1
00:00:51,093 --> 00:00:52,094
గ్రేనర్.

2
00:00:52,177 --> 00:00:54,596
నువ్వు అడిగినట్టే కిల్మర్ మెదడులోని
డేటాను పరిశీలించాము.

3
00:00:54,680 --> 00:00:57,266
చిప్ ని హ్యాక్ చేయడానికి వాళ్లు ఉపయోగించిన
కన్సోల్ గుర్తును మేము కనిపెట్టాం.

4
00:00:57,349 --> 00:00:59,268
ఎవరి గుర్తు అది?

5
00:00:59,351 --> 00:01:00,519
మనదే.

6
00:01:00,602 --> 00:01:02,229
అది రెగాబీకి చెందినది అనుకుంటా.

7
00:01:02,312 --> 00:01:04,772
- రెగాబీ.
- అవును.

8
00:01:04,857 --> 00:01:07,276
తను ఏకీకరణ ఎలా చేయాలో కనిపెట్టేసింది.
తన ఆచూకీని కనిపెడతాను.

9
00:01:32,009 --> 00:01:35,220
"నాలోని నాలుగు ఆవేశ గుణాలను అదుపులో ఉంచి..."

10
00:01:35,304 --> 00:01:36,930
మర్టుల్ ఈగన్
బాలికల పాఠశాల

11
00:01:37,014 --> 00:01:39,349
"...నిన్ను మరింతగా సేవించెదను."

12
00:01:39,433 --> 00:01:41,685
లూమన్ ఇండస్ట్రీస్ - అధిక నాణ్యత గల
ఔషధ సంబంధిత చికిత్సా విధానాలు

13
00:01:41,768 --> 00:01:44,021
"నేను తొమ్మిది గుణాలను అలవరచుకొని..."

14
00:01:44,104 --> 00:01:46,523
సత్ప్రవర్తన - నూటికి నూరు శాతం లోపాలేవీ
లేకుండా ఉండాలని ప్రయత్నిస్తే, ఖచ్చితంగా విఫలమవుతావు

15
00:01:46,607 --> 00:01:48,317
"...పరమాత్మునితో ఏకం అవుతాను."

16
00:01:48,400 --> 00:01:49,401
కొబెల్, చార్లెట్
3-17-44

17
00:03:48,353 --> 00:03:51,732
మిస్డ్ కాల్స్ జాబితా
బ్లాక్ చేయబడినది - బ్లాక్ చేయబడినది - బ్లాక్ చేయబడినది

18
00:04:54,837 --> 00:04:56,171
నేను లోపలికి రావచ్చా?

19
00:04:56,255 --> 00:04:57,965
రావచ్చు. రావచ్చు.

20
00:05:07,808 --> 00:05:09,518
దీన్ని నువ్వే కనుగొన్నావా?

21
00:05:10,686 --> 00:05:11,979
కనుగొని చాలా కాలమైందిలే.

22
00:05:13,355 --> 00:05:16,733
అప్పుడప్పుడూ నేను ఒక్కడినే ఇక్కడికి వస్తుంటా.

23
00:05:21,780 --> 00:05:24,449
ఇప్పుడు దీన్ని నీకు చూపాలనుకున్నాను.

24
00:05:25,826 --> 00:05:27,119
ఇది చాలా అందంగా ఉంది.

25
00:05:29,204 --> 00:05:33,000
దీన్ని కేవలం మనం మాత్రమే వాడుకోవచ్చు.
మన రహస్యమైన ప్రదేశంలా అన్నమాట.

26
00:05:35,169 --> 00:05:36,336
ఎట్టకేలకు.

27
00:05:37,629 --> 00:05:41,592
నా ఉద్దేశం ఏంటంటే, ఓ&డీ వాళ్లు మంచివాళ్ళే,

28
00:05:41,675 --> 00:05:43,218
కానీ వాళ్లు...

29
00:05:43,302 --> 00:05:45,179
- ఎప్పుడూ పక్కనే ఉంటారు.
- అవును.

30
00:05:53,770 --> 00:05:55,189
ఇది పర్లేదా?

31
00:05:58,483 --> 00:06:04,573
అర్వింగ్, లూమన్ మాన్యువల్ లో లిప్ కిస్
గురించి ప్రస్తావన లేదు, కాబట్టి మరేం పర్వాలేదు.

32
00:06:05,616 --> 00:06:10,287
కానీ ప్రేమాయాణలను నెరపవద్దు అని చెప్తోంది కదా.

33
00:06:10,370 --> 00:06:12,206
అయితే ఇది ప్రేమగా ఉండకూడదా?

34
00:06:14,374 --> 00:06:15,375
ఉండకూడదు.

35
00:06:17,544 --> 00:06:21,215
అస్సలు... ఉండకూడదా?

36
00:06:25,719 --> 00:06:27,012
నన్ను క్షమించు...

37
00:06:29,890 --> 00:06:31,099
నేను అందుకు సిద్ధంగా లేను, అంతే.

38
00:06:34,102 --> 00:06:35,479
నన్ను... నన్ను క్షమించు.

39
00:06:41,026 --> 00:06:42,152
పర్వాలేదులే.

40
00:06:45,405 --> 00:06:46,573
ఇలాగే ఉండు.

41
00:06:48,784 --> 00:06:52,079
నాతో కాసేపు ఉండు.

42
00:07:13,267 --> 00:07:15,310
నువ్వు చక్కగా ప్రవర్తించావు.

43
00:07:15,394 --> 00:07:19,439
ఇప్పుడు మనం ఇంటికెళ్లి, నువ్వు పాలు
తాగుతావో లేదో చూద్దాం. తాగాలమ్మా.

44
00:07:45,257 --> 00:07:47,509
మనిద్దరమూ తల్లులం అయినట్టున్నాం కదా.

45
00:07:47,593 --> 00:07:49,511
- హలో.
- హాయ్.

46
00:07:50,220 --> 00:07:52,264
నేను డెవన్ ని.
పురుడు పోసే రిసార్ట్ లో కలుసుకున్నాం కదా.

47
00:07:52,347 --> 00:07:54,558
మీరు నాకు కాఫీ కూడా ఇచ్చారు.

48
00:07:56,894 --> 00:07:58,645
బుడ్డోడు చాలా అందంగా ఉన్నాడు.

49
00:07:58,729 --> 00:08:00,022
అచ్చం పేరుకు తగ్గట్టు విలియమ్ లానే ఉన్నాడు.

50
00:08:00,772 --> 00:08:02,900
నిజానికి, వీడికి బ్రాడ్లీ అని పేరు పెట్టాం.

51
00:08:04,067 --> 00:08:05,068
విలియమ్ కాదా?

52
00:08:06,486 --> 00:08:09,448
- మార్చారా?
- మనం జ్యూస్ బాక్సులని కారులోనే ఉంచేశామా?

53
00:08:10,324 --> 00:08:11,450
అంతే అయ్యుండవచ్చు.

54
00:08:12,409 --> 00:08:15,204
హాయ్, నా పేరు ఏంజెలో ఆర్టెటా.

55
00:08:15,287 --> 00:08:16,997
నా పేరు డెవన్. మిమ్మల్ని
కలిసినందుకు సంతోషంగా ఉంది.

56
00:08:17,080 --> 00:08:19,458
- తల్లి అయినందుకు అభినందనలు.
- థ్యాంక్యూ.

