1
00:00:12,554 --> 00:00:13,555
ఎవరు మీరు?

2
00:00:16,391 --> 00:00:17,809
నాతో రండి.

3
00:01:11,780 --> 00:01:14,950
పీటీ ఫోన్ ని మీరు ఎప్పుడో పారేసి ఉండవచ్చు.
కానీ అలా చేయలేదు, ఎందుకు?

4
00:01:15,033 --> 00:01:17,703
మన్నించాలి, కానీ... అసలు ఎవరు మీరు?

5
00:01:17,786 --> 00:01:19,621
మీ స్నేహితుడికి సాయపడిన వ్యక్తిని నేను.

6
00:01:20,539 --> 00:01:22,916
సాయమా? అంటే ఏకీకరణ చేయడం ద్వారానా?
దాని వల్లనే అతను చనిపోయాడు.

7
00:01:23,000 --> 00:01:25,002
పీటీ చనిపోయింది దాని వల్ల కాదు.

8
00:01:25,085 --> 00:01:27,004
చికిత్స తర్వాత పాటించమని నేను చెప్పిన సూచనలని

9
00:01:27,087 --> 00:01:29,631
పాటించి ఉంటే ఏమీ జరిగేదు కాదు, కానీ అతను
ఇలా జ్వరం తగిలిందో లేదో, వెంటనే పారిపోయాడు...

10
00:01:29,715 --> 00:01:31,341
అయితే, మీరు... డాక్టర్ ఆ?

11
00:01:33,594 --> 00:01:35,429
మీ తలలో ఆ చిప్ ని పెట్టిన వ్యక్తిని నేను,

12
00:01:35,512 --> 00:01:38,098
దాన్ని డీయాక్టివేట్ చేయగల
ఏకైక వ్యక్తిని కూడా నేనే.

13
00:01:46,648 --> 00:01:48,483
బహుశా దాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలని నాకు లేదేమో.

14
00:01:49,151 --> 00:01:52,070
అవును. కానీ మీ పని అవతారానికి కావలసింది అదేనేమో.

15
00:01:52,738 --> 00:01:56,533
దీన్నంతటి గురించి అతను ఏమనుకుంటున్నాడో,
అసలు ఆనందంగా ఉన్నాడో లేదో అని ఎప్పుడైనా ఆలోచించారా?

16
00:01:57,284 --> 00:02:00,537
నాకు ఆ "పని అవతారం" అనే పదమే నచ్చదు.
ఏదో మీరందరూ స్కూల్ పిల్లల్లాగా.

17
00:02:01,663 --> 00:02:04,291
అయినా మీపై వేర్పాటు పద్ధతి జరిగి రెండేళ్లేగా అయింది?

18
00:02:04,374 --> 00:02:06,668
అయితే మీ పని అవతారం నిజంగానే స్కూల్ పిల్లోడులే.

19
00:02:08,211 --> 00:02:13,717
నా పని అవతారానికి సొంతంగా ఒక జీవితం ఉంది,
ఆ కారణంగా, నేను నా జీవనం సాగించగలుగుతున్నాను.

20
00:02:15,093 --> 00:02:17,721
కానీ మీరు ఉన్నారు కాబట్టే అతను కూడా ఉన్నాడు.

21
00:02:17,804 --> 00:02:20,933
ఏ విధంగా చూసుకున్నా, అతను మీరూ ఒక్కటే.

22
00:02:23,810 --> 00:02:25,854
అతను అక్కడ వేరుగా ఉంటారని మీకు అనిపిస్తోందా?

23
00:02:26,688 --> 00:02:29,650
జుట్టు వేరేగా దువ్వుకుంటాడు, లేకపోతే
వేరే జోకులకు నవ్వుతాడు అనుకుంటున్నారా?

24
00:02:30,901 --> 00:02:32,986
మీరు అన్నట్టు అతనికి
అక్కడి జీవితం నచ్చే ఉండవచ్చు.

25
00:02:33,612 --> 00:02:35,030
నచ్చనూ ఉండకపోవచ్చు.

26
00:02:36,365 --> 00:02:40,410
బహుశా ప్రతిరోజూ దాని నుండి
ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నాడేమో.

27
00:02:42,538 --> 00:02:46,875
కానీ అది మీకు తెలీదు. ఎప్పటికీ తెలీదు.

28
00:02:49,294 --> 00:02:53,340
మీ స్వార్థం కోసం, భావావేశంగా మీరు బాగుండటానికి,
అతని అనుమతి లేకుండానే

29
00:02:54,132 --> 00:02:57,553
అతడిని ఆ నరకంలోకి వదిలేశారు.

30
00:03:01,807 --> 00:03:03,392
నేనేమీ చెడ్డ వాడిని కాదు.

31
00:03:04,393 --> 00:03:06,645
మీరు సరైన పనే చేయాలనుకుంటున్నారు అనుకుంటా.

32
00:03:08,438 --> 00:03:09,523
మీ ఇద్దరూ కూడా.

33
00:03:14,570 --> 00:03:15,737
మిస్టర్ స్కౌట్.

34
00:03:19,783 --> 00:03:21,118
ఎవరు మీరు?

35
00:03:21,201 --> 00:03:24,955
మనిద్దరం సహోద్యోగులం. ఆఫీసులో.

36
00:03:28,876 --> 00:03:31,170
ఎవరితో అయినా మాట్లాడుతున్నావా, మార్క్?

37
00:03:34,006 --> 00:03:36,717
పర్లేదులే. నేను స్నేహితుడిని అనుకొని చెప్పు.

38
00:03:38,218 --> 00:03:39,178
అయ్య బాబోయ్!

39
00:03:40,679 --> 00:03:42,181
ఏం చేస్తున్నారు మీరు?

40
00:03:46,226 --> 00:03:47,811
- వచ్చి చేతులు పట్టుకోండి.
- ఏంటి?

41
00:03:48,645 --> 00:03:50,439
రండి. చేతులు పట్టుకోండి.

42
00:03:54,943 --> 00:03:56,945
బాబోయ్. ఓరి నాయనోయ్.

43
00:03:57,696 --> 00:04:00,073
అయ్య బాబోయ్. ఓరి దేవుడా.

44
00:04:03,619 --> 00:04:05,829
అయ్యో. అయ్యయ్యో.

45
00:04:07,539 --> 00:04:08,624
నేను ఇతని సహోద్యోగిని.

46
00:04:08,707 --> 00:04:10,209
కాదు.

47
00:04:11,877 --> 00:04:15,547
ఇతని పేరు డగ్ గ్రేనర్.
ప్రత్యేకమైన అంతస్థులో ఇతను సెక్యూరిటీకి హెడ్.

48
00:04:15,631 --> 00:04:17,298
సెక్యూరిటీయా? చచ్చాన్రా దేవుడా.

49
00:04:18,007 --> 00:04:20,719
సరే, నాకు వికారంగా ఉంది, వాంతి వస్తోంది.

50
00:04:20,802 --> 00:04:24,223
- వాంతి వచ్చేస్తోంది.
- వద్దు! వద్దు!

51
00:04:24,306 --> 00:04:25,516
అందులో డీ.ఎన్.ఏ ఉంటుంది.

52
00:04:30,437 --> 00:04:33,774
ఇదుగో, గ్రేణర్ సెక్యూరిటీ కార్డ్.

53
00:04:33,857 --> 00:04:36,818
దీనితో మీరు ఎక్కడికైనా వెళ్లవచ్చు,
దీన్ని ఎవరికీ లింక్ చేయలేరు కూడా.

54
00:04:36,902 --> 00:04:39,655
రేఫు దీన్ని ఆఫీసుకు తీసుకువెళ్లండి,
దీనితో ఏం చేయాలో అతనికి తెలుస్తుంది.

55
00:04:40,322 --> 00:04:41,698
ఎవరికి?

56
00:04:41,782 --> 00:04:42,950
మీకే.

57
00:04:43,492 --> 00:04:48,121
నాకు పీటీ ఫోన్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి.

58
00:04:48,747 --> 00:04:50,165
ఈ శవం సంగతి నేను చూసుకుంటా.

59
00:04:51,542 --> 00:04:53,919
ఇంటికి వెళ్ళండి. మీ బట్టలను ఎక్కడైనా పారేయండి.

60
00:04:55,170 --> 00:04:56,171
వెంటనే వెళ్లిపోండి.

61
00:05:03,971 --> 00:05:07,015
నేను మిమ్మల్ని సంప్రదిస్తాను.
ఏమీ కాదు, మీరు వెళ్లిపోండి.

62
00:05:07,099 --> 00:05:09,184
పీటీ మొదలుపెట్టిన దాన్ని మనం ముగిద్దాం, మార్క్.

63
00:05:10,227 --> 00:05:11,895
ఇక ఇక్కడి నుండి వెళ్లిపోండి!

