,133 --> 00:30:42,843
ఏమో మరి.

320
00:30:46,680 --> 00:30:47,764
మన్నించండి.

321
00:30:48,307 --> 00:30:50,184
మేము మీ కోసం ఒక పాట పాడనున్నాం.

322
00:30:52,477 --> 00:30:54,313
నువ్వు ఇక్కడ ఉన్నందుకు
ఆనందంగా ఉంది, బంగారం.

323
00:30:54,396 --> 00:30:56,940
మేము ఒక పాటను... మేము...
మేము మా పాటతో మీకు పిచ్చెక్కిస్తాం.

324
00:30:57,024 --> 00:30:59,276
- మేము దుమ్ముదులిపేస్తాం
- రాక్ అండ్ రోల్ సంగీతంతో అలరిస్తాం.

325
00:30:59,860 --> 00:31:01,486
ఇక మొదలుపెడుతున్నాం!

326
00:31:06,992 --> 00:31:09,077
బుడ్డోడా ప్రార్థించు

327
00:31:09,161 --> 00:31:10,871
కానీ ఒకటి మాత్రం మర్చిపోకు బుడ్డోడా

328
00:31:10,954 --> 00:31:13,165
అందరి కోసమూ ప్రార్థించు

329
00:31:15,042 --> 00:31:17,294
దుప్పటి కప్పుతాను, బాగా వెచ్చగా ఉంటుంది

330
00:31:17,377 --> 00:31:18,921
నీకు ఏ పాపమూ తగలకుండా కాపాడుతుంది

331
00:31:19,004 --> 00:31:20,589
మట్టి మనిషి వచ్చేదాకా

332
00:31:23,175 --> 00:31:26,386
కాస్త జాగ్రత్తగా పడుకో

333
00:31:27,221 --> 00:31:30,098
దిండును గట్టిగా పట్టుకొని పడుకో

334
00:31:30,182 --> 00:31:32,768
లైట్ ఆపేయ్

335
00:31:34,019 --> 00:31:37,981
రాత్రికి స్వాగతం పలుకు

336
00:31:38,065 --> 00:31:40,692
మట్టి ముద్ద కనపడింది

337
00:31:41,693 --> 00:31:44,363
మనం ఆకాశంలో తేలుతున్నాం

338
00:31:51,787 --> 00:31:53,914
ఏదో తేడాగా ఉంది, లైట్ ఆపేయ్

339
00:31:53,997 --> 00:31:57,835
ఈ రాత్రి మంచి కలలు రావట్లేదు

340
00:31:59,711 --> 00:32:01,672
యుద్ధం కలలు, అబద్ధాలకోరుల కలలు

341
00:32:01,755 --> 00:32:03,632
డ్రాగన్ మంటలను కక్కుతున్న కలలు

342
00:32:03,715 --> 00:32:05,717
చంపేసే జంతువుల కలలు

343
00:32:08,011 --> 00:32:10,973
కాస్త జాగ్రత్తగా పడుకో

344
00:32:12,140 --> 00:32:14,852
దిండును గట్టిగా పట్టుకొని పడుకో

345
00:32:14,935 --> 00:32:17,354
లైట్ ఆపేయ్

346
00:32:18,480 --> 00:32:22,609
రాత్రికి స్వాగతం పలుకు

347
00:32:22,693 --> 00:32:25,237
నా చేతిని పట్టుకో

348
00:32:26,488 --> 00:32:28,282
మనం ఆకాశంలో తేలుతున్నాం

349
00:32:30,784 --> 00:32:32,411
నాకు ఏం కాకుండా చూసుకోమని
దేవుడిని ప్రార్థిస్తున్నాను

350
00:32:32,494 --> 00:32:34,872
నాకు ఏం కాకుండా చూసుకోమని
దేవుడిని ప్రార్థిస్తున్నాను

351
00:32:34,955 --> 00:32:36,623
లేవక ముందే నేను చనిపోతే

352
00:32:36,707 --> 00:32:38,125
లేవక ముందే నేను చనిపోతే

353
00:32:38,709 --> 00:32:40,502
నా ఆత్మను నీలో కలుపుకో

354
00:32:40,586 --> 00:32:42,713
నా ఆత్మను నీలో కలుపుకో

355
00:32:42,796 --> 00:32:46,133
ఊరుకో, బంగారం, నిశ్శబ్దంగా ఉండు

356
00:32:46,717 --> 00:32:50,220
నీకు వినిపించిన శబ్దాన్ని పట్టించుకోకు

357
00:32:50,804 --> 00:32:54,391
నీ బెడ్ కింద, నీ అరలో

358
00:32:54,474 --> 00:32:58,145
- నీ ఆలోచనల్లో ఉన్న రాకాసే అది
- రాకాసే అది

359
00:32:58,228 --> 00:33:00,689
లైట్ ఆపేయ్

360
00:33:02,149 --> 00:33:05,777
రాత్రికి స్వాగతం పలుకు

361
00:33:05,861 --> 00:33:08,864
మట్టి ముద్ద కనపడింది

362
00:33:10,157 --> 00:33:11,867
మనం ఆకాశంలో తేలుతున్నాం

363
00:33:22,419 --> 00:33:23,629
సూపర్!