57
00:08:19,541 --> 00:08:21,251
మీ ఇద్దరికీ పరిచయం ఉందా?

58
00:08:21,335 --> 00:08:24,087
అవును, నేను... మేము...
పురుడు పోసే కాటేజీలలో కలుసుకున్నాం.

59
00:08:26,131 --> 00:08:29,134
- మిమ్మల్ని కలవడం కూడా బాగుంది, డెవన్.
- అవును, మిమ్మల్ని కూడా.

60
00:08:32,304 --> 00:08:33,347
వావ్.

61
00:08:35,640 --> 00:08:36,642
మనం ఇక బయలుదేరాలి.

62
00:08:38,559 --> 00:08:40,229
- బై. బై.
- బై.

63
00:08:41,313 --> 00:08:42,313
బై, బ్రాడ్లీ.

64
00:08:45,234 --> 00:08:47,361
డెక్లన్, కాయ్, వెళ్దాం పదండి.

65
00:08:48,487 --> 00:08:50,697
ఓయమ్మో.

66
00:08:51,949 --> 00:08:52,950
క్షమించు.

67
00:08:55,202 --> 00:08:57,287
సాంగత్యం అంటే ఏంటి?

68
00:08:58,038 --> 00:08:59,039
ఇరవై తొమ్మిదవ అధ్యాయం
సాంగత్యం

69
00:08:59,122 --> 00:09:02,459
అధిక శాతం భాషా పండితులు, అది
ల్యాటిన్ పదమైన "కెమెరా" నుండి వచ్చిందని అంటారు,

70
00:09:03,085 --> 00:09:06,213
అంటే "ఫోటో తీయడానికి
ఉపయోగించే పరికరం" అని అర్థం.

71
00:09:07,714 --> 00:09:12,219
ఎంతైనా, ఒకరిపట్ల మరొకరి ప్రేమ ఉండీ
ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే మిత్రులవే

72
00:09:12,302 --> 00:09:13,846
మంచి ఫోటోలు అవుతాయి.

73
00:09:13,929 --> 00:09:14,972
నువ్వు అనబడే నువ్వు

74
00:09:15,055 --> 00:09:19,268
కానీ, సాంగత్యం అంటే ఫోటోలలో
నవ్వుతూ ఉండటం మాత్రమే కాదు.

75
00:09:19,852 --> 00:09:22,521
కష్టాలలో తోడుగా ఉండటం కూడా.

76
00:09:23,272 --> 00:09:27,025
సాటి మనిషిలో మీరు ఎదుర్కొనే కష్టాన్నే గుర్తించి

77
00:09:27,860 --> 00:09:31,947
వారికి ఆపన్నహస్తం అందించడమే సాంగత్యం అంటే.

78
00:09:36,743 --> 00:09:37,744
చిన్న వంట గది

79
00:09:37,828 --> 00:09:40,205
మనం వీలైనంత త్వరగా ఓ&డీకి వెళ్లాలి.

80
00:09:40,289 --> 00:09:41,790
అందరమూ. ఇవాళే.

81
00:09:41,874 --> 00:09:43,292
ఎవరో ప్రేమాయణం నడపాలని తహతహలాడిపోతున్నారే!

82
00:09:43,375 --> 00:09:45,127
దీనికీ ప్రేమయాణానికి ఏ సంబంధమూ లేదు.

83
00:09:45,210 --> 00:09:48,589
ఇలా చేస్తే కియర్ ఆకాంక్షించినట్టుగా
డిపార్టుమెంట్ల మధ్య స్నేహానికి

84
00:09:48,672 --> 00:09:50,757
మనం బీజం వేసినవారమవుతాం.

85
00:09:50,841 --> 00:09:52,634
బహుశా ఆయన ఆత్మే
మీ పెళ్లి జరిపిస్తుందేమోలే.

86
00:09:52,718 --> 00:09:55,804
ఇది ఆఫీసులో మాట్లాడే పద్ధతి కాదు.
నేను నీపై స్వీయ ఫిర్యాదు చేసుకుంటున్నాను.

87
00:09:55,888 --> 00:09:58,056
నువ్వు నాపై నీకు నువ్వే ఫిర్యాదు చేసుకుంటున్నావా?

88
00:09:58,140 --> 00:10:00,017
సరే. వాళ్లు ఏవో చేస్తున్నారని అన్నావు కదా?

89
00:10:00,100 --> 00:10:02,269
అవును, ఏవో యంత్రాలలో చేస్తున్నారు.
అవేంటి అని మేము అడగలేదు.

90
00:10:02,352 --> 00:10:04,062
మేకలను చంపడానికి కర్రలను తయారు చేస్తుంటారు.

91
00:10:04,146 --> 00:10:05,147
ఇక ఆపు.

92
00:10:05,731 --> 00:10:07,941
నేను అర్వింగ్ అన్నదానితో ఏకీభవిస్తాను.
ఓ&డీకి ఇందులో కీలకమైన భాగం ఉంది.

93
00:10:08,025 --> 00:10:11,820
- మనం ఈ అంతస్థునంతా మ్యాప్ రూపంలో...
- మ్యాప్ చేయడానికి నేను వ్యతిరేకమని ఖరాకండిగా చెప్తున్నా.

94
00:10:12,613 --> 00:10:13,697
సరే.

95
00:10:13,780 --> 00:10:16,283
మనం మరోసారి "మానసిక ఆరోగ్యానికి నడుద్దామా"?

96
00:10:16,366 --> 00:10:17,367
సరదాగా ఉంటుంది.

97
00:10:19,870 --> 00:10:21,038
ఏంటి... ఏమో మరి.

98
00:10:21,121 --> 00:10:24,541
అంటే, మనకి ఇంకా చాలా పని ఉంది, కాబట్టి...

99
00:10:24,625 --> 00:10:25,834
అవునులే.

100
00:10:27,211 --> 00:10:29,838
ఈ పని రహస్యమైనది, ముఖ్యమైనది.

101
00:10:32,090 --> 00:10:35,052
బాగా చెప్పావు. నువ్వు కూడా నాలాగే
మాట్లాడుతున్నావు.

102
00:10:35,135 --> 00:10:36,178
నాకు తెలుసు.

103
00:10:38,514 --> 00:10:40,182
ఇక పని మొదలుపెడదాం పదండి, బద్ధకస్తులారా.

104
00:10:44,394 --> 00:10:45,395
కియర్ కి సలామ్ కొట్టండి.

105
00:10:47,022 --> 00:10:48,023
హేయ్.

106
00:10:48,857 --> 00:10:50,234
నువ్వు కూడా ముగ్గులోకి దించాలని చూస్తున్నావా?

107
00:10:50,817 --> 00:10:52,986
ఏంటి? లేదు, నేనేమీ...

108
00:10:53,070 --> 00:10:56,907
నేను నా సహచరులను చక్కగా చూసుకుంటూ

109
00:10:56,990 --> 00:10:58,867
వారి అభ్యర్థనలను ఆలకించే నాయకుడిని.

110
00:10:58,951 --> 00:11:00,077
- నిజంగానా?
- అవును.

111
00:11:00,160 --> 00:11:02,704
సొల్లు ఎలా కార్చుకుంటున్నావో చూసుకో.