64
00:08:09,031 --> 00:08:10,866
- హేయ్.
- హేయ్.

65
00:08:10,949 --> 00:08:13,410
నీళ్లు తాగడానికి వచ్చానంతే. నీకేమైనా కావాలా?

66
00:08:13,994 --> 00:08:14,995
ఎక్కడికి వెళ్లిపోయావు?

67
00:08:15,829 --> 00:08:16,830
ఎవరు, నేనా?

68
00:08:17,456 --> 00:08:18,957
- అవును.
- కేవలం...

69
00:08:19,041 --> 00:08:20,292
నాకు కారు శబ్దం వినిపించింది.

70
00:08:22,920 --> 00:08:24,087
అవునా?

71
00:08:32,554 --> 00:08:33,679
నువ్వు వింతగా ప్రవర్తిస్తున్నావు.

72
00:08:36,475 --> 00:08:38,477
అది నీ కల ఏమో.

73
00:08:41,145 --> 00:08:43,398
నేను లేచి గంట అయింది, నువ్వు లేనే లేవు.

74
00:08:48,695 --> 00:08:49,988
సరే, అంటే...

75
00:08:52,074 --> 00:08:53,617
క్షమించు, నేను...

76
00:08:55,619 --> 00:08:58,789
నేను మనస్సు ప్రశాంతంగా ఉండటానికి
అలా బయటకు వెళ్లాను.

77
00:09:01,083 --> 00:09:02,209
నువ్వు బాగానే ఉన్నావా?

78
00:09:07,631 --> 00:09:11,301
అంటే, ఇది నాకు చాలా పెద్ద విషయం కదా. నాకు...

79
00:09:15,180 --> 00:09:16,890
నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇది...

80
00:09:22,062 --> 00:09:23,272
నేను వెళ్లిపోనా?

81
00:09:27,693 --> 00:09:28,694
అదే మంచిదేమో.

82
00:09:30,779 --> 00:09:31,905
అదే మంచిదేమో.

83
00:10:24,833 --> 00:10:26,210
నీ యెంకమ్మ.

84
00:10:28,754 --> 00:10:29,796
మార్క్!

85
00:10:30,422 --> 00:10:33,717
- హేయ్.
- ఇంత మంచులో పొద్దునే బయటకు వచ్చావే.

86
00:10:33,800 --> 00:10:38,180
మామూలుగా మధ్యాహ్నానికి ఇంకాసేపు ఉందనగా
చెత్తను వేస్తుంటావు.

87
00:10:38,263 --> 00:10:43,352
ఇవాళ కాస్త ముందుగానే
పని మొదలుపెట్టాను, అంతే.

88
00:10:44,853 --> 00:10:46,396
నిన్ను చూస్తే ఏదో కంగారుగా ఉన్నట్టున్నావు, మార్క్.

89
00:10:48,690 --> 00:10:53,529
దాని గురించి మనం వేడిగా టీ తాగుతూ
మాట్లాడుకుంటే బాగుంటుందేమో, ఏమంటావు?

90
00:10:54,738 --> 00:10:58,575
సరే. ఇవాళ ఎలా గడుస్తుందో చూస్తాను ముందు.

91
00:10:59,576 --> 00:11:03,747
ఇది మామూలు మంచు కాదురా నాయనోయ్.

92
00:11:21,932 --> 00:11:24,059
మ్యాక్రోడేటా రిఫైన్మెంట్

93
00:12:29,666 --> 00:12:30,751
బర్ట్ జీ.

94
00:12:31,418 --> 00:12:34,713
మిస్టర్ మిల్చెక్.
మిమ్మల్ని చూడటం బాగుంది, సర్.

95
00:12:34,796 --> 00:12:36,381
- ఇంత త్వరగా వచ్చారే.
- దయచేసి కూర్చోండి.

96
00:12:36,465 --> 00:12:37,466
థ్యాంక్యూ.

97
00:12:38,133 --> 00:12:39,676
నేను మీ కోసం ఒకటి తెచ్చాను.

98
00:12:40,594 --> 00:12:43,388
కనబడకుండా పోయిన 7199-జీ.

99
00:12:43,472 --> 00:12:47,267
ఆస్వాల్డ్ ఎగిరి గంతెస్తాడు.
నాకు కూడా అలానే ఉందనుకోండి.

100
00:12:47,351 --> 00:12:50,103
మంచిది. ఇప్పుడు మనం తుది సన్నాహాలపై
దృష్టి పెట్టవచ్చు కదా!

101
00:12:50,187 --> 00:12:52,189
- తప్పకుండా.
- ఏ ఆటంకాలు లేకుండా.

102
00:12:52,272 --> 00:12:54,316
- తప్పకుండా.
- సూపర్.

103
00:12:58,654 --> 00:13:00,447
- నేను చూడవచ్చా?
- తప్పకుండా.

104
00:13:06,453 --> 00:13:07,538
సూపర్.

105
00:13:07,621 --> 00:13:08,872
- అవును.
- వావ్.

106
00:13:10,290 --> 00:13:12,626
ఈ డిపార్టుమెంటుకు మీరు
ఒక గొప్ప నాయకునిగా పని చేశారు, బర్ట్ జీ.

107
00:13:12,709 --> 00:13:13,710
థ్యాంక్యూ.

108
00:13:13,794 --> 00:13:15,587
మీకు ఒక ప్రత్యేకమైన రివార్డ్ ఇవ్వాలి.

109
00:13:16,463 --> 00:13:20,008
బ్రేక్ రూమ్ కి తీసుకెళ్లకుంటే చాలు.

110
00:13:20,092 --> 00:13:21,802
నిన్న జరిగినదాని నుండే నేను ఇంకా కోలుకోలేదు.

111
00:13:25,389 --> 00:13:30,477
లేదు. అది కాదు. ఇది వేరేది.
ఎదురు చూస్తూ ఉండండి.

112
00:13:38,402 --> 00:13:41,363
డిలన్ జీ. శుభోదయం.

113
00:13:42,990 --> 00:13:44,116
ఏంటది?

114
00:13:44,658 --> 00:13:45,701
నాతో రా,

115
00:13:49,329 --> 00:13:52,124
నిన్న రాత్రి జరిగినదాన్ని
అత్యవసర సర్దుబాటు అని అంటాము.

116
00:13:52,791 --> 00:13:57,087
అప్పుడప్పుడూ ఉద్యోగులను బయట కూడా పని అవతారాలుగా
మార్చడానికి వీలు కల్పించే రక్షణాత్మక చర్య అది.

117
00:13:57,171 --> 00:13:59,214
మీరు అలా చేయగలరని మాకు ఎప్పుడూ చెప్పలేదే.

118
00:13:59,298 --> 00:14:00,757
అది కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడతాం.

119
00:14:01,592 --> 00:14:04,428
మిస్ కొబెల్ ఈ మధ్య చాలా ఒత్తిడిలో ఉన్నారు
కాబట్టి, నేను ఆమెకి కూడా ఇది చెప్పలేదు.

120
00:14:05,220 --> 00:14:08,307
ఆ పిల్లాడు. వాడు... వాడు నా కొడుకా?

121
00:14:12,561 --> 00:14:15,522
వాడు వెయ్యి లెక్కపెడతాను అన్నాడు,
కానీ పూర్తిగా లెక్కపెట్టకుండానే వచ్చేశాడు.

122
00:14:18,317 --> 00:14:22,029
ఇది నీ సహచరులకి చెప్పకపోవడమే మంచిది, డిలన్.

123
00:14:22,696 --> 00:14:26,408
ఈ ఓటీసీ చాలా రహస్యమైనది. అర్థమైందా?

124
00:14:31,163 --> 00:14:32,497
నాకు ఆ పిల్లాడి పేరు చెప్తావా?

125
00:14:34,958 --> 00:14:37,794
తెలియకపోవడమే మంచిది.

126
00:14:41,006 --> 00:14:43,675
హేయ్, ఈ త్రైమాసికం బాగా ఒత్తిడ్తితో
కూడుకున్నదని నేను అర్థం చేసుకోగలను.

127
00:14:44,426 --> 00:14:47,262
నీకు కొన్ని ప్రత్యేకమైన పెర్కులని
ఇప్పించే ఏర్పాట్లు చేస్తాను.

128
00:14:48,764 --> 00:14:49,932
ఏమంటావు?

129
00:14:55,437 --> 00:14:58,524
మంచి వాడివి, డిలన్. నువ్వు మంచి వాడివి.

130
00:15:52,953 --> 00:15:55,163
మార్క్ ఎస్. శుభోదయం.

131
00:15:56,373 --> 00:15:57,374
శుభోదయం.

132
00:16:02,129 --> 00:16:03,505
మరి, నన్ను నువ్వేమైనా...