364
00:33:25,881 --> 00:33:26,840
సూపర్!

365
00:33:28,967 --> 00:33:32,346
ఒకవేళ... ఒకవేళ నువ్వు మరీ వేగంగా
వాయించడం వల్ల పొగ బయటకి వస్తే?

366
00:33:32,429 --> 00:33:33,430
నీ చెవుల నుండి.

367
00:33:53,367 --> 00:33:55,869
మార్క్, బంగారం, నువ్వు బాగానే ఉన్నావు కదా?
నన్ను క్షమించు.

368
00:33:55,953 --> 00:33:57,829
- బాగానే ఉన్నాను.
- ఈ మూత్రకోశ ఇన్ఫెక్షన్ వల్ల నాకు...

369
00:33:57,913 --> 00:33:59,748
నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు.
ఇక నేను వెళ్తాను.

370
00:33:59,831 --> 00:34:01,917
- సరే, నేను కూడా నీతో వస్తాను.
- పర్వాలేదు.

371
00:34:02,000 --> 00:34:04,044
- లేదు, నేను నివాళులు అర్పించేశాను. పద.
- ఇక ప్రార్థిద్దాం.

372
00:34:04,127 --> 00:34:05,629
పరలోకమునందున్న ప్రభువా...

373
00:34:07,381 --> 00:34:10,467
అంత్యక్రియల్లో నీకు బాగా బాధ కలిగిందా, లేకపోతే...

374
00:34:12,844 --> 00:34:14,679
కాస్త బాధ కలిగింది.

375
00:34:14,763 --> 00:34:16,264
నీకు దాని గురించి పంచుకోవాలనిపిస్తే...

376
00:34:16,348 --> 00:34:20,226
లేదులెండి. థ్యాంక్యూ.
నేను... నేను బాగానే ఉన్నాను.

377
00:34:22,062 --> 00:34:25,148
కానీ, అంత్యక్రియల్లో నాకు తోడుగా
ఉన్నందుకు మీకు థ్యాంక్స్.

378
00:34:26,733 --> 00:34:27,818
శుభరాత్రి.

379
00:34:28,360 --> 00:34:29,360
శుభరాత్రి.

380
00:37:27,456 --> 00:37:28,665
అది పీటీదా?

381
00:37:30,918 --> 00:37:32,669
అవును.

382
00:37:34,796 --> 00:37:35,797
కానీ మీరు ఎలా దాన్ని...

383
00:37:35,881 --> 00:37:39,134
దీన్ని డయాగ్నిస్టిక్స్ డిపార్టుమెంటుకు
ఇచ్చి రాగలవా?

384
00:37:46,058 --> 00:37:47,100
ఎవరు?

385
00:37:53,065 --> 00:37:54,942
నన్ను పిలిచారా, మిస్ కొబెల్?

386
00:37:55,526 --> 00:38:01,281
మిస్ కేసీ, నువ్వు మార్క్ ఎస్ కోసం
ఒక ప్రత్యేకమైన సంరక్షణా సెషన్ ని నిర్వహించాలి.

387
00:38:01,949 --> 00:38:02,950
మార్క్ ఎస్ కోసమా?

388
00:38:03,825 --> 00:38:05,244
ఏమైంది?

389
00:38:08,622 --> 00:38:11,458
నేను చెప్తున్నా కదా, అతనికి దాని అవసరం ఉంది.

390
00:38:26,139 --> 00:38:29,184
"కియర్ మిమ్మల్ని తన నీటిని తాగమని పిలిచారు."

391
00:38:30,310 --> 00:38:32,563
- అర్వింగ్.
- మీరు ఇక్కడ ఉంటారని ఫెలీషియా చెప్పింది.

392
00:38:35,649 --> 00:38:39,611
నాకు అది ఇష్టం లేదని చెప్తే
మీరేమీ అనుకోరు కదా?

393
00:38:40,112 --> 00:38:41,113
ఏమీ అనుకోను.

394
00:38:41,864 --> 00:38:44,491
నిజానికి, అది నాకు కూడా కంగారు కలిగిస్తుంది.