112
00:11:02,788 --> 00:11:04,831
- నన్ను చూసి నువ్వెప్పుడూ నవ్వనే లేదు.
- అతను చెప్పింది నిజమే, మార్క్.

113
00:11:04,915 --> 00:11:08,043
నీ ముఖంలో కళ మారిపోతోంది.

114
00:11:08,126 --> 00:11:10,254
అదేం కాదు. నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటా.

115
00:11:10,337 --> 00:11:11,505
నమస్తే, మిత్రులారా.

116
00:11:12,256 --> 00:11:14,049
మీరందరూ దేని గురించి ముచ్చట్లాడుకుంటున్నారు?

117
00:11:15,759 --> 00:11:16,802
ఏమీ లేదు...

118
00:11:16,885 --> 00:11:17,886
- మేము...
- అదీ...

119
00:11:17,970 --> 00:11:20,305
- చర్చించుకుంటున్నాం...
- అవును. మిసెస్...

120
00:11:20,389 --> 00:11:23,684
- మిస్ కేసీ. మిస్ కేసీ.
- మిస్ కేసీ. అవును.

121
00:11:24,852 --> 00:11:25,894
ఒక్క నిమిషం, తను ఎక్కడ ఉంది?

122
00:11:28,480 --> 00:11:34,152
పార్ట్ టైమ్ పని అవతారాలకు
పని పరంగా మీ అంత అనుభవం ఉండకపోవచ్చు,

123
00:11:34,236 --> 00:11:37,656
అయినా కానీ తమ చర్యలకు వారు బాధ్యత వహించాల్సిందే.

124
00:11:38,240 --> 00:11:43,370
మిస్ కేసీకి హెల్లిని పర్యవేక్షించే బాధ్యతని అప్పగించాం,
కానీ తను దాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోయింది.

125
00:11:44,371 --> 00:11:46,290
ఎందుకంటే, నేనే హెల్లిని బయటకు తీసుకెళ్లాను.

126
00:11:46,373 --> 00:11:48,709
అంటే, బ్రేక్ రూమ్ లో ఉండాల్సింది
తను కాదు, నేను.

127
00:11:51,837 --> 00:11:52,921
శౌర్యం.

128
00:11:53,672 --> 00:11:56,383
ప్రధానమైన సూత్రం కాదు, కానీ బాగుంది.

129
00:11:57,426 --> 00:11:59,887
నువ్వు ఎవరి కోసమైనా కూడా
బ్రేక్ రూమ్ కి వెళ్లాలనుకుంటావు!

130
00:12:02,306 --> 00:12:05,434
తను కేవలం సంరక్షణా సలహాదారు, మార్క్.

131
00:12:05,976 --> 00:12:07,769
అవును, కానీ శిక్ష పడాల్సింది తనకి కాదు.

132
00:12:07,853 --> 00:12:09,521
నా ఉద్దేశం, హెల్లితో కాస్త నడుస్తూ మాట్లాడితే
బాగుంటుందని అనిపించింది.

133
00:12:09,605 --> 00:12:11,231
అంటే, నాకు ఆ హక్కు ఉంది కదా.

134
00:12:11,315 --> 00:12:12,900
ఊరికే అలా నడిచావా?

135
00:12:13,525 --> 00:12:14,526
అవును.

136
00:12:20,240 --> 00:12:22,451
ఒక పక్క మీ డిపార్టుమెంట్ కోటాను
అందుకోవడంలో దారుణంగా విఫలమవుతుంటే

137
00:12:22,534 --> 00:12:25,954
నువ్వేమో ఇతర డిపార్టుమెంట్ల చుట్టూ తిరుగుతున్నావా?

138
00:12:26,788 --> 00:12:28,498
తను మృత్యుఒడి దాకా వెళ్లి వచ్చింది.

139
00:12:28,582 --> 00:12:32,294
ప్రతీ కొత్త రిఫైనర్ యొక్క ఆలనాపాలనా
చూసుకోవలసిన పని నీది కాదు.

140
00:12:33,879 --> 00:12:36,173
అయితే, నా పని ఏంటి?

141
00:12:36,256 --> 00:12:37,841
నువ్వు నిజంగా అది అడుగుతున్నావా?

142
00:12:39,259 --> 00:12:40,260
అవును.

143
00:12:40,761 --> 00:12:42,930
అసలు మేము ఇక్కడ ఏం చేస్తున్నాం?

144
00:12:45,307 --> 00:12:48,268
మనం కియర్ సేవలో ఉన్నామురా!

145
00:12:48,769 --> 00:12:54,691
నీ మట్టి బుర్రలోకి అది ఎక్కించుకొని,
మీ టార్గెట్ ని మీరు చేరుకొనే దాకా,

146
00:12:55,275 --> 00:12:59,238
ఎండిఆర్ వారికి హాలులో
నడిచే అధికారాన్ని నిలిపివేస్తున్నాను.

147
00:13:00,072 --> 00:13:05,202
కాబట్టి ఇక నీ డెస్క్ వద్దకి వెళ్లి,
అనుమతి వచ్చేదాకా అక్కడే ఉండు.

148
00:13:09,289 --> 00:13:11,250
లూమన్

149
00:13:12,084 --> 00:13:14,378
ఈ విషాదాన్ని నేను భరించలేకపోతున్నాను.

150
00:13:14,461 --> 00:13:17,923
నాలో, ఇంకా మిస్ కేసీలో ఉండే అనిర్వచనీయమైన
శక్తిని ఈ డిపార్టుమెంట్ కోల్పోయింది.

151
00:13:18,006 --> 00:13:19,007
అవునా?

152
00:13:19,091 --> 00:13:21,260
అదీగాక, నేను ఇవాళ
అదిరిపోయే చొక్కా వేసుకొని వచ్చాను.

153
00:13:23,428 --> 00:13:25,639
నువ్వు ఆ చొక్కాని తీసుకున్నప్పుడు,
నీకు అసలు ఆమె ఉందనే తెలీదు.

154
00:13:25,722 --> 00:13:28,058
ప్రేమని ఈ వేర్పాటు పద్ధతి అడ్డుకోలేదేమో.

155
00:13:28,141 --> 00:13:30,227
- నీకు అలా అనిపిస్తుందా?
- లేదు.

156
00:13:32,855 --> 00:13:34,106
మరి నీకు, మార్క్ కి మధ్య ఏం నడుస్తోంది?

157
00:13:34,189 --> 00:13:35,440
ఏంటి?

158
00:13:35,524 --> 00:13:38,026
మీరిద్దరూ నిన్న ఆనందంగా ఎగురుకుంటూ
దొంగచాటుగా బయటకు వెళ్లారు కదా?

159
00:13:38,777 --> 00:13:40,153
"మేక పిల్లలు"?

160
00:13:41,405 --> 00:13:43,240
ఎందుకు అదోలా అంటున్నావు?

161
00:13:45,492 --> 00:13:49,121
"మేక పిల్లలు" అంటే
మార్క్ ఎస్ తో సెక్స్ కి కోడ్ అనుకుంటున్నావా?

162
00:13:51,123 --> 00:13:52,666
వామ్మోయ్.

163
00:13:53,250 --> 00:13:56,336
అయితే, "మేక పిల్లలు" అనేది
మార్క్ ఎస్ తో సెక్స్ కి కోడ్ ఆ?