133
00:16:03,589 --> 00:16:05,507
నేను నిన్ను నీ డెస్క్ దాకా తీసుకెళ్లడానికి వచ్చాను.

134
00:16:06,341 --> 00:16:07,426
ఇది కొత్త ప్రోటోకాల్.

135
00:16:09,261 --> 00:16:10,262
బాగానే ఉంది.

136
00:16:11,388 --> 00:16:12,389
అయితే ముందు పద మరి.

137
00:16:55,390 --> 00:16:56,767
ఏంటి, ఇప్పుడు మమ్మల్ని బంధించి ఉంచుతున్నారా?

138
00:16:56,850 --> 00:16:59,394
"సురక్షిత ప్రదేశం" అని అంటే బాగుంటుంది.

139
00:17:00,187 --> 00:17:04,566
ఇవి ఉండటం వలన మీరు మీ డెస్కుల వద్దనే చక్కగా
పని చేసుకుంటున్నారని మాకు భరోసాగా ఉంటుంది.

140
00:17:04,650 --> 00:17:06,401
ఇలా చేయమని మిస్టర్ గ్రేనర్ చెప్పారా?

141
00:17:08,987 --> 00:17:10,364
మార్క్ ఎస్ వచ్చేశాడు.

142
00:17:10,446 --> 00:17:11,448
కూర్చో.

143
00:17:11,990 --> 00:17:14,742
- నేను...
- బ్లాక్ కాఫీయే కదా. నేను తెస్తానులే.

144
00:17:15,285 --> 00:17:16,286
శుభోదయం, మార్క్.

145
00:17:17,454 --> 00:17:18,955
- శుభోదయం.
- శుభోదయం.

146
00:17:20,540 --> 00:17:21,791
మార్క్, ఏంటి ఇదంతా?

147
00:17:26,630 --> 00:17:27,631
ఎలా ఉన్నావు, అర్వ్?

148
00:17:27,714 --> 00:17:29,842
బాగానే ఉన్నా, థ్యాంక్యూ. నేను...

149
00:17:29,925 --> 00:17:33,262
ఈ మార్పులు... చాలా బాగున్నాయి.

150
00:17:33,345 --> 00:17:34,763
అవును.

151
00:17:34,847 --> 00:17:35,973
డిలన్, నువ్వు బాగానే ఉన్నావా?

152
00:17:36,765 --> 00:17:37,975
బాగానే ఉన్నాను.

153
00:17:38,517 --> 00:17:42,312
ఏంటి ఇలా జవాబు ఇస్తున్నావు?
మామూలుగా అయితే పంచ్ వేస్తావు కదా?

154
00:17:44,731 --> 00:17:47,860
ఇదుగో. చక్కగా చేసుకొని తీసుకొని వచ్చాను.

155
00:17:51,113 --> 00:17:52,114
థ్యాంక్స్.

156
00:17:57,411 --> 00:18:00,789
హేయ్, నేను. మీకు తెలుసో లేదో కానీ,
గ్రేనర్ ఇంకా రాలేదు.

157
00:18:00,873 --> 00:18:03,375
అంతా బాగానే ఉంది,
మీరు ఎక్కడ ఉన్నారా అని ఆలోచిస్తున్నా.

158
00:18:06,837 --> 00:18:10,299
నా శరీరాన్ని కాస్త ముందుకు ఇలా ఒంచి,

159
00:18:10,382 --> 00:18:13,135
పాప మెడను మెల్లగా ఇలా పట్టుకోవాలి.

160
00:18:15,304 --> 00:18:19,474
మెల్లగా శ్వాస విడవాలి. సన్నని గాలి మాత్రమే విడుదలయ్యేలా.

161
00:18:20,225 --> 00:18:23,645
ఆ తర్వాత ఇలా చేయాలి, ఆపై ఇలా చేయాలి.

162
00:18:24,313 --> 00:18:29,109
పాపకి చనుమొనలు కనిపించేలా చేయాలి,
ఆ తర్వాతా గుటగుటా తాగేస్తుంది, అంతే.

163
00:18:30,611 --> 00:18:31,862
ఇప్పుడు మీరు ప్రయత్నించి చూడండి.

164
00:18:33,155 --> 00:18:34,156
సరే.

165
00:18:34,781 --> 00:18:36,825
నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్దమేనా, బంగారం?

166
00:18:38,660 --> 00:18:39,703
సరే.

167
00:18:40,787 --> 00:18:44,541
- చనుమొనలను పాపకి చూపండి.
- అలాగే.

168
00:18:44,625 --> 00:18:47,961
- తను...
- తాగేస్తోంది.

169
00:18:48,045 --> 00:18:51,298
- అంతే, ఎలెనోర్, అంతే! సూపర్!
- ఓరి దేవుడా.

170
00:18:52,216 --> 00:18:56,178
పాప తాగేస్తోంది, తాగేస్తోంది.

171
00:18:59,389 --> 00:19:05,270
తర్వాత తను విమానశ్రయంలో ఉండే రెస్ట్ రూమ్ కి
వెళ్లి, చేత్తో పిండాలని చూస్తుంది.

172
00:19:06,313 --> 00:19:11,193
తను టాయిలెట్ లోకి వెళ్లి
టాయిలెట్ పేపర్ పై పిండాలనుకుంటుంది,

173
00:19:11,276 --> 00:19:14,112
కానీ అవి చుట్టూరా పడిపోతాయి.

174
00:19:14,196 --> 00:19:17,199
- చాలా వేగంగా వస్తున్నాయన్నమాట.
- అయ్యయ్యో!

175
00:19:19,159 --> 00:19:20,160
ఇక ఆపండి.

176
00:19:21,245 --> 00:19:25,999
ఓరి దేవుడా. నాకు సాయపడినందుకు థ్యాంక్స్.

177
00:19:27,584 --> 00:19:29,336
మీరు అంగడికి వెళ్లాలని అన్నట్టున్నారు?

178
00:19:30,087 --> 00:19:34,591
నేను లేకుండానే చూసుకోగలరులే.
ఇక్కడ నాకు భలే సరదాగా ఉంది.

179
00:19:34,675 --> 00:19:38,470
అదీగాక, ఇక్కడ మిమ్మల్ని చూసుకోవడానికి

180
00:19:38,554 --> 00:19:40,639
ఆయాలు, పని మనుషులు ఎవరూ లేరు కదా?

181
00:19:40,722 --> 00:19:41,723
అది నిజమే.

182
00:19:45,936 --> 00:19:48,230
పురుడు పోసే రిసార్టులో
నాకొక సంపన్న మహిళ పరిచయం అయింది.

183
00:19:48,814 --> 00:19:50,941
తన భర్త రాష్ట్ర సెనేటర్ అనుకుంటా.

184
00:19:51,024 --> 00:19:52,317
వావ్.

185
00:19:52,401 --> 00:19:56,780
నాకు తెలుసు, కానీ కొన్ని రోజుల తర్వాత
మళ్లీ పార్కులో తనని కలిశాను,

186
00:19:56,864 --> 00:19:59,116
అప్పుడు తను నన్ను అస్సలు గుర్తుపట్టనే లేదు,
భలే వింతగా అనిపించింది.

187
00:19:59,700 --> 00:20:01,201
అది అస్సలు మంచి విషయమే కాదు.

188
00:20:01,994 --> 00:20:02,995
అవును.

189
00:20:04,621 --> 00:20:08,333
అంటే... ఏమో మరి.
ఇది పిచ్చిగా అనిపించవచ్చు.

190
00:20:11,295 --> 00:20:16,049
మార్క్ పని చేసే సంస్థ, లూమన్ వాళ్లు, తాము
కేవలం పని కోసమే వేర్పాటు పద్దతి జరుపుతామంటారు.

191
00:20:16,800 --> 00:20:20,053
కానీ నాకేం ఆలోచన వచ్చిందంటే,
ఒకవేళ ఎవరికైనా...

192
00:20:21,597 --> 00:20:24,641
అంటే, ఎవరికైనా బిడ్డ కావాలనిపించి,
కానీ వాళ్లకి ఒకవేళ...

193
00:20:26,727 --> 00:20:27,728
ఏమో మరి.

194
00:20:30,898 --> 00:20:33,901
నేను అయితే వాడు
మహేష్ బాబు అయినా పట్టించుకోనులే.

195
00:20:33,984 --> 00:20:35,569
అతనికి బిడ్డని కనిస్తే అదే చాలు, కాబట్టి...

196
00:20:37,237 --> 00:20:38,238
అవును.

197
00:20:43,619 --> 00:20:44,703
వేర్పాటు పద్ధతి జరిపించుకోవడం.

198
00:20:46,788 --> 00:20:48,665
మార్క్ అసలు అలా ఎందుకు చేయించుకున్నాడు?