395
00:38:46,827 --> 00:38:49,830
సీన్ చాలా బాగుంటుంది,
కానీ నాకు ఏమనిపిస్తుందంటే...

396
00:38:49,913 --> 00:38:51,123
అతను జారిపడిపోతాడేమో అనే కదా.

397
00:38:54,960 --> 00:38:59,756
ఎండిఆర్ నుండి మా డిపార్టుమెంటును
చూడటానికి ఒకరు రావడం చాలా ఆనందంగా ఉంది,

398
00:38:59,840 --> 00:39:02,426
మీరు చూపే ఆసక్తి బాగుంది, ఇతరులకు కూడా
అలానే అనిపిస్తే బాగుంటుంది, కనుక...

399
00:39:03,552 --> 00:39:04,803
నేనేమైనా చెత్తగా మాట్లాడుంటే...

400
00:39:04,887 --> 00:39:05,888
అలా ఏమీ జరగలేదు.

401
00:39:07,181 --> 00:39:09,349
మీరు చెత్తగా మాట్లాడారా ఏంటి?

402
00:39:10,350 --> 00:39:11,643
మీకు అలా అనిపించిందా?

403
00:39:14,479 --> 00:39:15,480
లేదు.

404
00:39:17,816 --> 00:39:18,817
మంచిది.

405
00:39:21,528 --> 00:39:23,197
నేను ఇంకా నాలుగు చోట్లకు వెళ్లాలి.

406
00:39:26,825 --> 00:39:29,077
మీరు నాతో పాటు వస్తారా?

407
00:39:31,788 --> 00:39:32,873
తప్పకుండా.

408
00:39:35,042 --> 00:39:36,043
మీరు మామూలోళ్లు కాదు.

409
00:39:36,627 --> 00:39:38,378
నాకు కూడా కాసేపు పడుకోవాలనిపిస్తుంది.

410
00:39:39,129 --> 00:39:41,590
అక్కడ ఒక రాత్రికి 15 గంటలు పడుకుంటానుకుంటా.

411
00:39:41,673 --> 00:39:42,925
అది స్వభావ లోపం.

412
00:39:43,008 --> 00:39:45,219
అంటే మీకు పార్టీలంటే ఇష్టమని
అది తెలుపుతుంది, జల్సా పురుషుడా.

413
00:39:45,302 --> 00:39:47,554
నేను పడుకోలేను, బర్ట్.

414
00:39:47,638 --> 00:39:50,015
- పడుకుంటే ఎవరేమంటారు?
- అది హ్యాండ్ బుక్ నియమాలకు విరుద్ధం.

415
00:39:50,098 --> 00:39:53,936
"కార్యాలయంలో నిద్రకు ఉపక్రమించరాదు."

416
00:39:54,019 --> 00:39:58,482
నాకు కూడా హ్యాండ్ బుక్ నియమాలు తెలుసు.
నేను తొలి ఎడిషన్ లోని నియమాలను అనుసరిస్తాను.

417
00:39:59,942 --> 00:40:06,615
కియర్ అన్న అసలు మాటలు: "కర్మబద్ధునివైన
నీకు నేను యుగయుగాల పాటు మార్గనిర్దేశం చేస్తాను.

418
00:40:06,698 --> 00:40:10,536
నీకు నిష్కళంకమైన ఆలోచనలను కలిగించెదను,
జ్ఞానబోధ చేసెదను.

419
00:40:10,619 --> 00:40:13,038
నీవే నా స్వరానివి,

420
00:40:13,622 --> 00:40:17,125
నీ ద్వారా, నేను చనిపోయాక కూడా

421
00:40:17,209 --> 00:40:19,837
వేయి సంవత్సరాల పాటు నా లక్ష్యాన్ని సాధించెదను."

422
00:40:22,714 --> 00:40:24,299
నాకు అర్థం కాలేదు.

423
00:40:24,383 --> 00:40:28,846
ఆయన మనతో హ్యాండ్ బుక్ ద్వారా లేదా
పెయింటింగ్ ల ద్వారా మాత్రమే మాట్లాడడు.

424
00:40:29,638 --> 00:40:31,265
ఇతర విధాలుగా కూడా మాట్లాడతాడు

425
00:40:33,016 --> 00:40:34,393
తొమ్మిదవ అధ్యాయం
నిష్క్రమణ ఉపదేశం

426
00:40:34,476 --> 00:40:36,270
"నీ ఉద్యోగం ముఖ్యమని నువ్వు భావిస్తావు.

427
00:40:37,938 --> 00:40:40,315
కానీ నేను వేరే దేశంలో దేశదిమ్మరిలా బతికాను,

428
00:40:40,399 --> 00:40:45,195
నా డబ్బులను వాడుకోకుండా
ఇతరుల ఇచ్చిన బిచ్చాన్ని వాడుకున్నాను.