164
00:13:56,920 --> 00:13:58,338
లేదు, మేము నిజంగానే మేకలని చూశాం.

165
00:13:58,422 --> 00:13:59,923
లేకపోతే, ఎందుకు అలా అంటాం?

166
00:14:00,632 --> 00:14:02,718
సరే. నేను నమ్ముతున్నానులే.

167
00:14:02,801 --> 00:14:03,927
మార్క్.

168
00:14:05,804 --> 00:14:06,972
ఏం జరిగిందో తెలుసుకున్నావా?

169
00:14:07,055 --> 00:14:09,099
తను బ్రేక్ రూమ్ లో ఉంది.

170
00:14:09,183 --> 00:14:11,768
అయ్యయ్యో. మన వల్లేనా?

171
00:14:14,229 --> 00:14:17,357
ఇంకా, మనం టార్గెట్ ని అందుకొనే దాకా
హాల్ వేలలో తిరగడానికి మనకి అనుమతి లేదు,

172
00:14:17,441 --> 00:14:21,111
కాబట్టి ఇతర డిపార్టుమెంటులకి వెళ్లడాలు లేవు!

173
00:14:23,822 --> 00:14:25,324
నువ్వు నిజంగానే అంటున్నావా?

174
00:14:30,662 --> 00:14:31,663
నన్ను...

175
00:14:33,582 --> 00:14:35,709
క్షమించు, మార్క్.
ఇదంతా... ఇదంతా నా వల్లే జరిగింది...

176
00:14:37,794 --> 00:14:43,133
అందరి కన్నా సీనియర్ గా
నేను మీకు ఆదర్శవంతంగా ఉండటం లేదు.

177
00:14:48,847 --> 00:14:50,974
ఓ&డీకి ఎలా వెళ్లాలి అన్నావు?

178
00:15:13,705 --> 00:15:15,332
మిల్చెక్!

179
00:15:15,415 --> 00:15:16,500
నేను చూసుకుంటా.

180
00:15:50,117 --> 00:15:51,869
ఇంత మంది జనాలని నేనెప్పుడూ చూడలేదు.

181
00:15:52,536 --> 00:15:53,954
నేను కూడా.

182
00:15:56,874 --> 00:15:58,333
ఏం పర్వాలేదు.

183
00:15:58,417 --> 00:16:02,296
మార్పు మొదట్లో కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు,

184
00:16:02,880 --> 00:16:04,631
కానీ ఎండిఆర్ వాళ్లు ఇక్కడికి వచ్చేశారు.

185
00:16:07,676 --> 00:16:08,969
మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు,

186
00:16:09,052 --> 00:16:14,683
అదే విధంగా మీరు కూడా మీరు పని చేసే చోటుకు
ఇతర డిపార్టుమెంట్ వాళ్లని స్వాగతిస్తారనే ఆశిస్తున్నా.

187
00:16:14,766 --> 00:16:18,604
ఇక కానివ్వండి. మీకు ఎన్నో సందేహాలు
ఉండుంటాయి కదా, వారిని అడిగేయండి.

188
00:16:24,193 --> 00:16:27,154
మీ డిపార్టుమెంట్ పేరు మ్యాక్రోడేటా రిఫైన్మెంట్ ఆ?

189
00:16:29,531 --> 00:16:31,158
ఇంతకీ మీరు దేన్ని శుద్ధి చేస్తారు?

190
00:16:36,205 --> 00:16:37,372
అది నీళ్లు పట్టే పాత్రనా?

191
00:16:40,417 --> 00:16:45,172
పైనున్న ఎగ్జిక్యూటివ్ వింగ్ కి
అది కావాల్సిన వస్తువు అనుకుంటున్నాం.

192
00:16:45,255 --> 00:16:49,635
కానీ, పోయిన వారం ఫలితాలను బట్టి చూస్తే,
అవి చాలా దూకుడుగా ఉన్నట్టు అనిపించాయి.

193
00:16:49,718 --> 00:16:51,094
గొడ్డళ్లు అంత దూకుడుగా ఏమీ లేవు.

194
00:16:51,178 --> 00:16:53,138
గొడ్డళ్ళా?

195
00:16:54,556 --> 00:16:57,267
ఇక్కడి తీరుతెన్నులేంటో తెలుసుకోవాలని
మేము ప్రయత్నిస్తున్నాం.

196
00:16:57,351 --> 00:17:01,271
ఇటు వైపు కాకుండా అటు వైపు ఉండే
ఒక డిపార్టుమెంట్లో

197
00:17:01,355 --> 00:17:05,150
మేకల పెంపకం జరుగుతుందని కనిపెట్టాం.

198
00:17:06,401 --> 00:17:07,736
మేకల పెంపకమా?

199
00:17:12,574 --> 00:17:17,454
మాకు తెలియనివి కూడా ఇక్కడ చాలా ఉన్నాయి,
కానీ మేము మా పనేదో మేము చేసుకుంటూ పోతున్నాం.

200
00:17:17,538 --> 00:17:19,205
ఇది ముఖ్యమైన పనేలెండి.

201
00:17:19,289 --> 00:17:21,916
మనం ఇక్కడ చేసేవన్నీ ముఖ్యమైనవే.

202
00:17:24,211 --> 00:17:27,422
నిజంగానే ముఖ్యమైనదా లేక మీరు ముఖ్యమైనదని
చెప్తున్నారు కాబట్టి అది ముఖ్యమైనదా?

203
00:17:30,050 --> 00:17:33,637
చూడండి, మనందరం దీనిపై కలిసి పని చేయాలేమో.

204
00:17:35,514 --> 00:17:39,142
కలిసి ఏం చేయాలంటారు?

205
00:17:39,226 --> 00:17:42,312
ఏమో మరి. అసలు మేకలు ఎందుకు ఉన్నాయో
కనిపెట్టడంతో ప్రారంభించవచ్చు.

206
00:17:42,396 --> 00:17:47,192
లేదా, ఈ ఆఫీస్ ఎంత పెద్దదో,

207
00:17:47,276 --> 00:17:48,944
లేదా మొత్తం ఎంత మంది ఇక్కడ ఉన్నారో కనిపెట్టవచ్చు.

208
00:17:54,157 --> 00:17:57,744
నా ఉద్దేశం ఏంటంటే, అసలు మనం ఇక్కడ
ఏం చేస్తున్నామో మనకి ఎందుకు తెలపట్లేదు?

209
00:17:58,704 --> 00:18:00,414
ఎందుకు... ఎందుకు అంత భయపడుతున్నారు?

210
00:18:02,165 --> 00:18:06,545
ఈగన్ సూత్రం ప్రకారం
అన్నింటికన్నా జ్ఞానసముర్పాజనే ముఖ్యమైతే...

211
00:18:06,628 --> 00:18:08,505
అన్నింటికన్నా జ్ఞానసముర్పాజనే ముఖ్యం.

212
00:18:08,589 --> 00:18:09,631
కానీ నిజమే.

213
00:18:10,382 --> 00:18:12,843
మనకి ఎందుకు భాగం కల్పించడం లేదు?

214
00:18:13,552 --> 00:18:18,515
ఇంకా మనల్ని ఎందుకు అంధకారంలోనే ఉంచుతున్నారు?

215
00:18:25,522 --> 00:18:27,316
అది కవిత్వంలా అదిరిపోయింది, గురూ.