199
00:20:50,375 --> 00:20:53,670
తన భార్య చనిపోయిన వెంటనే అలా చేయించుకున్నాడు.

200
00:20:56,590 --> 00:20:59,676
మొదట్లో, కాలేజీలో టీచర్ గా చేరాడు,
కానీ అది చేయలేకపోయాడు.

201
00:21:02,387 --> 00:21:04,139
అసలు ఆమె గురించి ఎప్పుడైనా మాట్లాడతాడా?

202
00:21:04,890 --> 00:21:06,141
పెద్దగా ఏమీ మాట్లాడడు.

203
00:21:07,976 --> 00:21:11,313
నా భర్త చనిపోయినప్పుడు,
ఎక్కడ చూసినా నాకు ఆయనే కనిపించేవాడు.

204
00:21:11,396 --> 00:21:13,565
అప్పుడు చాలా కష్టంగా అనిపించేది.

205
00:21:15,734 --> 00:21:17,736
మార్క్ కి కూడా అలాగే ఆమె కనిపించేదా?

206
00:21:25,410 --> 00:21:27,079
శ్రేష్ఠత
33% పూర్తి అయింది

207
00:21:31,500 --> 00:21:32,501
హేయ్.

208
00:21:33,544 --> 00:21:34,545
హేయ్.

209
00:21:34,628 --> 00:21:36,505
- నేను ఇప్పుడే బాత్రూమ్ నుండి వస్తున్నాను.
- అవునా?

210
00:21:36,588 --> 00:21:40,926
అవును. సోప్ లేబుల్స్ ఏవీ లేవు ఏంటి?

211
00:21:41,802 --> 00:21:42,928
- సోప్ లేబుల్స్ ఆ?
- అవును.

212
00:21:43,011 --> 00:21:48,058
సోప్ డిస్పెన్సర్స్ మీద "సోప్" అని ఉండాలి కదా?

213
00:21:48,767 --> 00:21:49,768
అలా ఎప్పుడూ మనం పెట్టలేదు కదా.

214
00:21:50,727 --> 00:21:51,937
అది సోప్ అని అందరికీ తెలిసిందే కదా.

215
00:21:53,981 --> 00:21:56,233
ఇది ఓ&amp;డీ వాళ్లని అడగాల్సిన ప్రశ్న అనుకుంటా.

216
00:21:56,316 --> 00:21:59,987
అర్వ్, మనం ఎక్కడికీ వెళ్లకూడదని నీకు తెలుసు కదా.

217
00:22:00,070 --> 00:22:01,947
బర్ట్ విషయంలో నీకు ఆందోళనగా ఉందని నాకు తెలుసు.

218
00:22:03,490 --> 00:22:06,994
అక్కడికి మనం వెళ్లిన కారణంగా,
అతడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారేమో?

219
00:22:07,077 --> 00:22:08,954
నిజంగానే తీసుకుంటున్నారేమో,
అంతా తమరి చలవే కదా.

220
00:22:10,080 --> 00:22:12,249
అసలు మొదట్నుంచీ అక్కడికి వెళ్లడం మంచిది కాదని

221
00:22:12,332 --> 00:22:15,502
అరిగిపోయిన రికార్డర్ లా నీకు చెప్తూనే ఉన్నాను.

222
00:22:17,171 --> 00:22:19,298
శుభోదయం, రిఫైనర్లారా!

223
00:22:20,299 --> 00:22:21,633
ఏంటిది?

224
00:22:23,343 --> 00:22:24,678
సంగీత నృత్య కార్యక్రమం.

225
00:22:25,345 --> 00:22:27,222
తనకి 75% వచ్చిందా?

226
00:22:32,769 --> 00:22:35,272
హెల్లీ ఆర్, ముందుకు రండి.

227
00:22:36,982 --> 00:22:38,066
సంగీత నృత్య కార్యక్రమమా?

228
00:22:38,150 --> 00:22:42,112
సియానాలో 75 శాతానికి చేరుకోవడం ద్వారా,
నువ్వు, నీకు అలాగే నీ సహచరులకు

229
00:22:42,196 --> 00:22:47,910
అయిదు నిమిషాల పాటు సంగీత నృత్య కార్యక్రమంలో
పాల్గొనే అవకాశం అందించావు.

230
00:22:48,785 --> 00:22:52,915
మిస్టర్ మిల్చెక్, తను ఇప్పుడు 73 శాతం వద్దనే ఉంది.

231
00:22:54,041 --> 00:22:56,126
అవును, కానీ ఈ రోజు ఉదయం నుండి
అందరికీ ఇబ్బందిగానే ఉంది.

232
00:22:56,835 --> 00:22:59,129
- నీకేం ఇబ్బంది వచ్చి పడింది?
- ఈ సమయంలో కాస్తంత సరదాగా గడిపితే

233
00:22:59,213 --> 00:23:01,215
అందరికీ ఊరటగా ఉంటుంది అనుకున్నా.

234
00:23:01,798 --> 00:23:04,718
హెల్లీ, దయచేసి
సంగీత నృత్య కార్యక్రమం బండి దగ్గరకి రా.

235
00:23:06,803 --> 00:23:09,139
ఒక శైలిని, ఒక పరికరాన్ని నువ్వు తీసుకోవచ్చు.

236
00:23:09,223 --> 00:23:10,682
సంగీత పారవశ్యం
(ఒకటి ఎంచుకోండి)

237
00:23:10,766 --> 00:23:12,017
బాడీ ఫంక్
బైన్సీ స్వింగ్

238
00:23:15,145 --> 00:23:18,357
మరాకాని ఎంచుకున్నావా. సూపర్.

239
00:23:18,440 --> 00:23:20,776
చిడతలను ఎంచుకొని ఉండాల్సింది.

240
00:23:22,069 --> 00:23:25,405
నేను "డిఫయంట్ జాజ్" సంగీతాన్ని ఎంచుకుంటున్నాను.

241
00:23:26,698 --> 00:23:29,034
ఈ కార్యక్రమం హెల్లీకి గుర్తింపుగా జరిగేదే అయినా

242
00:23:29,117 --> 00:23:32,871
మీరందరూ కూడా ఈ అవకాశాన్ని
సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

243
00:23:46,260 --> 00:23:47,261
వావ్.

244
00:23:48,804 --> 00:23:49,805
సరే మరి.

245
00:23:56,061 --> 00:23:57,062
చీర్స్.

246
00:23:57,771 --> 00:23:58,897
నాకు కంగారుగా ఉంది!

247
00:24:20,127 --> 00:24:21,378
కానివ్వు, మార్క్.

248
00:24:42,274 --> 00:24:44,193
అర్వింగ్, మరి నీ సంగతేంటి?
నీ ప్రతిభ చూపించు.

249
00:25:29,905 --> 00:25:32,699
నాన్నా. నాన్నా. నాన్నా.

250
00:25:38,956 --> 00:25:42,209
- వాడి పేరేంటి? నాకు వాడి పేరు చెప్పు!
- డిలన్! పైకి లేయ్!

251
00:25:42,292 --> 00:25:43,293
వీడిని లేపండి!

252
00:25:46,255 --> 00:25:48,757
- నన్ను కొరుకుతున్నాడు!
- డిలన్, ఏం చేస్తున్నావు!

253
00:25:48,841 --> 00:25:52,219
- బాబోయ్! డిలన్! లేయ్, డిలన్!
- నన్ను కొరికేస్తున్నాడు!

254
00:26:03,313 --> 00:26:04,523
చర్మం ఊడి వచ్చేలా కొరికాడు.

255
00:26:05,107 --> 00:26:07,234
అతనికి సెప్టిక్ ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుంది.

256
00:26:10,112 --> 00:26:13,407
ఇది సరైన ప్రవర్తన కాదు, డిలన్,
నేను దీన్ని మిస్ కొబెల్ కి ఫిర్యాదు చేస్తాను.

257
00:26:14,199 --> 00:26:15,868
అవునా, తోడుగా నన్ను కూడా రమ్మంటావా?

258
00:26:30,132 --> 00:26:33,260
సంగీత నృత్య కార్యక్రమాన్ని అధికారికంగా
రద్దు చేస్తున్నాను.

259
00:26:46,231 --> 00:26:47,691
అసలు నీకేమైంది?

260
00:26:48,483 --> 00:26:49,735
వాళ్లు మనల్ని ఎప్పుడైనా
పని అవతారాలుగా మార్చగలరు.

261
00:26:50,694 --> 00:26:51,778
ఏంటి?

262
00:26:52,946 --> 00:26:55,949
ఆఫీసు బయట ఉన్నా కూడా,
దాన్ని అత్యవసర సర్దుబాటు అని పిలుస్తారు.

263
00:26:56,783 --> 00:26:58,118
నువ్వు ఏం అంటున్నావు?