429
00:40:45,779 --> 00:40:49,700
వాళ్లలో చాలా మంది బిక్షగాళ్లు ఉన్నారు,
అయినా కానీ వాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు.

430
00:40:50,450 --> 00:40:53,370
ఆ వేసవి కాలం నాకు కూడా
చాలా ఆనందాన్ని ఇచ్చింది.

431
00:40:55,330 --> 00:40:57,666
నీ ఉద్యోగానికి నువ్వు చాలా ముఖ్యం,

432
00:40:59,042 --> 00:41:01,211
కానీ నీకు అది ముఖ్యం కాదు."

433
00:41:06,967 --> 00:41:09,303
జాగ్రతగా వెళ్లిరండి.

434
00:41:10,262 --> 00:41:12,472
థ్యాంక్స్, బర్ట్.

435
00:41:30,824 --> 00:41:32,034
మార్క్?

436
00:41:33,702 --> 00:41:34,953
నేను ఇక బయలుదేరుతాను.

437
00:41:35,037 --> 00:41:36,205
అలాగే.

438
00:41:36,288 --> 00:41:39,416
నాకు ఇవాళ ఆలస్యం అవుతుంది. దీన్ని
ఈరాత్రికే పూర్తి చేసేయగలను అనిపిస్తోంది.

439
00:41:40,751 --> 00:41:41,835
నువ్వు పూర్తి చేయాలనే కోరుకుంటున్నా.

440
00:41:45,172 --> 00:41:46,173
ఉంటా మరి.

441
00:42:43,438 --> 00:42:45,899
నువ్వు అనబడే నువ్వు

442
00:42:48,485 --> 00:42:49,486
నాకు తెలుసు.

443
00:42:55,409 --> 00:43:00,497
అప్పుడప్పుడూ, తమ ఫీలింగ్స్ కి ఈ బంక మట్టి
ద్వారా రూపం ఇవ్వమని జనాలను అడుగుతుంటాను.

444
00:43:01,415 --> 00:43:03,417
అలా మీరు చేయగలరా?

445
00:43:07,796 --> 00:43:08,797
అలాగే.

446
00:43:40,245 --> 00:43:45,751
"'విధి.' రికెన్ హేల్ మీకు అందిస్తున్న
ఒక అద్భుతమైన కవితా మాలిక."

447
00:43:45,834 --> 00:43:47,920
అయిదవ అధ్యాయం

448
00:44:07,147 --> 00:44:11,485
"అది కలలను కనడంతో ప్రారంభం అవుతుంది.

449
00:44:17,032 --> 00:44:19,159
తర్వాతి అంశం, శక్తి...

450
00:44:21,161 --> 00:44:23,080
అది విభిన్న అభిప్రాయాలు
ఉన్న వ్యక్తులను కలుపుతుంది.

451
00:44:24,373 --> 00:44:26,625
తర్వాతి అంశం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం,

452
00:44:28,085 --> 00:44:30,295
ఇంటి పట్ల, అలాగే భూమి పట్ల.

453
00:44:34,132 --> 00:44:38,345
తర్వాతి అంశం భీతి,
అది మనకి మరింత విలువను ఇస్తుంది.

454
00:44:42,266 --> 00:44:44,184
తర్వాతిది కనులు,

455
00:44:45,644 --> 00:44:47,646
అవి ప్రేమతో మనల్ని గమనిస్తాయి.

456
00:44:50,148 --> 00:44:52,693
తర్వాతి అంశమైన కొత్తదనం

457
00:44:53,652 --> 00:44:55,946
వెల్లువయి ముంచెత్తేదాకా.

458
00:44:58,532 --> 00:44:59,533
ఇంకా చివరిది ప్రశ్న.

459
00:45:00,534 --> 00:45:03,245
ఆ ప్రశ్న గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు.

460
00:45:04,496 --> 00:45:09,793
ఎందుకంటే మిత్రులారా,
విధి మనకి అంతా మంచినే అందించనుంది."

461
00:45:11,962 --> 00:45:13,755
హేయ్. ఎలా ఉన్నావు?

462
00:45:13,839 --> 00:45:15,132
బాగున్నాను.

463
00:45:15,215 --> 00:45:17,384
అవునా? చూస్తుంటే, ఈ వాతావరణానికి
నువ్వు అలవాటు పడిపోతున్నట్టున్నావు.

464
00:45:20,137 --> 00:45:21,346
మంచిదే.

465
00:46:28,163 --> 00:46:30,165
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