216
00:18:27,399 --> 00:18:28,483
థ్యాంక్స్.

217
00:18:31,028 --> 00:18:32,154
మార్క్ అన్నది నిజమే.

218
00:18:32,779 --> 00:18:34,323
- అవునా?
- అవును.

219
00:18:34,406 --> 00:18:40,412
అర్వింగ్, జ్ఞానాన్ని, సత్యాన్ని అన్వేషించడమే
కియర్ కి కూడా కావలసింది.

220
00:18:40,495 --> 00:18:43,415
అలా చేయడం ద్వారానే అతని బోధనలను
మనం సంపూర్ణంగా అర్థం చేసుకొన్నవారం అవుతాం.

221
00:18:43,999 --> 00:18:45,000
అవును.

222
00:18:46,460 --> 00:18:50,756
డిపార్టుమెంట్ చీఫ్ హోదాలో,

223
00:18:51,548 --> 00:18:55,719
మార్క్, నేనూ ఆ మేకల డిపార్టుమెంటును సంప్రదించి,
వారికి ఏం తెలుసో కనుక్కుంటే బాగుంటుంది అనుకుంటా.

224
00:18:57,471 --> 00:19:01,934
మేమిద్దరం సహాయంగా ఒక వ్యక్తిని తీసుకెళ్లవచ్చు.

225
00:19:24,122 --> 00:19:27,209
మేమేమీ పిల్లలం కాదు, మిస్టర్ మిల్చెక్.
మేము ఏ తప్పూ చేయలేదు.

226
00:19:32,798 --> 00:19:34,550
మ్యాక్రోడేటా రిఫైన్మెంట్

227
00:19:50,649 --> 00:19:55,529
మహోన్నతుడా, కియర్

228
00:19:56,029 --> 00:20:01,326
గొప్పవాడా, కియర్

229
00:20:01,410 --> 00:20:07,791
ఎన్నో కష్టాలు, కడగండ్లకు ఓర్చి
అందరికీ ఫలాలు తెచ్చినావు

230
00:20:08,375 --> 00:20:13,088
పురోగతిని, జ్ఞానాన్ని అందించావు
బెదురే లేకుండ జీవించినావు

231
00:20:13,881 --> 00:20:18,635
మహోన్నతుడా, కియర్

232
00:20:18,719 --> 00:20:21,013
కియర్

233
00:20:27,019 --> 00:20:31,523
నేను నిన్ను నమ్మాను,
కానీ దాన్ని నువ్వు దుర్వినియోగపరిచావు.

234
00:20:32,733 --> 00:20:35,986
నీ అసమర్థతకు, ఇంకా నీ పనీపాటా లేని తిరుగుడుకు

235
00:20:36,069 --> 00:20:38,864
బాధ్యత నువ్వే వహించాలి.

236
00:20:47,331 --> 00:20:50,083
అతడిని బ్రేక్ రూమ్ కి తీసుకెళ్లు.

237
00:21:29,498 --> 00:21:31,500
బ్రేక్ రూమ్

238
00:22:02,364 --> 00:22:03,365
నన్ను క్షమించు.

239
00:22:22,384 --> 00:22:23,802
నీ చేతికి ఏమైంది?

240
00:22:26,346 --> 00:22:30,184
ఆఫీసులో ఒక వాటర్ కూలర్ లో
నీళ్లు పోసేటప్పుడు నా చేయి ఇరుక్కుపోయిందట.

241
00:22:30,267 --> 00:22:31,977
నాకు మాత్రం వాళ్లు అదే చెప్పారు మరి.

242
00:22:32,060 --> 00:22:33,604
ఆ జగ్గులు చాలా బరువుగా ఉన్నాయి.

243
00:22:34,229 --> 00:22:35,397
అవును.

244
00:22:35,480 --> 00:22:36,690
ఇంకో వైన్ తీసుకురానా?

245
00:22:36,773 --> 00:22:37,774
వద్దులెండి.

246
00:22:38,442 --> 00:22:40,068
నాకు నీళ్లు తీసుకురండి, థ్యాంక్యూ.

247
00:22:42,654 --> 00:22:44,740
మీ అందాల కోడలిని చూశావా?

248
00:22:45,616 --> 00:22:47,659
తను పుట్టినప్పటి నుండి చూడలేదు.

249
00:22:47,743 --> 00:22:49,870
కానీ నేను మీ అక్కతో ఫోన్లో మాట్లాడాను.

250
00:22:50,370 --> 00:22:52,164
తను నీకు ఎంత వరకు చెప్తుందో నాకు తెలీదు,
కానీ తనకి...

251
00:22:52,247 --> 00:22:53,957
- పాలు తాగిపించడంలో సమస్యనా?
- అవును.

252
00:22:54,041 --> 00:22:56,752
అది... అది నాకు తెలుసు.
మరీ ఎక్కువ తెలుసేమో. ఏమోలే.

253
00:22:56,835 --> 00:23:00,297
ఆ విషయమై ఎవరైనా
మంచి వైద్యులు ఉన్నారేమో చూడమని అడిగింది.

254
00:23:01,381 --> 00:23:03,300
అది పెద్ద విషయమే అంటావా?

255
00:23:03,383 --> 00:23:04,843
లేదు, అది చాలా సాధారణమైన సమస్యే.

256
00:23:05,469 --> 00:23:07,721
అయినా కానీ, ఒక ప్రొఫెషనల్ అభిప్రాయం
తీసుకుంటే బాగుంటుంది కదా.

257
00:23:07,804 --> 00:23:09,223
నా ఉద్దేశం, ఇప్పటికే ఉన్న...

258
00:23:09,306 --> 00:23:11,767
- రికెన్ కాకుండానా? అవును.
- ...రికెన్.

259
00:23:13,852 --> 00:23:15,938
నీకు పిల్లలని కనాలని ఎప్పుడూ అనిపించలేదా?

260
00:23:18,023 --> 00:23:19,024
జెమ్మాతోనా?

261
00:23:20,484 --> 00:23:21,485
అవును.

262
00:23:27,032 --> 00:23:28,700
మేము కొంత కాలం పిల్లలని
కనాలని ప్రయత్నించాం.

263
00:23:29,576 --> 00:23:30,911
కానీ పిల్లలు కలగలేదు.

264
00:23:32,371 --> 00:23:34,623
ఒకానొక క్షణంలో దత్తత తీసుకుందామని కూడా
అనిపించింది, కానీ...

265
00:23:37,042 --> 00:23:41,505
ఏమో మరి. అప్పుడు,
"సరే, ఇదే నీకు ప్రసాదించబడిన జీవితం.

266
00:23:42,130 --> 00:23:46,218
అది మరో జీవితం, అది నీకు ప్రసాదించబడలేదు.

267
00:23:46,301 --> 00:23:48,345
కాబట్టి, నీకు ఇచ్చిన జీవితంతోనే
ఏదైనా చేసుకో," అని అనిపించింది.

268
00:23:50,597 --> 00:23:52,015
అది చాలా మంచి ఆలోచన.

269
00:23:52,099 --> 00:23:54,726
ఇదంతా తను చెప్పిందే అనుకో.

270
00:23:56,270 --> 00:23:59,648
తను, చాలా వాస్తవికంగా ఆలోచిస్తుంది.