264
00:26:58,869 --> 00:27:00,954
నిన్న రాత్రి, నేను లిఫ్ట్ ఎక్కాక,

265
00:27:01,038 --> 00:27:04,583
నేను మిల్చెక్ తో మా ఇంట్లో మేలుకున్నాను.

266
00:27:05,709 --> 00:27:06,710
ఏంటి?

267
00:27:09,338 --> 00:27:10,547
నేను నా కొడుకుని చూశాను.

268
00:27:16,637 --> 00:27:17,846
వాడు వచ్చి నన్ను హత్తుకున్నాడు.

269
00:27:19,348 --> 00:27:21,183
నన్ను చూసి చాలా సంతోషపడ్డాడు.

270
00:27:23,560 --> 00:27:26,230
ఆ తర్వాత మిల్చెక్ వాడిని లాగేశాడు,
అంతటితో అయిపోయింది.

271
00:27:28,315 --> 00:27:31,109
అది చాలా వేగంగా గడిచిపోయింది, ఇంకా
గుర్తు తెచ్చుకోవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను.

272
00:27:31,193 --> 00:27:34,321
- బాబోయ్, డిలన్. నాకు బుర్ర పని చేయట్లేదు.
- అవును, అది న్యాయం కాదు.

273
00:27:35,280 --> 00:27:38,075
ఇప్పట్నుంచీ రోజూ ఇక్కడ ఆ జ్ఞాపకాలు
నా మెదడులో తిరుగుతూనే ఉంటాయి.

274
00:27:38,158 --> 00:27:39,660
వాడిని చూసే అవకాశం నాకు ఎప్పటికీ దక్కదు కూడా.

275
00:27:39,743 --> 00:27:41,995
అతను నీ కొడుకు కాదు, డిలన్.
అతను నీ పనియేతర అవతారం యొక్క కొడుకు.

276
00:27:42,079 --> 00:27:44,957
తొక్కేం కాదు. వాడు నా కొడుకే.

277
00:27:46,083 --> 00:27:48,877
ఇది మంచిదే. దీన్ని మనం వాడుకోవచ్చు.

278
00:27:48,961 --> 00:27:50,212
ఏంటి?

279
00:27:50,295 --> 00:27:51,839
వీళ్ళు మనల్ని బయట, పని అవతారాలుగా మార్చగలరు కదా,

280
00:27:51,922 --> 00:27:54,132
అంటే ఆ పని మనపై మనం కూడా చేసుకోవచ్చు కదా?

281
00:27:54,216 --> 00:27:55,884
నువ్వు ఏమంటున్నావు?

282
00:27:56,802 --> 00:28:00,597
మనల్ని నియత్రించడానికి వాళ్లు ఉపయోగించే దాన్ని
మనం కనిపెట్టి, దాన్ని మనం నియంత్రించవచ్చు.

283
00:28:02,057 --> 00:28:04,393
మనందరం బయట లోకాన్ని చూడవచ్చు,
మనమెవరమో తెలుసుకోవచ్చు.

284
00:28:04,476 --> 00:28:07,896
కానీ, హెల్లీ, అది మంచి పని కాదు.
మనం పని అవతారాలం.

285
00:28:07,980 --> 00:28:11,900
అదీగాక, ఆ కంట్రోల్స్ ఉండే చోటుకు
మనం వెళ్లే అవకాశం అస్సలు లేదు.

286
00:28:13,110 --> 00:28:14,862
నువ్వు సెక్యూరిటీ ఆఫీసు గురించి మాట్లాడుతున్నావా?

287
00:28:16,864 --> 00:28:18,115
అది...

288
00:28:18,198 --> 00:28:19,408
గ్రేనర్ కీ కార్డు ఆ?

289
00:28:20,075 --> 00:28:22,119
- ఇది నీకు ఎక్కడిది?
- సంగీత నృత్య కార్యక్రమం

290
00:28:22,202 --> 00:28:23,787
జరుగుతున్నప్పుడు, ఇది నా జేబులో
ఉన్నట్టు గుర్తించా.

291
00:28:23,871 --> 00:28:27,624
నేను ఇవాళ ఆఫీసుకు వచ్చేటప్పుడు
ఇది నా దగ్గరే ఉండింది అనుకుంటా.

292
00:28:27,708 --> 00:28:30,294
మన సెక్యూరిటీ హెడ్ కి సంబంధించిన
కీ కార్డ్ నీ పనియేతర అవతారం దగ్గర ఎందుకు ఉంది?

293
00:28:34,631 --> 00:28:35,757
ఏమో, నాకూ తెలీదు.

294
00:28:40,137 --> 00:28:42,055
మనం ఇప్పుడు అలా బయటకు వెళ్లాలి అనుకుంటా.

295
00:28:42,639 --> 00:28:45,142
సెక్యూరిటీ గార్డులందరూ పని చేసే సెక్యూరిటీ ఆఫీసుకా?

296
00:28:45,225 --> 00:28:46,226
అది అదిరిపోతుంది. అవును.

297
00:28:46,310 --> 00:28:49,188
సెక్యూరిటీ గార్డులు ఉన్నారో లేదో ఎవరికి తెలుసు?
నేను గ్రేనర్ ని తప్ప ఇంకెవరినీ చూడలేదు.

298
00:28:49,271 --> 00:28:52,024
- మరి మిల్చెక్ సంగతేంటి?
- వాడు ఒకేసారి అన్నిచోట్లా ఉండలేదు కదా.

299
00:28:52,107 --> 00:28:54,860
- అసలు మీరందరూ మాట్లాడేది పద్ధతిగా...
- ఆ ఆఫీసు ఎక్కడ ఉందో నీకు తెలుసా?

300
00:28:55,861 --> 00:28:58,530
గతేడాది ఫైర్ అలారం డ్రిల్ జరిగినప్పుడు
దాన్ని పీటీ చూశాడు. నాకు కూడా చూపాడు.

301
00:29:02,201 --> 00:29:03,577
ఈ పని మనం చేయగలం.

302
00:29:07,539 --> 00:29:08,957
స్టోరేజ్
గది

303
00:29:15,672 --> 00:29:18,091
చూడు, ఒకవేళ మిల్చెక్ కానీ వస్తే, వాడిని అడ్డుకో.

304
00:29:18,175 --> 00:29:19,343
- నేను చూసుకుంటాలే.
- సరే.

305
00:29:32,481 --> 00:29:34,024
ఇది పని చేయాలనే కోరుకుందాం.

306
00:29:46,787 --> 00:29:48,247
ఇంకా సైనికులు ఎవరూ రాలేదు.

307
00:29:48,914 --> 00:29:51,500
సరే మరి, మనం పర్పెటువిటీ వింగ్ ని
దాటిపోవాలి, కాబట్టి...

308
00:29:51,583 --> 00:29:52,584
అర్వింగ్.

309
00:29:52,668 --> 00:29:53,752
నన్ను మన్నించు, మార్క్.

310
00:29:53,836 --> 00:29:56,380
- ఎక్కడికి వెళ్తున్నావు?
- బర్ట్ ఎలా ఉన్నాడో నాకు తెలియాలి.

311
00:29:56,463 --> 00:29:57,589
మరి మన ప్లాన్ సంగతేంటి?

312
00:29:57,673 --> 00:30:00,551
నన్ను... నన్ను క్షమించు, మార్క్ నీ మాటలు
నాకు వినిపించడం లేదు! నేను వెంటనే వచ్చేస్తాను!

313
00:30:01,218 --> 00:30:02,636
- అసలు...
- ఏంటి?

314
00:30:05,556 --> 00:30:06,557
సరే.

315
00:30:33,584 --> 00:30:34,793
ఇదే.

316
00:31:16,001 --> 00:31:17,753
ఇది చాలా విచిత్రంగా ఉంది.

317
00:31:27,012 --> 00:31:28,305
అది ఇక్కడ ఉంది.

318
00:31:38,232 --> 00:31:39,566
ఓరి దేవుడా.

319
00:31:42,653 --> 00:31:45,364
ఎండిఆర్ అర్వింగ్. బీ - ఎండిఆర్ డిలన్. జీ
ఎండిఆర్ హెల్లీ. ఆర్ - ఎండిఆర్ మార్క్. యస్

320
00:31:45,447 --> 00:31:47,032
చూడు, ఇవి మన పేర్లే.

321
00:31:48,909 --> 00:31:50,786
దాని పేరేంటి? అత్యవసరం అని ఏదో ఉండాలి కదా?

322
00:31:50,869 --> 00:31:51,995
అత్యవసర సర్దుబాటు.

323
00:31:52,621 --> 00:31:54,331
సర్వర్ హెల్త్ మానిటర్

324
00:31:56,416 --> 00:31:58,126
సెక్యూరిటీ ఆఫీసు ప్రోటోకాల్
క్విక్ స్టార్ట్ గైడ్లు

325
00:31:58,210 --> 00:31:59,545
అయ్యయ్యో.