271
00:24:00,315 --> 00:24:01,900
ఏ పనిలోనైనా రెండు ప్లాన్స్ పెట్టుకుంటుంది.

272
00:24:01,984 --> 00:24:05,487
ఒకసారి మేము క్యాంపింగ్ కి వెళ్లాలనుకున్నాం...

273
00:24:05,571 --> 00:24:07,990
తన గురించి నేను ఇప్పుడు మాట్లాడటం వింతగా లేదా?

274
00:24:08,073 --> 00:24:10,951
- నాకు...
- లేదు, ఇది చాలా మంచి సంభాషణ.

275
00:24:11,743 --> 00:24:13,287
అవును, కానీ మనం డేటింగ్ కి వచ్చాం కదా. నేను...

276
00:24:14,872 --> 00:24:16,540
ఇంకా నేను నిన్ను చీకొట్టేసి వెళ్లిపోలేదు కదా.

277
00:24:23,422 --> 00:24:28,594
ఒక్కోసారి నేను... నేను చాలా సాధించాలని
తను కోరుకొనేది అనుకుంటా.

278
00:24:29,887 --> 00:24:31,930
ఒక్కోసారేమో అసలు నా గురించి
పట్టించుకోనట్టుగా అనిపించేది.

279
00:24:32,014 --> 00:24:34,474
తను చనిపోయినందుకు తనకి చాలా కోపంగా
ఉండుంటుంది.

280
00:24:37,853 --> 00:24:39,897
క్షమించు, ఇది పిచ్చిపిచ్చిగా ఉంటుందని నాకు తెలుసు.

281
00:24:41,690 --> 00:24:43,025
తను నీలో ఒక భాగం.

282
00:24:44,067 --> 00:24:46,236
తన నుండి నిన్ను నువ్వు వేరు చేసుకోలేవు...

283
00:24:46,320 --> 00:24:50,282
- లేదు, అది సాధ్యమే, ఆలెక్సా.
- అయ్యయ్యో.

284
00:24:50,365 --> 00:24:52,492
ఈ ఆసక్తికరమైన కొత్త పద్ధతి సాయంతో.

285
00:24:52,576 --> 00:24:54,953
- సరిగ్గా ముద్దపప్పులో కాలు వేశాను కదా.
- అవును.

286
00:25:06,256 --> 00:25:08,759
ఈ యూజర్ ప్రొఫైల్ ప్రైవేట్ గా ఉంది
గ్యాబ్రియేలా ఆర్టెటా

287
00:25:12,971 --> 00:25:14,556
గ్యాబ్రియేలా ఆర్టెటా
సెనేటర్ ఏంజెలో ఆర్టెటా అర్థాంగి

288
00:25:15,390 --> 00:25:18,101
ఏంజెలో ఆర్టెటా మరియు సతీమణి గ్యాబ్రియేలా, ఆయన
రెండవ సారి ఎన్నికైన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు

289
00:25:26,443 --> 00:25:27,819
...వివాదాస్పదమైన వేర్పాటు పద్ధతికి
మద్దతు తెలిపి

290
00:25:27,903 --> 00:25:29,655
దిగ్విజయం సాధించారు...

291
00:25:30,155 --> 00:25:32,824
వేర్పాటు పద్ధతిపై చర్చలో రాష్ట్ర సెనేటర్
ముందుండి తన స్వరాన్ని వినిపిస్తున్నారు

292
00:25:35,869 --> 00:25:38,539
"వేర్పాటు పద్ధతి అనేది ఒక మైలురాయి"
అని అంటున్న స్థానిక అధికారి

293
00:25:40,123 --> 00:25:41,333
- బంగారం?
- ఏంటి?

294
00:25:43,377 --> 00:25:44,586
- ఆవిడ వచ్చేసింది.
- సరే.

295
00:25:49,633 --> 00:25:52,803
జాగ్రత్తగా చూసుకుంటూ రండి.
ఇటు వైపు రండి.

296
00:25:52,886 --> 00:25:56,306
- చాలా బాగుంది.
- రా, బంగారం. నా బంగారు కొండ

297
00:25:59,518 --> 00:26:00,811
సరే మరి.

298
00:26:02,729 --> 00:26:04,398
మీరు డెవన్ కదా!

299
00:26:04,481 --> 00:26:05,983
డెవన్, ఈవిడ మిసెస్ సెల్విగ్.

300
00:26:06,066 --> 00:26:09,236
హాయ్, అవును, మీరు మార్క్ పక్కింటావిడ కదా.
మమ్మల్ని కలవడానికి వచ్చినందుకు థ్యాంక్యూ.

301
00:26:09,319 --> 00:26:10,988
అది నా భాగ్యం అనుకోండి.

302
00:26:11,071 --> 00:26:13,740
మీరు ఒక ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారని
మార్క్ నాతో అన్నప్పుడు నేను ఎగిరి గంతేశాను.

303
00:26:13,824 --> 00:26:16,702
- ఎలాగైతేనే మంచే జరిగింది.
- అవును.

304
00:26:16,785 --> 00:26:18,245
వీడ్ పని చేసిందా?

305
00:26:18,912 --> 00:26:21,540
తను బుజ్జి ఎలెనోర్ కదా.

306
00:26:21,623 --> 00:26:23,542
హలో, ఎలెనోర్ బంగారం.

307
00:26:26,295 --> 00:26:28,589
- మీది మామూలు డెలివరీ కదా?
- అవును.

308
00:26:28,672 --> 00:26:30,632
పాలు ఇవ్వడానికి సంబంధించి
మనం వివిధ భంగిమల గురించి చర్చించుకుందాం.

309
00:26:30,716 --> 00:26:32,259
నేను మీకు ఇది తీసుకువచ్చాను.

310
00:26:33,343 --> 00:26:35,971
మీ చనుమొనల కోసం ఒక హెర్బల్ లోషన్.

311
00:26:36,054 --> 00:26:37,055
ఇది ఉచితమే.

312
00:26:37,556 --> 00:26:39,516
- మేము ఇంకొందరితో మాట్లాడుతూ ఉన్నాం.
- అవునులెండి.

313
00:26:39,600 --> 00:26:41,268
అయ్యో.

314
00:26:41,351 --> 00:26:42,936
- మన్నించు. మన్నించు.
- పర్వాలేదు.

315
00:26:43,020 --> 00:26:47,441
పర్వాలేదు బాధపడిపోకండి.
చంటి పిల్లలు అన్నాక ఏడుస్తారు.

316
00:26:47,524 --> 00:26:48,859
నేను ఎత్తుకోవచ్చా?

317
00:26:48,942 --> 00:26:49,943
అలాగే.

318
00:26:52,237 --> 00:26:54,156
అయ్యో, బంగారం.

319
00:26:54,239 --> 00:26:56,950
ఎత్తుకున్నాలే అమ్మా, ఎత్తుకున్నాలే.

320
00:27:25,145 --> 00:27:27,189
...ఏడు వందల ఒకటి,

321
00:27:27,856 --> 00:27:29,983
ఏడు వందల రెండు,

322
00:27:30,609 --> 00:27:32,945
ఏడు వందల నలభై మూడు,

323
00:27:33,737 --> 00:27:36,740
ఏడు వందల నలభై ఆరు,

324
00:27:36,823 --> 00:27:40,285
ఏడు వందల నలభై ఎనిమిది...

325
00:27:42,079 --> 00:27:43,121
డిలన్.

326
00:27:45,207 --> 00:27:47,793
నేను నీకు ఇంట్లో స్పృహ తెప్పించాను.
నువ్వు దాన్ని ఎక్కడ పెట్టావో చెప్పు.

327
00:27:48,836 --> 00:27:49,962
ఇంతకీ దేన్ని?

328
00:27:50,045 --> 00:27:51,797
ఓ&డీ నుండి నువ్వు తీసుకొన్న
బొమ్మలు ఉండే కార్డుని.

329
00:27:51,880 --> 00:27:53,632
నువ్వు దాన్ని తీసుకొన్నట్టు నేను కెమెరాలో చూశాను.

330
00:27:53,715 --> 00:27:55,843
దాన్ని బయటకు తెచ్చావా? అది ఇక్కడే ఉందా?

331
00:27:55,926 --> 00:27:57,469
అయ్య బాబోయ్, ఇది నా ఇల్లా?

332
00:27:57,553 --> 00:28:00,889
డిలన్, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ సమాచారం
ఎంత సున్నితమైనదో నువ్వు అస్సలు ఊహించలేవు.

333
00:28:01,974 --> 00:28:04,309
ఆ కార్డును దొంగచాటుగా బయటకు తీసుకురావడానికి
నీకు ఎవరైనా డబ్బులు ఇచ్చుంటే...

334
00:28:04,393 --> 00:28:06,436
లేదు, అలాంటిదేమీ లేదు. దాన్ని నేను...
బాత్రూమ్ లో ఉంచాను.

335
00:28:06,520 --> 00:28:08,146
టాయిలెట్ పక్కన ఉన్న రెండవ స్టాల్ లో.

336
00:28:08,230 --> 00:28:09,273
థ్యాంక్యూ.

337
00:28:09,356 --> 00:28:10,607
అసలు అదేంటో కూడా నాకు తెలీదు.

338
00:28:10,691 --> 00:28:12,359
- అది కూడా మంచిదే.
- నాన్నా.

339
00:28:13,026 --> 00:28:14,027
నాన్నా.

340
00:28:14,653 --> 00:28:16,280
ఏం... ఏంటి?

341
00:28:16,363 --> 00:28:19,950
వెయ్యి లెక్కించమని, బయటే ఉండమని
నీకు చెప్పాం కదా.

342
00:28:20,033 --> 00:28:21,201
వాడు నా కొడుకా?

343
00:28:22,411 --> 00:28:23,412
ఆపివేయండి.

344
00:28:23,495 --> 00:28:24,329
ఆన్ - ఆఫ్

345
00:28:29,334 --> 00:28:30,335
నాన్నా.

346
00:28:35,883 --> 00:28:36,884
పని అయిందా?

347
00:28:37,718 --> 00:28:38,719
అయింది.

348
00:28:48,395 --> 00:28:51,440
అయితే మనం...

349
00:28:52,024 --> 00:28:53,609
మనం ఇక బయలుదేరాలేమో.

350
00:28:55,819 --> 00:28:56,820
అవును.

351
00:29:02,451 --> 00:29:03,452
వావ్.

352
00:29:06,246 --> 00:29:07,456
తను జూన్.

353
00:29:07,539 --> 00:29:08,957
తలుపు రాత్రి తొమ్మిదికి డీజే ఆఫ్టర్ పార్టీ
సోమవారం

354
00:29:09,041 --> 00:29:12,127
హేయ్, ఇది ఇవాళే జరుగుతోంది.
చెప్పాలంటే, ఇప్పుడే జరుగుతోంది.

355
00:29:12,961 --> 00:29:15,756
మనం... మనం దీనికి వెళ్దామా?

356
00:29:16,590 --> 00:29:17,591
ఏంటది?

357
00:29:18,425 --> 00:29:21,887
ఇది ఒక బ్యాండ్ షో.
నాకు... నాకు వారిలో ఒకరు తెలుసు.

358
00:29:23,514 --> 00:29:24,973
బాగాలేకపోతే, వెళ్లిపోదాం.

359
00:29:25,474 --> 00:29:27,559
నీ ఉద్దేశం, అది మనంత బాగాలేకపోతే అనే కదా.

360
00:29:29,311 --> 00:29:30,312
అవును.

361
00:29:40,656 --> 00:29:44,076
ఇక్కడ ఉన్నా వాళ్ల మధ్య
నేను ముసలాడిలా ఉంటానేమో.

362
00:29:44,159 --> 00:29:46,995
నువ్వు యూత్ లానే ఉన్నావులే. కంగారుపడకు.

363
00:29:56,421 --> 00:29:59,299
హాయ్. రెండు బీర్లు ఇవ్వండి.

364
00:30:03,971 --> 00:30:04,972
హలో.

365
00:30:06,515 --> 00:30:07,516
థ్యాంక్యూ.

366
00:30:11,103 --> 00:30:16,358
హాయ్. నేడు ఈ సందులో సంగీతాన్ని ఎవరు
వాయిస్తున్నారు? అది పరమ చండాలంగా ఉంది.

367
00:30:16,441 --> 00:30:18,235
సరే అయితే ఇక విషయానికి వద్దాం.

368
00:30:30,330 --> 00:30:32,749
ఈ మధ్య నాకు పనిలో అంతా అయోమయంగా ఉంది

369
00:30:32,833 --> 00:30:35,794
నాకు అదోలా అనిపిస్తోంది
ఎందుకంట, ప్రతీరోజు అదే తంతు

370
00:30:35,878 --> 00:30:38,338
విరిగిన మనస్సు, తగ్గిన స్థైర్యం

371
00:30:39,047 --> 00:30:41,175
పిచ్చుక అగ్నిజ్వాలను కక్కుతుంది...

372
00:30:43,468 --> 00:30:44,553
వీడియో తీయకూడదురా, చచ్చినోడా.

373
00:30:44,636 --> 00:30:45,679
అలాగే, థ్యాంక్యూ.

374
00:30:45,762 --> 00:30:50,559
ఇదంతా నువ్వు జరిగేలా చేయవచ్చు
నా కంట్లోనే ఒక అందమైన ఆకాశాన్ని నిర్మించవచ్చు

375
00:30:50,642 --> 00:30:53,145
నాకు నువ్వంటే అసహ్యం, లూమన్
నువ్వు నా తొలి ప్రేమను లాగేసుకున్నావు

376
00:30:53,228 --> 00:30:55,981
లూమన్, నువ్వు నాశనమైపోవాలి
నీపై కోపం నాకు ఎన్నటికీ తగ్గదు

377
00:30:56,064 --> 00:30:59,693
నాతో పెట్టుకోవాలనుకుంటున్నావా
నీకు ఆ ఆలోచన రావడమే తప్పు

378
00:31:00,694 --> 00:31:02,321
లూమన్ నాశనమైపోవాలి!

379
00:31:03,238 --> 00:31:04,656
నాకు లూమన్ అంటే అసహ్యం!

380
00:31:06,450 --> 00:31:07,993
లూమన్ నాశనమైపోవాలి!