326
00:32:02,172 --> 00:32:04,383
లిఫ్టులో కిందికి వస్తోంది
కొబెల్

327
00:32:08,345 --> 00:32:10,055
- అయ్యయ్యో.
- ఏమైంది?

328
00:32:14,309 --> 00:32:15,602
కొబెల్.

329
00:32:15,686 --> 00:32:16,854
తను ఇక్కడికి రాదులే.

330
00:32:17,646 --> 00:32:19,106
అత్యవసర సర్దుబాటు ప్రోటోకాల్

331
00:32:19,189 --> 00:32:21,441
అబ్బో, అది నీకెలా తెలుసు?
ఇక్కడి నుండి దొబ్బేద్దాం పద.

332
00:32:35,205 --> 00:32:36,456
హార్మనీ, నేను నీ కోసమే వెతుకుతున్నా.

333
00:32:36,540 --> 00:32:38,458
- ఇప్పుడు నాకు తీరిక లేదు...
- బోర్డు కూడా ఉంది.

334
00:32:39,501 --> 00:32:40,669
ఇప్పుడా?

335
00:32:41,295 --> 00:32:42,504
డగ్ గ్రేనర్ చనిపోయాడు.

336
00:32:46,425 --> 00:32:47,426
ఏంటి?

337
00:32:48,427 --> 00:32:50,345
బోర్డు ఇది చాలా పెద్ద విషయమని భావిస్తోంది.

338
00:32:51,138 --> 00:32:53,557
అతను కనిపించడం లేదని నీకు తెలుసో లేదో,
నువ్వు పోలీసులతో ఏవైనా మాట్లాడావో లేదో

339
00:32:53,640 --> 00:32:55,058
బోర్డు తెలుసుకోవాలనుకుంటోంది.

340
00:32:58,187 --> 00:33:00,522
పీటర్ కిల్మర్ పై ఏకీకరణ ప్రక్రియ జరిపినవారే

341
00:33:00,606 --> 00:33:03,942
మిస్టర్ గ్రేనర్ ని కూడా చంపి ఉంటారు.

342
00:33:07,946 --> 00:33:09,615
ఏకీకరణ అనేది అసంభవమని
బోర్డు నీకు మరొక్కసారి గుర్తు...

343
00:33:09,698 --> 00:33:13,368
ఏకీకరణ జరిగింది. దాన్ని నిరూపించడానికి
నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది.

344
00:33:13,952 --> 00:33:18,999
ఇంకా, నా దగ్గర ఉన్న సాక్ష్యాలను
మధ్యలో బ్రోకర్స్ తో కాకుండా

345
00:33:19,082 --> 00:33:21,251
నేరుగా మీకే చూపాలనుకుంటున్నాను.

346
00:33:28,342 --> 00:33:29,510
బోర్డు ఒప్పుకుంది...

347
00:33:33,180 --> 00:33:36,725
...వచ్చే వారం జరగబోయే ఈగన్ కుటుంబ పార్టీ
సమయంలో నిన్ను కలుసుకుంటారు,

348
00:33:36,808 --> 00:33:40,062
అప్పుడు మరింతగా నీతో చర్చిస్తారు.
మరిన్ని వివరాలు తర్వాత తెలియజేస్తారు.

349
00:33:50,614 --> 00:33:52,824
వాటి కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను.

350
00:34:29,987 --> 00:34:33,489
అయితే, అక్కడ ఎవరూ లేరా?
అది చాలా వింతగా ఉందే.

351
00:34:34,449 --> 00:34:37,452
మనం నిరంతర పర్యవేక్షణలో ఉన్నామని
మనం అనుకుంటుంటాం కదా, వాళ్లకి అది చాలేమో.

352
00:34:37,536 --> 00:34:40,246
ఇక్కడ అంతా దారుణంగా ఉంటుందని మీకు
ఎవరూ చెప్పకపోవడం నిజంగానే బాధాకరమైన విషయం.

353
00:34:40,330 --> 00:34:42,081
- నీకు అది అర్థమవుతోందా?
- అవుతోంది.

354
00:34:42,666 --> 00:34:45,335
కొన్ని సూచనలు ఉన్నాయి,
అన్నీ చాలా తేలిగ్గా ఉన్నాయిలే.

355
00:34:45,418 --> 00:34:47,713
ట్రాక్ బాల్ ని ఆన్ చేసి, కోడును టైప్ చేసి,

356
00:34:47,795 --> 00:34:50,340
ఆ తర్వాత స్విచ్ నొక్కి, టైప్ చేసి, తిప్పి,

357
00:34:50,424 --> 00:34:52,176
- టైప్ చేసి, అలాగే ఉంచాలి.
- ఏంటి?

358
00:34:54,261 --> 00:34:57,639
ట్రాక్ బాల్, టైప్, స్విచ్,
టైప్, తిప్పాలి, టైప్, అలాగే ఉంచాలి. అంతే.

359
00:34:58,682 --> 00:34:59,808
ఏంటి?

360
00:34:59,892 --> 00:35:03,562
నేను తెలివిమంతుడిని. అందుకే కదా
నాకు మీకన్నా మూడింతలు ఎక్కువ పెర్కులు దక్కింది.

361
00:35:04,146 --> 00:35:07,149
కానీ ఇది చెయాలంటే, మనలో ఒకరు
ఇక్కడే ఉండాలి, కదా?

362
00:35:07,232 --> 00:35:10,360
అవును, పని అయ్యాక. నేను ఉంటాలే. నాకు ఒకసారి
ఎలాగూ జరిగింది కాబట్టి, అదే న్యాయం కూడా.

363
00:35:10,444 --> 00:35:13,697
చాలా గొప్పవాడివేలే కానీ, ఇది
ఇద్దరు వ్యక్తులు చేయాల్సిన పని.

364
00:35:13,780 --> 00:35:15,449
ఏం పర్వాలేదు. నాకు ఇద్దరు వ్యక్తులంత
బలం ఉంది.

365
00:35:16,450 --> 00:35:18,035
బలానికీ, దీనికీ సంబంధమే లేదు.

366
00:35:18,619 --> 00:35:21,580
అవును, ఇటు చూడు.
ప్రక్రియ జరిగే సమయంలో రెండు స్విచ్చులను

367
00:35:21,663 --> 00:35:23,081
పట్టుకొని ఉండాలి.

368
00:35:24,082 --> 00:35:26,084
అదీగాక, అవి రెండూ తలుపు ఇరువైపులా ఉంటాయి.

369
00:35:28,462 --> 00:35:29,463
ఎలాగైనా నేను చేసేయగలను.

370
00:35:30,672 --> 00:35:32,716
వీడ్కోలు, బర్ట్!

371
00:35:33,425 --> 00:35:35,093
సోదరసోదరీమణులారా,

372
00:35:35,177 --> 00:35:39,765
ఇప్పుడు అందరూ మీ హీరోని ఉద్దేశించి
గట్టిగా చప్పట్లు కొట్టండి.

373
00:35:42,226 --> 00:35:45,312
అందరూ రండి! దగ్గరకు రండి.

374
00:35:45,395 --> 00:35:47,105
బర్ట్, బర్ట్, బర్ట్.

375
00:35:51,818 --> 00:35:53,237
పవర్

376
00:35:56,490 --> 00:35:58,534
శుభాభినందనలు, డిజైనర్లారా...

377
00:35:59,826 --> 00:36:01,411
ఒక రిఫైనర్ కి కూడా.

378
00:36:03,914 --> 00:36:05,999
మళ్లీ ఆ తలుపులను పరిశీలించాలి అన్నమాట.

379
00:36:06,667 --> 00:36:08,001
ఈలోపు...

380
00:36:08,710 --> 00:36:12,714
బర్ట్ జీ. ఇది మీ కోసమే.

381
00:36:12,798 --> 00:36:14,550
బై బై
వీడియో పేరు - "బర్ట్ జీ."

382
00:36:19,763 --> 00:36:20,764
హలో.

383
00:36:22,808 --> 00:36:24,810
ఇది కాస్త వింతగానే ఉంది, కానీ...

384
00:36:26,812 --> 00:36:29,273
ఈ ఉద్యోగం విషయంలో చాలా వరకూ
అన్నీ వింతగానే ఉన్నాయని చెప్పవచ్చు.

385
00:36:29,773 --> 00:36:32,067
నాకన్నా మీకే ఇవన్నీ బాగా తెలుసనుకుంటా.

386
00:36:32,150 --> 00:36:36,154
మీరందరూ ఎవరో నాకు తెలీదనుకోండి,

387
00:36:36,947 --> 00:36:39,533
కానీ మీతో నిలబడి ఉన్న ఆ వ్యక్తి నాకు తెలుసు.