381
00:31:13,832 --> 00:31:16,543
నాకు నువ్వంటే అసహ్యం, లూమన్
నువ్వు నా తొలి ప్రేమను లాగేసుకున్నావు

382
00:31:16,627 --> 00:31:19,463
లూమన్, నువ్వు నాశనమైపోవాలి
నీపై కోపం నాకు ఎన్నటికీ తగ్గదు

383
00:31:19,546 --> 00:31:20,672
లూమన్ నాశనమైపోవాలి!

384
00:31:22,257 --> 00:31:24,092
నాకు లూమన్ అంటే అసహ్యం!

385
00:31:25,385 --> 00:31:27,429
లూమన్ నాశనమైపోవాలి!

386
00:31:27,513 --> 00:31:29,515
నాకు లూమన్ అంటే అసహ్యం!

387
00:31:29,598 --> 00:31:32,267
ఇక్కడ ఏం జరుగుతోంది?
ఇది చాలా దారునణమైనది.

388
00:31:32,935 --> 00:31:33,936
హాయ్.

389
00:31:34,895 --> 00:31:36,647
హేయ్, నేను...

390
00:31:36,730 --> 00:31:38,941
- మీ నాన్న సహోద్యోగిని.
- అవును.

391
00:31:41,443 --> 00:31:43,862
ఎలా ఉన్నావు?

392
00:31:49,743 --> 00:31:51,954
క్షమించు. ఈవిడ నా స్నేహితురాలు, ఆలెక్సా.

393
00:31:52,037 --> 00:31:53,705
ఈవిడ జూన్.

394
00:31:53,789 --> 00:31:56,041
- హేయ్. మీరు చాలా చక్కగా పాడారు.
- అవును.

395
00:31:56,124 --> 00:31:58,877
అవునా? మేము చాలా చండాలంగా చేశాం.

396
00:31:58,961 --> 00:32:00,671
చివరి పాట చాలా బాగుంది.

397
00:32:02,047 --> 00:32:04,091
- మనకి అనుభవమైనదే చెప్పాలి, అంతే కదా?
- అవును.

398
00:32:06,593 --> 00:32:08,428
మీ నాన్నకి ఖచ్చితంగా ఇది బాగా నచ్చి ఉండేది.

399
00:32:09,513 --> 00:32:10,931
- నిజంగా?
- అవును.

400
00:32:11,807 --> 00:32:13,600
ఆ విషయం అసలు నీకెలా తెలుసు?

401
00:32:13,684 --> 00:32:16,270
అయిపోయావు నువ్వు.

402
00:32:19,189 --> 00:32:20,858
మనం ఇక బయలుదేరితే మంచిది అనుకుంటా.

403
00:32:21,483 --> 00:32:22,568
అవును.

404
00:32:31,702 --> 00:32:32,953
అయితే...

405
00:32:35,372 --> 00:32:39,668
తను నా ఒకప్పటి సహోద్యోగి కూతురు.

406
00:32:40,169 --> 00:32:42,212
అతను చనిపోయాడు.

407
00:32:42,296 --> 00:32:47,092
అంతా... అంతా అయోమయంగానూ,
గందరగోళంగానూ ఉంది...

408
00:33:07,112 --> 00:33:08,113
హార్మనీ.

409
00:33:09,156 --> 00:33:10,240
నువ్వు తన ఆచూకీ కనుగొన్నావా?

410
00:33:10,324 --> 00:33:13,327
గాంజ్ కాలేజీలోని క్యాంపస్ పోలీసు
నాకొక విషయాన్ని చేరవేశాడు.

411
00:33:13,410 --> 00:33:15,913
తను... నువ్వు ఏంటి ఈ వేషంలో ఉన్నావు?

412
00:33:17,623 --> 00:33:20,459
నేను కొంత ప్రవైట్ రీసెర్చ్ చేశానులే.

413
00:33:21,293 --> 00:33:22,920
అంటే, నీ అసలైన ఉద్దేశం ఏంటి?

414
00:33:24,546 --> 00:33:26,048
డగ్, ఇవాళ నాకు అస్సలు ఓపిక లేదు.

415
00:33:27,090 --> 00:33:29,468
ఇంకా నాకు అర్థం కాని విషయమేమిటంటే,

416
00:33:29,551 --> 00:33:33,805
ఇదంతా నువ్వు ఫోన్ చేసి చెప్పి ఉండవచ్చు కదా.

417
00:33:34,389 --> 00:33:37,267
గాంజ్ కాలేజీకి చెందిన ఒకానొక పాత ల్యాబ్ భవనాల్లో
ఎవరో తలదాచుకొని ఉంటున్నారు.

418
00:33:37,351 --> 00:33:39,686
కానీ ఆ డీన్, సెక్యూరిటీ వాళ్ళకి
దాన్ని పట్టించుకోవద్దని చెప్పాడట.

419
00:33:40,521 --> 00:33:42,397
రెగాబీ అయ్యుండవచ్చు.

420
00:33:42,481 --> 00:33:43,732
తనే.

421
00:33:44,775 --> 00:33:46,235
నాతో పాటు వచ్చి, విషయమేంటో తెలుసుకుంటావా?

422
00:33:47,236 --> 00:33:49,279
లేదు.

423
00:33:50,030 --> 00:33:51,657
తనని పట్టుకున్నాక చెప్పు.

424
00:33:52,783 --> 00:33:55,244
ఈరాత్రి మెయింటెనన్స్ పనులు జరుగుతున్నాయి.

425
00:33:55,327 --> 00:33:56,745
అది మంచి పనే.

426
00:33:59,206 --> 00:34:02,501
అయితే, నువ్వు నర్సువా ఏంటి?

427
00:35:07,107 --> 00:35:08,817
బ్లాక్ చేయబడినది

428
00:35:16,617 --> 00:35:17,618
హలో?

429
00:35:18,869 --> 00:35:20,078
ఎవరు మీరు?

430
00:35:26,627 --> 00:35:28,003
పీటీ స్నేహితుడిని.

431
00:35:35,511 --> 00:35:39,681
హలో? మీరు... మీరు లైన్లో ఉన్నారా?

432
00:35:41,642 --> 00:35:42,893
మీరు మార్క్ స్కౌట్ ఆ?

433
00:35:48,941 --> 00:35:50,776
అతను చనిపోయే ముందు మీకు ఏం చెప్పాడు?

434
00:35:52,444 --> 00:35:53,779
ఏమీ చెప్పలేదు.

435
00:35:53,862 --> 00:35:55,364
నేను కేవలం...

436
00:35:57,032 --> 00:35:58,992
నేను... అర్థం...

437
00:36:01,578 --> 00:36:03,080
నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను.

438
00:36:06,792 --> 00:36:08,043
నన్ను ఇప్పుడు కలుసుకోగలరా?

439
00:36:21,098 --> 00:36:24,142
లూమన్

440
00:38:08,705 --> 00:38:09,831
ఒక్కరే వచ్చారా?

441
00:38:16,505 --> 00:38:18,006
అవును, నేను ఒక్కడినే వచ్చాను.

442
00:38:22,678 --> 00:38:24,596
నేను ఇదే స్కూల్ లో టీచర్ గా పని చేశాను.

443
00:38:24,680 --> 00:38:25,681
నాకు తెలుసు.

444
00:38:29,893 --> 00:38:30,894
ఎవరు మీరు?

445
00:38:36,275 --> 00:38:37,276
నాతో రండి.

446
00:40:14,039 --> 00:40:16,041
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