388
00:36:40,325 --> 00:36:43,662
ఆయన మీతో దాదాపుగా ఏడేళ్లు పని చేశాడు,

389
00:36:43,745 --> 00:36:46,081
అవన్నీ ఫలవంతంగానే సాగి ఉంటాయని ఆశిస్తున్నా.

390
00:36:46,164 --> 00:36:48,417
అవి... అవి ఎలా గడిచాయో నాకు తెలీదు,

391
00:36:48,500 --> 00:36:51,670
అలాగే నేను, అంటే అతను
మీతో ఏం పని చేసేవాడో నాకు తెలీదు,

392
00:36:51,753 --> 00:36:57,467
కానీ మీతో ఉండి ఇంటికి చేరుకున్నాక
నాకు ఏ ఫిలింగ్ ఉంటుందో తెలుసు.

393
00:36:58,302 --> 00:37:03,974
ఇంటికి అలసటగానే చేరుకున్నా,
ఏదో సంతృప్తిగా, సాధించినట్టుగా అనిపించేది.

394
00:37:04,057 --> 00:37:05,976
మీరందరూ అంటే నాకు చాలా ఇష్టం కాబోలు.

395
00:37:06,059 --> 00:37:08,979
మీతో ఇవాళ నేను గడిపేది ఆఖరి రోజే అయినా,

396
00:37:09,062 --> 00:37:12,816
మీరందరూ నా మనస్సులో,

397
00:37:12,900 --> 00:37:18,447
అలాగే మెదడులోని నేను చేరుకోని తీరాల్లో
ఉంటారని నాకు తెలుసు.

398
00:37:18,947 --> 00:37:21,867
మీరు నాలో ఎంతటి ముద్ర వేశారో
ఇక్కడ ఉన్న నాకు తెలియకపోయినా,

399
00:37:22,367 --> 00:37:25,412
అది మాత్రం చెరపలేనిదని చెప్పగలను, ఇంకా...

400
00:37:25,954 --> 00:37:29,917
ఇక్కడ కూర్చొని ఉన్న నాకు
మిమ్మల్ని అసలు కలిసినట్టు గానీ,

401
00:37:30,000 --> 00:37:33,587
మీ పేర్లు గానీ, మీరు ఎలా ఉంటారని గానీ,

402
00:37:33,670 --> 00:37:36,215
అసలు మీరెంత మంది ఉంటారని గానీ

403
00:37:36,298 --> 00:37:39,176
ఏమీ తెలియకపోయినా కానీ

404
00:37:39,259 --> 00:37:42,012
నేను మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్తాను.

405
00:37:42,095 --> 00:37:44,765
ఏదేమైనా, నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

406
00:37:44,848 --> 00:37:46,975
ఇక బర్ట్, మనం కలుద్దాం.

407
00:37:47,684 --> 00:37:49,728
అభినందనలు.

408
00:37:50,729 --> 00:37:52,105
అదరగొట్టేశావు, బాసూ.

409
00:37:53,774 --> 00:37:55,108
సెలవు.

410
00:38:10,958 --> 00:38:13,710
మీరందరూ ఇక్కడ నిలబడి...

411
00:38:15,087 --> 00:38:16,588
అతని చావును కళ్లారా చూస్తారా?

412
00:38:17,172 --> 00:38:18,423
అర్వింగ్, ఏమంటున్నావు నువ్వు?

413
00:38:19,049 --> 00:38:24,513
వ్యవస్థాపకుని అడుగుజాడల్లో నడిచినందుకు
మాకు శిక్ష వేస్తున్నారా?

414
00:38:25,097 --> 00:38:29,476
బర్ట్ పనియేతర అవతారం పదవీ విరమణ పొందుతున్నాడు.
అది నీకు కూడా ఎప్పుడోకప్పుడు జరగాల్సిందే.

415
00:38:30,477 --> 00:38:32,938
నువ్వు ఆపరా, దొంగ చచ్చినోడా.

416
00:38:34,481 --> 00:38:35,941
నువ్వు మాత్రం వేర్పాటు పద్ధతి జరిపించుకోవు.

417
00:38:37,067 --> 00:38:39,152
నువ్వు బయటకు వెళ్లినా కూడా
నీకు ఇక్కడి జ్ఞాపకాలు అలాగే ఉంటాయి.

418
00:38:39,236 --> 00:38:41,738
నువ్వు ప్రతీరోజూ ఈ జ్ఞాపకాలతోనే ఇంటికి వెళ్తావు.

419
00:38:42,656 --> 00:38:45,868
ఎవరూ కూడా నీ నుండి
వాటిని తీసుకోలేరు, వేరు చేయలేరు.

420
00:38:46,535 --> 00:38:48,161
అవి నీలో ప్రత్యేకంగా ఏమీ ఉండవు.

421
00:38:48,829 --> 00:38:50,539
నీకు కూడా పని అవతారమంటూ ఏదీ ఉండదు!

422
00:38:50,622 --> 00:38:53,542
ఇక ఆపు! తక్షణమే ఎండిఆర్ కి వెళ్లిపో.

423
00:38:53,625 --> 00:38:55,919
మిస్టర్ మిల్చెక్, దయచేసి శాంతించడి.

424
00:38:56,003 --> 00:38:58,547
అతను ఇక్కడ ఉండటం నాకు సంతోషంగా ఉంది.

425
00:39:00,215 --> 00:39:01,633
అతను ఇక ఏమీ మాట్లాడకుండా ఉంటాడని మాట ఇస్తున్నా.

426
00:39:12,436 --> 00:39:15,856
నువ్వు బర్ట్ పార్టీలో ఉండి,
ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకవచ్చు.

427
00:39:16,523 --> 00:39:20,152
కానీ నీ ప్రవర్తన నీకు గానీ, ఈ మహత్తర చోటును
నెలకొల్పిన వ్యవస్థాకుని గానీ

428
00:39:20,235 --> 00:39:21,987
చేటు తెచ్చే విధంగా ఉండకూడదు.

429
00:39:25,407 --> 00:39:27,701
మీకందరికీ ఇవాళ ఏమైందో నాకు అర్థం కావట్లేదు.

430
00:39:36,376 --> 00:39:39,630
సరే, మిస్టర్ మిల్చెక్.

431
00:39:41,131 --> 00:39:45,427
ఇక మనందరం బర్ట్ కి వీడ్కోలు పలుకుదాం.

432
00:39:48,430 --> 00:39:50,933
పని అవతారానికి సంబంధించిన పదవీ విరమణ గేయం

433
00:39:54,937 --> 00:39:58,273
బర్ట్ పని అవతారానికి సంబంధించిన పదవీ విరమణ గేయం
మీకు అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.

434
00:40:16,250 --> 00:40:21,713
నిన్నటి రోజుకి శుభోదయం

435
00:40:22,422 --> 00:40:28,178
నువ్వు లేచావు, కానీ సమయం వేగంగా గడిచిపోయింది

436
00:40:28,846 --> 00:40:32,307
ఉన్నట్టుండి నీ జ్ఞాపకాలు

437
00:40:32,391 --> 00:40:35,143
గుర్తుకు రావడం లేదే

438
00:40:35,227 --> 00:40:40,858
గుర్తున్నాయా, నీకు గుర్తున్నాయా?

439
00:40:41,441 --> 00:40:46,738
గడిచిన కాలంలోని స్మృతులు

440
00:40:47,489 --> 00:40:53,120
ఆనందంగా గడిపిన క్షణాలు, ఏడ్చిన క్షణాలు

441
00:40:53,704 --> 00:40:56,957
నీకు ఎదురైన మంచి క్షణాలు, కష్టాలు

442
00:40:57,040 --> 00:41:00,127
ఆ మధ్యలో నువ్వు అనుభవించిన జీవితం

443
00:41:00,210 --> 00:41:04,631
గుర్తున్నాయా, నీకు గుర్తున్నాయా?

444
00:41:04,715 --> 00:41:08,385
నీ జీవిత జ్ఞాపకాలు?

445
00:41:08,468 --> 00:41:12,514
గుర్తున్నాయా?

446
00:41:12,598 --> 00:41:18,395
ఆనందంగా, బాధగా గడిపిన
క్షణాలను గుర్తు తెచ్చుకో

447
00:41:19,188 --> 00:41:24,443
వాటిని నీ మెదడులో దాచిపెట్టుకో

448
00:41:25,152 --> 00:41:30,699
జ్ఞాపకాలు అనేవి స్మృతులు

449
00:41:31,408 --> 00:41:37,331
రేపటి రోజున నీకు తలచుకోవడానికి పనికి వస్తాయి

450
00:41:39,124 --> 00:41:45,005
అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే

451
00:41:45,088 --> 00:41:47,007
అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే

452
00:41:47,090 --> 00:41:52,095
కాలం వేగంగా కదులుతోంది

453
00:41:53,096 --> 00:41:56,391
కనుక కుదిరినప్పుడే జ్ఞాపకాలను ఏర్పరచుకో

454
00:41:56,475 --> 00:41:59,394
నేటి కలలను గుర్తుంచుకో

455
00:41:59,478 --> 00:42:01,438
గుర్తుంచుకో

456
00:42:02,272 --> 00:42:07,236
నీ జీవిత జ్ఞాపకాలను గుర్తుంచుకుంటావా?

457
00:42:15,619 --> 00:42:16,620
అర్వింగ్?

458
00:42:29,424 --> 00:42:32,177
ఈ చోటును పుర్తిగా నాశనం చేసేద్దాం.

459
00:42:57,995 --> 00:42:59,830
గాంజ్ లోని కొత్త కళాఖండం "అశ్లీలంగా లేదు"

460
00:43:01,707 --> 00:43:03,458
గాంజ్ కాలేజీ ఉపకార వేతనాన్ని
సాధించిన వారిని ప్రకటించనుంది

461
00:43:03,542 --> 00:43:05,961
ఫార్మాకోలజీ మరియు సైకాలజీ
చదువుతున్న విద్యార్థినులకు.

462
00:43:42,080 --> 00:43:43,498
- హేయ్.
- హేయ్.

463
00:43:46,168 --> 00:43:47,169
నా ఫోన్ కోసం వచ్చాను.

464
00:43:48,337 --> 00:43:49,922
సరే. లోపలికి రా.

465
00:43:56,136 --> 00:43:57,137
ఎలా ఉన్నావు?

466
00:43:57,763 --> 00:43:59,681
- నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు?
- సూపర్.

467
00:43:59,765 --> 00:44:02,476
లోపలికి రా. వచ్చి ఆరాంగా కూర్చో.

468
00:44:04,561 --> 00:44:07,356
నీ ఫోన్ గోడకి, బెడ్ కి మధ్య ఉండింది.

469
00:44:09,399 --> 00:44:13,111
నేనే తెచ్చి ఇచ్చి ఉండేవాడిని, కానీ
నీ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు.

470
00:44:13,195 --> 00:44:15,489
కాబట్టి, ఇది చాలా మంచి విషయం.

471
00:44:19,284 --> 00:44:20,410
నువ్వు బాగానే ఉన్నావా?

472
00:44:21,537 --> 00:44:24,831
హా, బాగానే ఉన్నాను. కాస్తంత అలసటగా ఉందంతే.

473
00:44:26,625 --> 00:44:27,626
సరే. నేను బయలుదేరుతానులే.

474
00:44:27,709 --> 00:44:28,919
వద్దు, వద్దు. రా.

475
00:44:29,002 --> 00:44:31,004
హేయ్, చూడు. నువ్వు దీనికి
సిద్ధంగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు.

476
00:44:31,088 --> 00:44:33,173
- లేదు, నేను సిద్ధంగానే ఉన్నాను.
- లేదు.

477
00:44:33,257 --> 00:44:35,884
నువ్వు అస్సలు సిద్ధంగా లేవు.
నువ్వు చాలా దారుణమైన స్థితిలో ఉన్నావు.

478
00:44:35,968 --> 00:44:38,053
- నన్ను... నన్ను క్షమించు.
- సరే.

479
00:44:38,136 --> 00:44:41,849
ఇంకా... తన గురించి మాట్లాడినందుకు మన్నించు.

480
00:44:42,933 --> 00:44:44,560
లేదు, నేను మరీ అతిగా వాగాను. అది...

481
00:44:45,477 --> 00:44:47,938
ఓ విషయం చెప్పనా? నువ్వు తన గురించి
మాట్లాడినా, మాట్లాడకపోయినా పర్వాలేదు.

482
00:44:48,021 --> 00:44:50,232
- నువ్వు ఎలా కావాలంటే అలా ఉండు.
- సరే. ఆగు.

483
00:44:50,315 --> 00:44:51,316
ఇది చూడు.

484
00:45:00,826 --> 00:45:02,953
చూశావా? తనే నా భార్య.

485
00:45:14,548 --> 00:45:15,549
చింపేశా.

486
00:45:28,478 --> 00:45:29,479
ఏంటి?

487
00:45:30,939 --> 00:45:33,942
సరే అయితే.
నేను నీకు తన గురించి అన్నీ చెప్తాను.

488
00:45:35,152 --> 00:45:39,031
అలెక్సా, మనం... మనం జెమ్మా గురించి మాట్లాడుకోవచ్చు.

489
00:45:40,199 --> 00:45:43,660
తను చాలా గొప్ప వ్యక్తి. తను...

490
00:45:43,744 --> 00:45:45,245
ఉంటాను, మార్క్.

491
00:45:47,331 --> 00:45:48,457
నిజంగానా?

492
00:45:50,709 --> 00:45:51,710
ఓరి దేవుడా...

493
00:46:12,898 --> 00:46:14,316
తను చాలా గొప్ప వ్యక్తి.

494
00:46:23,867 --> 00:46:25,369
అసాధారణమైన వ్యక్తి.

495
00:46:36,713 --> 00:46:42,386
నేను నిన్ను మళ్లీ కలుస్తాను

496
00:46:43,428 --> 00:46:50,060
మనం ఒకప్పుడు కలుసుకొనే చోట్లలో

497
00:46:51,520 --> 00:46:58,360
రోజంతా నా మనస్సు నిండా

498
00:46:59,027 --> 00:47:02,781
అవే ఆలోచనలు

499
00:47:06,076 --> 00:47:12,583
ఆ చిన్ని హోటల్ లో

500
00:47:13,876 --> 00:47:19,882
ఎదురుగా ఉన్న పార్క్

501
00:47:21,633 --> 00:47:27,264
పిల్లల రంగులరాట్నం

502
00:47:28,557 --> 00:47:31,226
ఆ రావి చెట్టు

503
00:47:31,310 --> 00:47:34,688
నా భార్య చాలా అసాధారణమైన వ్యక్తి.

504
00:47:37,191 --> 00:47:42,529
నేను నిన్ను మళ్లీ కలుస్తాను

505
00:47:42,613 --> 00:47:45,824
నా భార్యకి జాజికాయలు పడేవి కావు.

506
00:47:45,908 --> 00:47:49,828
ప్రతీ ఆహ్లాదకరమైన వేసవి రోజున

507
00:47:49,912 --> 00:47:53,123
తను తుమ్మినప్పుడల్లా, రెండు సార్లు తుమ్మేది.

508
00:47:53,207 --> 00:47:58,337
ఆనందమైన, ఆనందం కాని క్షణాల్లోనూ

509
00:47:58,420 --> 00:48:00,672
నా భార్యకి ఇతరుల కుక్కలు నచ్చేవి.

510
00:48:00,756 --> 00:48:04,301
నేను నీ గురించి
ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను

511
00:48:04,384 --> 00:48:07,679
నా భార్యకి కార్డిగన్ కోట్లు నచ్చేవి కావు.

512
00:48:07,763 --> 00:48:10,432
నేను నిన్ను కలుసుకుంటాను...

513
00:48:10,516 --> 00:48:12,518
తనకు సంబంధించిన ఈ విషయాలన్నీ నాకు...

514
00:48:16,063 --> 00:48:17,064
చాలా ఇష్టం.

515
00:48:17,147 --> 00:48:21,944
అప్పుడే చీకటి పడితే

516
00:48:23,403 --> 00:48:27,783
నేను చందమామకేసి చూస్తాను

517
00:48:28,534 --> 00:48:33,372
కానీ నేను నిన్ను మళ్లీ కలుస్తాను

518
00:48:40,546 --> 00:48:47,386
నేను నిన్ను మళ్లీ కలుస్తాను

519
00:48:49,012 --> 00:48:55,018
ప్రతీ ఆహ్లాదకరమైన వేసవి రోజున

520
00:48:57,104 --> 00:49:03,360
ఆనందమైన, ఆనందం కాని క్షణాల్లోనూ

521
00:49:05,112 --> 00:49:11,243
నేను నీ గురించి
ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాను

522
00:49:12,327 --> 00:49:15,581
నేను నిన్ను కలుసుకుంటాను

523
00:49:16,290 --> 00:49:20,127
ఉదయించిన సూర్యునిలో

524
00:49:21,420 --> 00:49:27,342
అప్పుడే చీకటి పడితే

525
00:49:28,427 --> 00:49:33,390
నేను చందమామకేసి చూస్తాను

526
00:49:34,725 --> 00:49:41,732
కానీ నేను నిన్ను మళ్లీ కలుస్తాను

527
00:49:47,696 --> 00:49:49,698
ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య

